Astronauts Hair: అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు జుట్టును ఇలా విరబూసుకునే ఉంచుతారు ఎందుకు? జడ వేసుకోవడం కుదరదా?-why do female astronauts leave their hair so loose in space cant they wear braids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Astronauts Hair: అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు జుట్టును ఇలా విరబూసుకునే ఉంచుతారు ఎందుకు? జడ వేసుకోవడం కుదరదా?

Astronauts Hair: అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు జుట్టును ఇలా విరబూసుకునే ఉంచుతారు ఎందుకు? జడ వేసుకోవడం కుదరదా?

Haritha Chappa HT Telugu

Astronauts Hair: అంతరిక్షంలోని వ్యోమగాములు జుట్టును ఎప్పుడూ మూడేసినట్టు కనిపించరు. సునీత విలియమ్స్ కూడా తన జుట్టును మొత్తం విరబూసుకునే వీడియోలో కనిపిస్తుంది. వారు ఇలా అంతరిక్షంలో జుట్టును ఎందుకు వదులుతారో తెలుసుకోండి.

అంతరిక్షంలో సునీత విలియమ్స్

మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పటి వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకి చేరుకున్నారు. ఆమెకు సంబంధించిన వీడియోలు మాత్రం ఇంకా ట్రెండవుతూనే ఉన్నాయి. ఆ వీడియోలలో ఆమె తన జుట్టును మొత్తం స్వేచ్ఛగా వదిలేసింది. ఈమె మాత్రమే కాదు ఎంతోమంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును అలా వదిలేసి అంతరిక్ష కేంద్రంలో కనిపిస్తూ ఉంటారు. వీరంతా అంతరిక్ష కేంద్రంలో ఎందుకు జుట్టును ముడి వేసుకోరు? ఎందుకలా వదిలేస్తారు? అనే ప్రశ్న ఎంతోమందికి మెదులుతుంది.

అంతరిక్షంలో జుట్టుపై ప్రభావం

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అదే భూమిపై గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి జుట్టు కింది వైపుగా లాగినట్టు ఉంటుంది. అలాగే వెంట్రుకలు రాలడం, తరచుగా చిక్కులు పడడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి జుట్టు గాలిలో తేలికగా తేలుతున్నట్టు ఉంటుంది. అది ముఖం మీదకి కూడా పడదు. అందుకే జుట్టు ఉన్నా లేకపోయినా ఒకటేలా అనిపిస్తుంది. దాన్ని ముడివేయాల్సిన అవసరం కూడా లేదు. వదిలేసినా కూడా అది ముఖం మీద పడకుండా అలా పైకే గాలిలో ఉంటుంది. అందుకే వ్యోమగాములకు తమ పని చేసేటప్పుడు ఆ వెంట్రుకలు కళ్ళల్లో పడతాయనే బాధ లేదు. కాబట్టి వాటిని ప్రత్యేకంగా ముడి వేయాల్సిన అవసరం ఉండదు. అందుకే వారు జుట్టు విషయంలో పెద్దగా పట్టించుకోరు.

గురుత్వాకర్షణ శక్తి ఉంటేనే జుట్టు చిక్కులు పడుతుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి వెంట్రుకలు ఒకదానికొకటి అతుక్కుపోయి చిక్కు పడే అవకాశం ఉండదు. అలాగే వాటిని దువ్వుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారం రోజులు పాటు జుట్టును దువ్వుకోకపోయినా అక్కడ చిక్కుపడకుండా అలాగే ఉంటుంది. కొంతమంది వ్యోమగాములు నెలల తరబడి జుట్టుపై దువ్వెన కూడా పెట్టరు. ఆ జుట్టును అలానే వదిలేస్తారు.

అలాగే జుట్టును ముడివేస్తే అప్పుడప్పుడు వ్యోమగాములు హెల్మెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ముడి వేసినప్పుడు అది హెల్మెట్ కు తగులుతూ ఇబ్బంది పెడుతుంది. అదే జుట్టును అలా వదిలేస్తే మెత్తగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ లోపలికి జుట్టు తేలికగా చేరుతుంది. అలాగే సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

అంతేకాదు జీరో గ్రావిటీ దగ్గర గాలిలో తేలుతున్నట్టు, స్వేచ్ఛగా అనిపిస్తుంది. అలా జుట్టు కూడా స్వేచ్ఛగా తేలుతూ ఉంటే ఏదో తెలియని ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది. వ్యోమగాములు అలా జుట్టును వదిలేసి ఉంటే ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది. వారికి జుట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కూడా లేదు. అందుకే జుట్టును అలా వదిలేస్తారు. ముడి వేయాల్సిన అవసరం వారికి రాదు. వీడియోలలో జుట్టు కూడా గాలిలో నచ్చినట్టు ఎగురుతూ ఉంటుంది. ఇది ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం