Cat Meow Reasons : పిల్లులు మనిషిని చూసినప్పుడు మియావ్ అని ఎందుకు అరుస్తాయి?
Cat Meow Meaning : పిల్లి అనగానే మెుదట గుర్తొచ్చేది మియావ్ అనే శబ్దం. అయితే ఇలా పిల్లులు సౌండ్ చేయడం వెనక చాలా ఇంట్రస్టింగ్ విషయాలు ఉన్నాయి. మనుషులను చూసినప్పుడు పిల్లులు మియావ్ అని ఎందుకు అంటాయి?
ఏ జంతువైనా చేసే ఒక్కో శబ్దం ఒక్కో అర్థాన్ని కలిగి ఉంటుంది. కుక్కల తర్వాత ఇంట్లో పెంచుకునే జంతువుల్లో పిల్లులు కూడా ఒక్కటి. మనుషులతో ఇవి కూడా త్వరగా కనెక్ట్ అవుతాయి. వాటి అవసరాలను శబ్దాల ద్వారా అడుగుతుంటాయి. పిల్లులు కేవలం మియావ్ అని మాత్రమే శబ్దం చేయవు. చాలా రకాలుగా శబ్దం చేస్తాయి. అయితే మనుషులతో కమ్యునికేట్ చేసేందుకు మాత్రమే అవి.. ఎక్కువగా మియావ్ అనే సౌండ్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పిల్లులు మియావ్ అనే శబ్దం చేయడం అనేది ఎక్కువగా అందరికీ తెలుసు. కానీ పిల్లులు రకరకాల శబ్దం చేస్తాయి. వేరే పిల్లితో కమ్యూనికేట్ చేసేందుకు మియావ్ అనే శబ్దం ఉపయోగించవని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పిల్లి తన పిల్లల కోసం వెతికే సమయంలో మాత్రం మియావ్ చేస్తాయట. ఎక్కువగా మనుషులకు ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతోనే మియావ్ అని అంటుంది పిల్లి.
పిల్లి మియావ్ అనగానే.. అది దాని సహజ పద్ధతి అని సైలెంట్‍గా ఉండి పోకూడదు. ఎందుకంటే.. అది ఏదో చెప్పాలనే ఉద్దేశంతోనే సౌండ్ చేస్తుంది. అది శబ్దంగా మాత్రమే తీసుకోవద్దు. పిల్లి మియావ్ అనే శబ్దం చేస్తే.. అది ఆకలితో ఉందని అర్థం. దీంతో దాని యజమాని దానివైపు చూసి.. ఏదైనా తినేందుకు ఇస్తాడు. అయితే పిల్లి పాలు తాగిన తర్వాత కూడా ఒక్కోసారి మెల్లగా మియావ్ అంటుంది. దీనికి కారణం ఏంటంటే.. దాని అవసరాలు తీర్చబడుతున్నాయని అర్థం చేసుకోవాలట.
ఏదైనా కోరుకున్నప్పుడు మనుషులు ఉన్న చోటికి వచ్చి.. పిల్లులు మియావ్ అంటుంటాయి. అది ఆకలి కావొచ్చు, ప్రేమ కావొచ్చు.. ఇలా శబ్దం చేస్తూ ఉంటాయి. అందుకే సౌండ్ చేస్తూ.. మీ పాదాల దగ్గర వచ్చి తిరుగుతూ ఉంటుంది. అంటే మీరు దగ్గరకు తీసుకోవాలని అవి కోరుకుంటున్నాయని అర్థం. తోక పైకి లేపుతూ.. మియావ్ అంటూ మీ చుట్టు తిరుగుతూ ఉంటుంది. వాటిని దగ్గరకు తీసుకుని.. వీపుపై చేతిలో అటు ఇటు అంటే హ్యాపీగా ఫీలవుతాయి.
మీరు ఎత్తుకోకుంటే నిరాశతో కూడా శబ్దం చేస్తూ ఉంటుంది పిల్లి. అయితే ఈ సౌండ్‍లో మాత్రం కాస్త మార్పు ఉంటుంది. వాటి ఆనందం, బాధ వ్యక్తపరిచే సమయంలోనూ శబ్దంలో మార్పు ఉంటుంది. అంతేకాదు.. వాటికి ఒంట్లో బాగాలేకపోయినా.. మియావ్ అనే శబ్దా్న్ని భిన్నంగా చేసి.. యజమానికి చెప్పాలని ప్రయత్నిస్తుందట.
టాపిక్