Mommy Brain: పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలలో జ్ణాపకశక్తి ఎందుకు తగ్గుతుంది?ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
Mommy Brain: పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీ శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. శారీరక మార్పుతలో పాటు ఎక్కువ మంది ఎదుర్కొనే మానసిక సమస్య ఏంటంటే మతిమరుపు. మీకూ డెలివరీ తర్వాత మతిమరుపు పెరిగిందా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇందుకు పరిష్కారం ఏంటి ఇక్కడ తెలుసుకోవచ్చు.
తల్లి అయిన తర్వాత స్త్రీ శరీరంలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. అయితే వీటన్నింటికన్నా మించి కొందరు ఎదుక్కునే మానసిక సమస్య ఏంటంటే మతిమరుపు. పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది తల్లుల్లో జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలతో పాటు ముఖ్యమైన విషయాలు కూడా మర్చిపోతారు. ఇది సాధారణమే అయినప్పటికీ కొందరిలో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలలో జ్ఞాపకశక్తి తగ్గడం అనేది శారీరక, భావోద్వేగ ,హార్మోనల్ మార్పుల వల్ల చోటుచేసుకుంటుంది. ఈ ప్రభావం"మామాల జ్ఞాపకశక్తి" (Mommy Brain) అని పిలుస్తారు.
దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు:
హార్మోన్ల మార్పులు: గర్భధారణ సమయంలో, పిల్లలు పుట్టిన తరువాత మహిళల శరీరాల్లో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా, ప్రొజెస్టరోన్, ఓక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లులకు సహజంగా మరింత సానుభూతిని కలిగించేందుకు కారణమవుతాయి. ఈ హార్మోన్ల ప్రభావంతో కొన్ని సందర్భాల్లో జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం కనపడవచ్చు.
పిల్లల సంరక్షణ బాధ్యత: పిల్లలను సంరక్షించేందుకు కొత్త తల్లులు మరింత శక్తి, సమయం ,శ్రద్ధ వెచ్చించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, తల్లులకు మిగతా విషయాలను మర్చిపోవడం లేదా కొంత కాలం దృష్టిలో సమస్యలు రావడం సాధారణం.
నిద్రలేమి: నిద్రకు అవసరమైన సమయం స్త్రీలకు తగినంత లభించకపోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిల్లలు రాత్రిపూట చాలా సార్లు నిద్ర నుంచి లేచి ఏడుస్తూ ఉండటం వల్ల తల్లులు కూడా మేల్కొవాల్సి ఉంటుంది. ఇలా అంతరాయాలతో కూడిన నిద్ర తల్లుల్లో జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.
భావోద్వేగ మార్పులు: ప్రెగ్నెన్సీ ,ప్రసవం తర్వాత, తల్లులు అనుభవించే భావోద్వేగ మార్పులు కూడా వారి మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు ఆందోళన, బాధలు ఇవి తల్లుల మానసిక సమర్థతపై ప్రభావం చూపించవచ్చు.
మెమొరీపై శారీరక మార్పులు: హార్మోనల్ మార్పులతో పాటు, శరీరంలో జబ్బులు, తరచుగా అలసటగా ఫీలవుతుండటం లేదా శక్తి కోల్పోవడం కూడా జ్ఞాపకశక్తి తగ్గించడానికి కారణమవుతుంది.
ఈ మొత్తం ప్రక్రియ సహజమే, సాధారణంగా పిల్లల వయస్సు పెరిగి వారి పనులు వారు చేసుకోగలిగినప్పుడు, లేదా తిరిగి మహిళలు తమ దైనందిక జీవితంలో నిమగ్నమైపోయినప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు చేయాల్సిన పనులు:
1. శరీరానికి సరిపడా నిద్ర:
పిల్లల సంరక్షణ సమయంలో నిద్ర కొరత అనేది ప్రధాన కారణం. తల్లులు రోజు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకే సమయానికి నిద్రపోవడం, తేలికపాటి నిద్ర పద్ధతులను అనుసరించాలి.
2. ఆహారం, పోషకాలు:
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే బెర్రీలు, పాలకూర, కరివేపాకు, విటమిన్స్ (విటమిన్ B, D, E) జ్ఞాపకశక్తిని బలపరిచేందుకు ఉపయోగపడతాయి.
3. వ్యాయామం:
శారీరక వ్యాయామం కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండోఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
4. మానసిక, భావోద్వేగ ఆరోగ్యం:
తల్లులను మానసిక ఆరోగ్యాన్ని పటిష్టం చేసేందుకు ధ్యానం, ప్రాణాయామం వంటి మానసిక శాంతి సాధనాలు చేయడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
5. జ్ఞాపక శక్తి సాధనాలు:
మెమొరీ గేమ్స్ లేదా పజిల్స్ ఆడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం, గణితం, పద్యాలు లేదా ప్రాక్టికల్ మతిమరుపు వ్యాయామాలు చేయడం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
6. హార్మోనల్ సమతుల్యత సాధించడం:
అవసరమైన హార్మోన్ల సమతుల్యతను పొందడానికి డాక్టర్ సూచించినట్టు మందులు తీసుకోవడం లేదా శరీరానికి అనువైన మార్గాలను అనుసరించడం మంచిది. హార్మోన్ల స్థాయిలపై స్థిరత్వం రాకపోతే,ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవచ్చు.
ఈ సలహాలను అనుసరించడం ద్వారా, తల్లుల జ్ఞాపకశక్తి సమస్యను తగ్గించుకోవచ్చు. వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్