Indian Fabric: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఈ ఇండియన్ ఫ్యాబ్రిక్‌ను బ్రిటిష్ వాళ్ళు ఎందుకు నిషేధించారు?
Indian Fabric: భారతదేశం సకల కళలకు నెలవైన భూమి. మన దేశంలో ఎన్నో వస్త్రాల ఆవిష్కరణ కూడా జరిగింది. ఇవి చరిత్రపై చెరగని ముద్రను వేసాయి. అయితే మన దేశానికి చెందిన ఒక ఫ్యాబ్రిక్ బ్రిటిష్ నిషేధించింది.
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన దేశంలో చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అవి ప్రపంచానికి కూడా దారి చూపాయి. అలాగే సృజనాత్మకతకు ఈ భూమి నెలవైనది. మన దేశం అత్యుత్తమ చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఐరోపాలో కేవలం మన దేశ వస్త్రాలనే వినియోగించేవారు. మనదేశంలో తయారైన ఫ్యాబ్రిక్‌ను ఎగుమతి చేసుకొని అక్కడ దుస్తులను కుట్టించుకునేవారు. మన దేశం నుంచి ప్రయాణించిన ఫ్యాబ్రిక్ ప్రపంచంలోనే అత్యుత్తమ వస్త్రంగా పేరు తెచ్చుకుంది. కానీ బ్రిటిష్ వారు అలాంటి ఒక ఫ్యాబ్రిక్ పై నిషేధాన్ని విధించారు.
ఏమిటా ఫ్యాబ్రిక్?
బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురై నిషేధానికి బారినపడిన ఫ్యాబ్రిక్ పేరు చీంట్. భారతీయ హస్త కళా పద్ధతులను ఉపయోగించి చేత్తోనే పెయింట్ చేసి అమ్మే అత్యంత ప్రసిద్ధ భారతీయ వస్త్రాలలో ఇది ఒకటి. అలాగే ఇది పురాతనమైన భారతీయ వస్త్రంగా కూడా చెప్పుకుంటారు. దీని మూలాలు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు అంటారు. ప్రకాశవంతమైన రంగులతో సున్నితమైన కాటన్ వస్త్రం పై వేసే డిజైన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.ఈ ఫ్యాబ్రిక్ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేశారు. ముఖ్యంగా యూరోపియన్లకు ఇది బాగా నచ్చింది. దీంతో యూరోపియన్లు విపరీతంగా ఈ ఫ్యాబ్రిక్ ను వినియోగించేవారు.
1498లో వాస్కోడిగామా సముద్రయానంతో భారతదేశానికి వచ్చాక ఈ ఫ్యాబ్రిక్ కూడా ప్రపంచానికి పరిచయమైంది. ఈ ఫ్యాబ్రిక్ నాణ్యతగా ఉండడం, అతి తక్కువ ధరకే రావడంతో ఎంతోమంది వీటిని వాడడం మొదలుపెట్టారు. దీంతో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు ఇబ్బంది పడ్డాయి. తమ దేశానికి చెందిన ఫ్యాబ్రిక్ అమ్ముడుపోకపోవడం, తమ టెక్స్ టైల్ మిల్లులు మూతపడడం వంటివి వారిలో కోపాన్ని పెంచాయి. వెంటనే ఇండియన్ ఫ్యాబ్రిక్ అయిన చీంట్‌ను నిషేధం ఇస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో కొన్నాళ్లకు చీంట్ అనే ఫ్యాబ్రిక్ గురించి దాదాపు ప్రపంచమంతా మరిచిపోయింది. ఈ ఫ్యాబ్రిక్ చరిత్రలో కలిసిపోయింది.
యూరోప్‌లో ఎంతోమంది చీంట్‌ను పోలిన ఫ్యాబ్రిక్‌ను తయారు చేసేందుకు ప్రయత్నించారు. తాను తయారుచేసిన వస్త్రాన్ని చీంట్ అని చెప్పి కూడా అన్నారు. కానీ ఆ వస్త్రానికి మన దేశంలో తయారైన చీంట్ ఫ్యాబ్రిక్ ఎంతో తేడా ఉంది.
చీంట్ ఫ్యాబ్రిక్‌తో యూరోప్‌లోని ధనవంతులంతా తమ ఇంటిని అలంకరించుకునేవారు, కర్టైన్ల రూపంలో, కార్పెట్ల రూపంలో కూడా వాటిని మార్చేవారు. బెడ్ కవర్లుగా కూడా వాడేవారు. 1857లో బ్రిటన్‌లోని టెక్స్ టైల్ మిల్లులు చీంట్ లాంటి ఫ్యాబ్రిక్ ను సృష్టించాయి. కానీ అవి ఈ ఫ్యాబ్రిక్‌కు ఉన్న నాణ్యతను అందుకోలేకపోయాయి. ఇప్పటికి ఇతర దేశాలకు ఎగుమతి కావడం లేదు.
మన దేశంలో చీటీతో తయారుచేసిన అనేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి వాడుతున్న వారికి కూడా ఆ ఫ్యాబ్రిక్ పేరు ఇప్పుడు తెలియదు. ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి ఇంటి ఫ్యాబ్రిక్ తో కుట్టిన దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడతారు.