మనిషి చేసిన ఆవిష్కరణల్లో గడియారం అనేది గొప్పది. ఇప్పుడు టైమ్ చూడకుండా ఏ పని చేయడం లేదు. మనిషి జీవితంలో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. టైమ్ చూడకుండా ఏది మెుదలుపెట్టలేం. ప్రతీ విషయంలో సమయం అనేది చాలా ముఖ్యమైనది. గడియారం లేకముందు ప్రజలు సన్ డయల్ ఉపయోగించేవారు. కానీ గడియారం మీద ఇంకా ఎన్నో ప్రశ్నలు అలానే ఉంటాయి. గడియారాన్ని కనుగొన్న వ్యక్తి సమయాన్ని ఎలా మ్యాచ్ చేశాడు అనేది ఇప్పటికీ చాలా మందికి ప్రశ్నంగా ఉంటుంది.
పీటర్ హెన్లీన్ అనే జర్మన్ క్లాక్ మేకర్ మెుదటి యాంత్రిక గడియారాన్ని కనుగొన్నాడు. దీంతో గడియారాల చరిత్ర మెుదలైందని చెబుతారు. అయితే ఈ విషయంపై హిస్టరీలో సమాచారం తక్కువగానే ఉంది. హెన్లీన్ 1510లో మెుదటి గడియారాన్ని కనుగొన్నాడని చెబుతారు. తర్వాత తర్వాత వీటి సైజుల్లో మార్పు వచ్చింది. అనేక విధాలుగా వీటి మార్పు జరిగింది.
ఈ డిజిటల్ ప్రపంచంలో కొన్ని వందల రూపాయల నుండి కోట్ల రూపాయల వరకు ఖరీదు చేసే వాచీలను జనం వాడుతున్నారు. అబ్రహం లూయిస్ 1810లో నేపుల్స్ రాణి కోసం గడియారాన్ని రూపొందించినట్లు చెబుతారు. మీరు 200 సంవత్సరాలకు పైగా దీనిని పరిశీలిస్తే, చేతి గడియారం మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా నిరంతరం ఉపయోగిస్తున్నారు.
అయితే మీరు వాటిని స్టోర్లలో కొనుగోలు చేసినప్పుడు, అన్ని గడియారాలు ఒక నిర్దిష్ట సమయంలో నిలిపివేస్తారు. కచ్చితంగా మనమందరం దీనిని గమనించాం. నిర్దిష్ట సమయంలో వాచ్‌ను ఎందుకు అమ్మకానికి ఉంచుతారనే దానిపై కొన్ని కథనాలు కూడా ఉన్నాయి.
అన్ని గడియారాలు సరిగ్గా 10.10 ఎందుకు చూపుతాయి? నేటికీ దీని గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌పై కాల్పులు జరిపిన సమయం. 10.10కి ఆయన మరణించడంతో ఆయన స్మారకార్థం దీన్ని ఏర్పాటు చేసినట్లు కొందరు చెబుతున్నారు. అయితే నిజానికి ఆయన మరణించిన సమయం ఉదయం 7 గంటలని చెబుతున్నారు.
అదేవిధంగా రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన సమయం అది అని కొందరు అంటున్నారు. అయితే పేలుడు జరిగిన సమయం తెల్లవారుజామున అని మనందరికీ తెలుసు. వాస్తవానికి వాచ్ 10.10కి ఆగిపోవడానికి కారణం ఏంటి?
దుకాణాల్లో వాచ్‌లలో సమయాన్ని 10.10గా చూపడానికి విస్తృతంగా ఉదహరించబడిన రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి 10.10 సమయం పెడితే V ఆకారం వస్తుంది. వి ఫర్ విక్టరీకి ప్రాతినిధ్యం వహించే విధంగా వాచ్‌ను ఉంచినట్లు అంటారు.. అలాగే గంట 10.10 వాచ్ ఏ బ్రాండ్ అని స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి వాటిని ఆ సమయంలో ఉంచుతారు.