Valentines Day: ఫిబ్రవరి 14నే ఎందుకు ప్రేమికుల రోజు నిర్వహించుకోవాలి? వాలెంటైన్ ఎవరు?
Valentines Day: ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ డే నిర్వహించుకుంటారు. ఈ రోజు ప్రపంచ ప్రేమికులందరికీ ఎంతో ప్రత్యేకం. మరి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను ఎందుకు జరుపుకుంటారో ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత తెలుసుకోండి.

ప్రేమ అనంతమైనది . ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో ప్రేమ పుడుతుంది. ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే ఎక్కడ చూసినా గులాబీలు, టెడ్డీబేర్లు, చాక్లెట్లు అమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించుకుంటారు .వాలెంటైన్స్ వీక్ రోజ్ డేతో మొదలై ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.
చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ రోజు కోసం ఎదురు చూస్తారు. అయితే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను ఎందుకు నిర్వహించుకుంటారో చాలా మందికి తెలియదు. ప్రేమకు చిహ్నంగా వాలెంటైన్స్ డే ఎలా పుట్టుకొచ్చింది? దాని చరిత్ర ఏమిటో తెలుసుకోండి.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ఎలా మొదలైంది?
వాలెంటైన్స్ డేను అనేక శతాబ్దాలుగా ఫిబ్రవరి 14న జరుపుకుంటున్నారు. 14 వ శతాబ్దం నుండి వాలెంటైన్స్ డేను నిర్వహించుకుంటున్నట్టు చరిత్ర చెబుతోంది. 8 వ శతాబ్ధంలోనే ఫిబ్రవరి 14 ను సెయింట్ వాలెంటైన్ పండుగగా చేసుకునేవారని అంటారు. వాలెంటైన్స్ డేను వసంత రుతువు ప్రారంభంలో నిర్వహించుకునేవారని అందుకే ఫిబ్రవరి నెలలో ఇది వచ్చిందని కూడా అంటారు.
ఈ ప్రేమికుల రోజు పుట్టుక వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది… ఫిబ్రవరి మధ్యలో జరిగే రోమన్ పండుగ లుపెర్కాలియా. ఈ పండుగే వాలెంటైన్స్ డేగా మారిందని చెబుతారు. ఈ పండుగను వసంతకాలంలో జరుపుకునేవారు. ఈ పండుగలో లాటరీ తీయడం ద్వారా ఏ పురుషుడితో, ఏ స్త్రీ జతకట్టాలన్నది నిర్ణయించేవారు. పోప్ గెలాసియస్ ఈ పండుగను మొదటి సారి వాలెంటైన్స్ డేగా మార్చాడని చెబుతారు. ఈ కథ ప్రకారం, 14 వ శతాబ్దంలో, వాలెంటైన్స్ డే వేడుకలు ప్రారంభమయ్యాయి.
మరో పురాణం ప్రకారం సెయింట్ వాలెంటైన్ ఫిబ్రవరి 14 న మరణ శిక్షకు గురయ్యాడు. రోమ్ రాజు రెండవ క్లాడియస్ పాలనలో ఉంది. క్లాడియస్ తన సైనికులలో ఎవరూ వివాహం చేసుకోరాదని కఠినమైన ఆజ్ఞను విధించాడు. ఆ సమయంలో రాజు నిర్ణయాన్ని విబేధించాడు వాలెంటైన్. సైనికులకు రహస్యంగా వివాహం చేశాడు. సైనికుల జీవితాల్లో ప్రేమను నింపాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు క్లాడియస్ ఫిబ్రవరి 14 న వాలెంటైన్ ను ఉరితీశాడు. అతని త్యాగానికి గుర్తుగా వాలెంటైన్స్ డే అదే రోజు నిర్వహించుకోవడం మొదలైందని అంటారు.
ప్రేమికుల రోజును ప్రేమ దేవత అయిన క్యూపిడ్ కూడా సూచిస్తుంది. రోమన్ పురాణాల ప్రకారం క్యూపిడ్ శుక్రుడి కుమారుడు. అతను ప్రేమ, అందాన్నిచ్చే దేవుడు. క్యూపిడ్ చేత్తో పట్టకున్న విల్లు,బాణం హృదయాన్ని చీల్చడమే కాదు, ప్రేమ మంత్రాన్ని కూడా సూచిస్తుంది. ఈ రోజును అతని జ్ఞాపకార్థం కూడా జరుపుకుంటారని ఒక నమ్మకం.
వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్
మన ప్రియమైన వారితో సమయం గడపడం, వారి ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడం, రెస్టారెంట్ లో వారితో కలిసి భోజనం చేయడం, టూర్ నిర్వహించడం, లాంగ్ డ్రైవ్ లు మొదలైనవి వాలెంటైన్స్ డేను నిర్వహించుకోవచ్చు.
సంబంధిత కథనం