20 ఏళ్ల వయస్సులోనే అమ్మాయిలు హైపో థైరాయిడిజమ్‌ బారిన ఎందుకు పడుతున్నారు?-why are so many women in their 20s getting hypothyroidism ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Are So Many Women In Their 20s Getting Hypothyroidism

20 ఏళ్ల వయస్సులోనే అమ్మాయిలు హైపో థైరాయిడిజమ్‌ బారిన ఎందుకు పడుతున్నారు?

HT Telugu Desk HT Telugu
Oct 14, 2023 08:39 AM IST

హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా 20 ఏళ్ళ వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడుతున్న యువతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.

20 ఏళ్ల వయస్సులోనే హైపోథైరాయిడిజం బారిన పడుతున్న అమ్మాయిలు
20 ఏళ్ల వయస్సులోనే హైపోథైరాయిడిజం బారిన పడుతున్న అమ్మాయిలు (Shutterstock)

హైపో థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఏర్పడే అనారోగ్య స్థితి. సాధారణంగా ఇది మధ్య వయస్కులైన స్త్రీలలో వస్తుంటుంది. థైరాయిడ్ గ్రంథి మన శరీర పనితీరుకు తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు ఈ హైపో థైరాయిడిజయం బారినపడినట్టు లెక్క. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం హైపోథైరాయిడిజం అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి అలసట. ఇది మనల్ని బలహీనపరిచి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబైలోని అపోలో స్పెక్ట్రాలో ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ఛాయా వాజా ఇలా వివరించారు. ‘బరువు పెరగడం, మలబద్ధకం, పొడి చర్మం, జుట్టు రాలడం, చల్లదనం వంటి ఇతర లక్షణాలు హైపో థైరాయిడిజంలో కనిపిస్తాయి. ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. ఇతర కారణాలలో హషిమోటోస్ థైరాయిడిటిస్, కొన్ని మందులు, అయోడిన్ లోపం, పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం వంటివి ఉన్నాయి..’ అని వివరించారు.

అయితే, ఇటీవలి సంవత్సరాలలో అమ్మాయిలు 20 ఏళ్లకే ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జన్యువులు, హార్మోన్ల అసమతుల్యత హైపో థైరాయిడిజంలో ఒక పాత్రను పోషిస్తున్నప్పటికీ, తక్కువ రోగనిరోధక శక్తి ఒక ముఖ్యమైన కారకంగా ఉంటుందని డాక్టర్ ఛాయా వాజా వివరించారు.

ఎందుకు ఇలా జరుగుతోంది?

  • చాలా మంది యువతుల అనియంత్రిత జీవనశైలి ఇందుకు కారణం. బిజీ షెడ్యూల్స్, సరైన పోషకాహారం తీసుకోకుండా అందుబాటులో ఉన్న దానితో ఆకలి తీర్చుకోవడం, అధిక ఒత్తిడి వంటివి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి కారణమవుతున్నాయి. మన శరీర రక్షణ విధానాలు రాజీపడినప్పుడు, అవి ఇన్ఫెక్షన్‌లతో పోరాడటం కష్టతరమవుతుంది. థైరాయిడ్ గ్రంధిని నియంత్రించే బాధ్యతతో సహా సరైన హార్మోన్ ఉత్పత్తి చేయడం మరింత సవాలుగా మారుతుంది.
  • పర్యావరణ కారకాలు కూడా మరొక కారణం. రోజువారీ వినియోగించే ఉత్పత్తులలో ఎండోక్రైన్‌కు అంతరాయం కలిగించే రసాయనాల ప్రాబల్యం కాలక్రమేణా పెరిగింది. ఈ రసాయనాలు వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి. సాధారణ థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. ఈ రోజుల్లో యువతులు ఈ ముప్పు గురించి తెలుసుకోవడం, క్రమమైన వ్యాయామం, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం, యోగా లేదా ధ్యానం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతుల ద్వారా బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా అడుగులు వేయడం చాలా కీలకం. చిన్న వయస్సులోనే వారి రోగనిరోధక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మహిళలు తరువాత జీవితంలో హైపోథైరాయిడిజం వృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

'హైపోథైరాయిడిజం వృద్ధులతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నప్పటికీ, యువతులు వారి జీవితాలపై దాని ప్రభావాన్ని కొట్టిపారేయకూడదు లేదా తక్కువగా అంచనా వేయకూడదు. సకాలంలో చికిత్స తీసుకోవడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి తగిన చికిత్స, పర్యవేక్షణ అవసరం..’ అని డాక్టర్ ఛాయా వాజా వివరించారు.

WhatsApp channel