Dry Skin between Fingers: వేళ్ల మధ్యలో చర్మం పొడిగా ఎందుకు ఉంటుందో ఆలోచించారా? ఇది కూడా ఒక చర్మ సమస్యేనని తెలుసా?
Dry Skin between Fingers: చాలా మందికి వేళ్ల మధ్య చర్మం పొడిగా మారి ఇబ్బంది పెడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కూడా ఒక చర్మ సమస్యే అని మీకు తెలుసా? దీనికి కారణాలేంటి? ఎటువంటి చికిత్సా విధానాలుంటాయో తెలుసుకుందాం రండి.

వాతావరణం మారుతున్న కొద్దీ చర్మపు స్వభావంలో అనేక మార్పులు గమనిస్తాం. మొఖంతో పాటు చేతులపై చర్మం పొడిబారిపోయి సమస్యగా మారుతుంది. ఇది కేవలం వాతావరణం వల్లనే ఏర్పడిందని భావించి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఇది చర్మ సమస్య కూడా కావొచ్చు. డైషిడ్రోటిక్ ఎగ్జిమా అనే చర్మ సమస్య కూడా మీ వేళ్ల మధ్య చర్మాన్ని పొడిగా మార్చేయొచ్చు.
వేళ్ల మధ్య చర్మం పొడిబారడానికి కారణాలు:
వాతావరణ పరిస్థితులు
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చల్లటి వాతావరణంతో పాటు తక్కువపాటి తేమ చర్మాన్ని ఇబ్బందికి గురి చేస్తుంది.ఫలితంగా చర్మం పొడిబారి, వేళ్ల మధ్యలో మరింత బిగుతుగా మారిపోతుంది.
డైషిడ్రోటిక్ ఎగ్జిమా
ఈ సమస్యను డైషిడ్రోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది పాదాలలో, అరచేతులలో కలగొచ్చు. చిన్న పరిమాణంలో మొదలై క్రమంగా పెరుగుతుంటాయి. ఇది జెనెటికల్ గా, అలర్జిక్ రియాక్షన్స్ కారణంగా, చెమట ఎక్కువగా పట్టడం వల్ల, రోగ నిరోధక శక్తి తగ్గించే ఒత్తిడి వల్ల కూడా కలగొచ్చు.
చేతులు కడుగుతుండటం
సబ్బులతో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో తరచూ మీ చర్మాన్ని కడుగుతూ ఉండటం వల్ల అందులో ఉండే సహజ నూనెలు దూరమవుతాయి. ఫలితంగా చర్మం ఎర్రబారి పోవడం, పొడిగా మారిపోవడం జరుగుతుంది. సోడియం లారైల్ సల్ఫేట్, ఇథనాల్, పారాబెన్స్ వంటి మూలకాల కారణంగా చర్మం పొడిబారుతుంది. ఇది వేళ్ల మధ్యలో చర్మాన్ని పొడిగా మారేలా చేస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్
వేలి చివర్లలోనే కాకుండా వేళ్ల మధ్యలో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కలగొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు అయిన టినియా మానూమ్, తామర వంటి వాటి వల్ల కూడా ఇలా జరగొచ్చు. చర్మంలో పగుళ్లు రావడం, పొడిబారడం వంటి సమస్యలకు కారణం కావొచ్చు.
విటమిన్ లోపం:
వేళ్ల మధ్యలో చర్మం పొడిబారడానికి కారణం విటమిన్ ఏ లోపం కూడా కావొచ్చు. చర్మంలోని కణాలు తిరిగి ఉత్పత్తి కావడానికి, సీబమ్ ఉత్పత్తికి విటమిన్ ఏ అవసరం. ఆ లోపం కారణంగా పొడి బారడం, గరుకుదనం వంటి సమస్యలు కనిపిస్తాయి.
డెర్మటైటిస్ కారణంగా కూడా ఈ సమస్య కలగొచ్చు. వేలి చివరతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లోనూ పొడి బారే సమస్యకు దారి తీస్తుంది.
దురద లేకుండా పొడి చర్మం కలగొచ్చా?
చర్మం పొడిబారడం కారణంగా దురద కలగడం సహజం. కానీ, కొన్ని సార్లు వేళ్ల మధ్యలో చర్మం పొడిబారినప్పుడు దురద లేకపోవడం సాధారణమే. ఇది తరచూ చేతులు కడుగుకోవడం, కఠినమైన సబ్బు వాడటం వల్ల కలగొచ్చు. దీని వల్ల చర్మంపై ఇరిటేషన్ వస్తుంది.
చర్మం పొడిబారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వాతావరణాన్ని బట్టి శరీరాన్ని శుభ్రం చేసుకునే సబ్బు ఎంచుకోవాలి.
- సెరమైడ్స్, హైఅల్యురోనిక్ యాసిడ్, గ్లిసరిన్ వంటి రసాయనాలను రోజూ అప్లై చేసుకుంటుండాలి.
- కఠినమైన సబ్బులు, ఆల్కహాల్ తో తయారుచేసిన శానిటైజర్లను పూర్తిగా మానేయాలి.
- హైడ్రేషన్ గా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం సరిపడా నీరు తాగడం, విటమిన్ ఏ ఎక్కువగా దొరికే ఆకుకూరలు, క్యారెట్లు, బీన్స్ ఎక్కువగా తీసుకోవాలి.
- వేడి నీళ్లను తక్కువగా వాడటం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది.
సంబంధిత కథనం