Mother and Son: తల్లీ కొడుకుల మధ్య బంధం ఎందుకంత బలంగా ఉంటుంది? దానికి ఇవే కారణాలు
Mother and Son: తల్లీ, కొడుకు మధ్య అనుబంధం ఎంతో అందంగా ఉంటుంది. అది ఎంతో ప్రత్యేకమైనది కూడా. ఇది ప్రేమ, అవగాహన, పరస్పర విశ్వాసంతో నిండి ఉంటుంది. అమ్మ కొడుకుకు మొదటి ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, అతని ఉత్తమ స్నేహితురాలు కూడా.

ఏ తల్లిదండ్రులై జీవించేది వారి పిల్లల కోసమే. తమకు పుట్టిన పిల్లలందరూ వారికి ప్రాణమే. వారు తమ పిల్లలపై నిస్వార్థంగా సమానమైన ప్రేమ, శ్రద్ధను అందిస్తారు. అయినప్పటికీ, తల్లికి తమ కూతుళ్లకన్నా కొడుకు ఎక్కువగా దగ్గరవుతాడు. అదే కుమార్తెలు తమ తండ్రితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు. దీని వెనుక ఉన్న కారణాన్ని మానసిక నిపుణులు వివరిస్తున్నారు.
అమ్మ, కొడుకుల మధ్య బంధం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రేమ, అవగాహన, పరస్పర విశ్వాసంతో నిండి ఉంటుంది. తల్లే తన ముద్దుల కొడుకుకు మొదటి ఉపాధ్యాయురాలు, ఉత్తమ స్నేహితురాలు కూడా. ఇదే వారి బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కొడుకు తండ్రి కన్నా తల్లితోనే తన మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పగలడు. తన కష్టాన్ని, ఇష్టాన్ని తల్లితోనే చెప్పుకుంటాడు. వీరి బంధం ఎంతో అందంగా ఉంటుంది.
నిస్వార్థమైన ప్రేమ
ఒక తల్లి తన కొడుకును ఎటువంటి షరతులు లేకుండా, స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది. కొడుకు ఎలా ఉన్నా, తల్లి అతన్ని ఎల్లప్పుడూ తన హృదయంలోనే ఉంచుకుంటుంది. కొడుకు తన కోసం ఏమైనా చేస్తాడో లేదో అనే దానితో ఆమెకు సంబంధం లేదు, ఆమె ఎల్లప్పుడూ అతని మంచి కోరుకుంటుంది.
అమ్మే ఉత్తమ స్నేహితురాలు
ఒక కొడుకుకు తన తల్లి లాంటి మరొక స్నేహితురాలు ఉండదు. కొడుకులు తమ రహస్యాలు ఏవీ దాయకుండా ఎలాంటి సంకోచం లేకుండా తమ తల్లితో పంచుకుంటారు. తల్లి వారిని తప్పు పట్టకుండా, వారి సమస్యను అర్థం చేసుకొని, దానికి పరిష్కారం చెబుతుందని వారికి తెలుసు. కొడుకుకు తన తల్లి ఏ విధమైన ఇబ్బందుల నుండైనా తనను బయటపడేస్తుందనే నమ్మకం ఉంటుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు తల్లే గుర్తుకువస్తుంది.
భావోద్వేగాలను పంచుకోవడం సులభం
కొడుకు బయటకు ఎంత బలంగా, మొరలుగా కనిపించినా… లోపల మాత్రం భావోద్వేగంతో నిండిపోయి ఉంటాడు. అలాంటి కొడుకులు అందరితోనూ తమ భావాలను పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ, చిన్నప్పటి నుండి తమ మనసులోని మాటలను తల్లితో పంచుకునే కొడుకులు పెద్దయ్యాక కూడా తల్లి దగ్గరకు వచ్చినప్పుడు తెరిచిన పుస్తకంలా మారతారు. వారికి తల్లి ఒడిలో తల పెట్టుకుని తమ భావోద్వేగాలను పంచుకోవడం వంటివి చేస్తారు.
కేరింగ్ స్వభావం
తల్లి-కొడుకుది రక్తబంధం మాత్రమే కాదు, భావోద్వేగాలు, అనుభవాలతో కూడా ముడిపడి ఉంటుంది. చిన్నప్పటి నుండి తల్లినే కొడుకుపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంది. తల్లి చూపించే నిస్వార్థమైన ప్రేమ, శ్రద్ధ కొడుకుకు బాగా అర్థమవుతుంది. అందుకే తల్లి కొడుకు హృదయంలో ఉంటుంది.
తల్లి కోరిక
స్కూల్లో స్నేహితుడితో గొడవ పెట్టుకోవడం నుండి ఆఫీసు ఒత్తిడి వరకు, కొడుకు చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు తన ప్రతి సమస్యకు పరిష్కారం కోసం మొదట తన తల్లి దగ్గరకే వెళతాడు. తల్లి అతన్ని అర్థం చేసుకుంటుందని, సరైన సలహా ఇచ్చి సమస్యను పరిష్కరిస్తుందని అతనికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఒక కొడుకుకు అతని తల్లే దైవం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు తల్లిని కొడుకుకు దగ్గర చేస్తుంది. వారిద్దరినీ ప్రేమ బంధంతో కట్టిపడేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్