Toilet Flush: టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? వీటిని సరిగ్గా ఉపయోగిస్తున్నారో లేదో మీకు తెలుసా?-why are there two buttons in toilet flush what are their uses and benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toilet Flush: టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? వీటిని సరిగ్గా ఉపయోగిస్తున్నారో లేదో మీకు తెలుసా?

Toilet Flush: టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? వీటిని సరిగ్గా ఉపయోగిస్తున్నారో లేదో మీకు తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Jan 06, 2025 05:00 PM IST

Toilet Flush: టాయిలెట్ ఫ్లష్ ట్యాంకుకు రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? రెండింటిలో ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా ఎందుకు ఉంటాయి? ఈ రెండూ వాటర్ ఫ్లష్ చేయడానికే అయితే ఒకటి ఉంటే చాలు కదా.. రెండోది ఎందుకు? అనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? దీనికి సరైన సమాధానం తెలుసుకుందాం.

టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? రెండూ వాటర్ ఫ్లష్ చేయడానికేనా?
టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? రెండూ వాటర్ ఫ్లష్ చేయడానికేనా? (shutterstock)

టాయిలెట్ ఉపయోగించేటప్పుడు ఫ్లష్ ట్యాంక్ పైన రెండు బటన్లు ఉండటం మీరు గమనించే ఉంటారు. ఈ రెండు బటన్లు పరిమాణంలోఒకటి చిన్నదిగానూ ఉంటే మరొకటి మాత్రం కాస్త పెద్దదిగా ఉంటుంది. మనం అనుకున్నట్లు రెండు బటన్లు నీటిని ఫ్లష్ చేసేందుకేనా? రెండూ నీటిని వదిలేందుకు ఉపయోగించేవే అయితే ఏదో ఒకటే ఉంటే సరిపోతుంది కాదా..! రెండెందుకు అందులో ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా ఉండటం ఎందుకు? అనే ప్రశ్న మీలో ఎవరికైనా కలిగి ఉండచ్చు. కలిగితే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నట్లే కదా. ఇక అసలు విషయానికి వద్దాం..

yearly horoscope entry point

రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయంటే..?

వాస్తవానికి ఫ్లష్ ట్యాంకుకు రెండు బటన్‌లు ఉండటానికి కారణాలున్నాయట. దీని వెనక చాలా పెద్ద ఆలోచనే ఉందట. అది తెలియక చాలా మంది ఈ బటన్లను సరిగ్గా ఉపయోగించడం లేదట. మీరు కూడా అంతేనేమో చెక్ చేసుకోండి. మరుగుదొడ్లలో నీటిని ఆదా చేయడానికి, వృథా కాకుండా నిరోధించడానికి డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్(రెండు బటన్‌లు) ప్రవేశపెట్టడం ప్రారంభించారట.

పెద్ద బటన్ దేనికంటే..

ఫ్లష్ ట్యాంకుపైన ఉండే పెద్ద బటన్ మలం తొలగించడానికి తయారు చేశారు. ఈ బటన్ నొక్కనప్పుడు ఒకేసారి 6 నుండి 9 లీటర్ల నీటిని విడుదల చేస్తుంది. ఇది టాయిలెట్ ట్యాంక్ ను పూర్తిగా శుభ్రం చేస్తుంది.

చిన్న బటన్ విషయానికొస్తే..

చిన్న బటన్ మూత్రాన్ని శుభ్రం చేయడానికి పనికొస్తుంది. ఈ బటన్ నొక్కినప్పుడు ఒకేసారి 3 నుండి 4 లీటర్ల నీటిని విడుదల చేస్తుంది. దీని ద్వారా టాయిలెట్ ట్యాంక్ చక్కగా శుభ్రమవుతుంది.

దీని అర్థం ఏంటంటే.. టాయిలెట్ చేసినప్పుడు తక్కువ నీరు సరిపోతుంది కనుక చిన్న బటర్, మోషన్ వెళ్లినప్పడు ఎక్కువ నీరు అవసరం కనుక పెద్ద బటన్ ప్రెస్ చేయాలని. కానీ నేటికీ దీని గురించి చాలా మందికి తెలియక మరుగుదొడ్డిని ఉపయోగించేటప్పుడు ప్రతిసారి పెద్ద బటన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి దాదాపు మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని వృథా చేస్తున్నట్లే.

డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ ఉద్దేశ్యం ఏంటంటే..

డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి సంవత్సరానికి 20,000 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. డ్యూయల్ ఫ్లష్ వ్యవస్థలు సాధారణ ఫ్లష్ల కంటే టాయిలెట్లో ఇన్స్టాల్ చేయడానికి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ పర్యావరణ హితంగా పనిచేస్తాయి. ఇవి మీ నీటి బిల్లును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే భవిష్యత్తులో మీ పిల్లలకు నీటి కొరత రాకుండా కాపాడతాయి.

డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ ఎవరు కనిపెట్టారంటే..?

డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ ఆలోచనను అమెరికన్ ఇండస్ట్రియల్ డిజైనర్ విక్టర్ పెపానెక్ రూపొందించారు. 1976లో ఆయన రాసిన 'డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్' పుస్తకంలో కూడా దీన్ని ప్రస్తావించారు. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా 1980లో ఆస్ట్రేలియాలో డ్యూయల్ ఫ్లష్‌ను తయారు చేశారు. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ దీని ఉపయోగం పెరిగి, ట్రెండ్‌గా మారింది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner