Tea Boiling Time : టీని మూడు నిమిషాలకంటే ఎక్కువగా మరిగించేవారు చదవాలి ఇది-who boils tea for more than 3 minutes should read this article ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea Boiling Time : టీని మూడు నిమిషాలకంటే ఎక్కువగా మరిగించేవారు చదవాలి ఇది

Tea Boiling Time : టీని మూడు నిమిషాలకంటే ఎక్కువగా మరిగించేవారు చదవాలి ఇది

Anand Sai HT Telugu
May 28, 2024 05:40 AM IST

Overboiling Tea Effects : చాలా మంది టీని చాలా సేపు మరిగిస్తారు. చిక్కగా అవ్వాలని అలానే ఉంచుతారు. కానీ ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. టీని మూడు నిమిషాల కంటే ఎక్కువగా మరిగించకూడదు.

టీ ఎంతసేపు మరిగించాలి?
టీ ఎంతసేపు మరిగించాలి?

టీ అంటే మంచి మందికి ఇష్టమైనది. పొద్దున్నే లేచి రోజు మొదలు పెట్టేందుకు టీ ఉండాల్సిందే. లేదంటే అస్సలు రోజంతా పని చేయాలి అనిపించదు కొందరికి. ప్రతి ఒక్కరికి టీ తయారు చేయడానికి వారి స్వంత స్టైల్ ఉంటుంది. అయితే టీ తాగే వారికి చేసే తప్పుల గురించి తెలియదు. టీ తయారు చేయడం, తాగడం అంటే చాలా మందికి ఇష్టమే. కానీ కొన్ని సందర్భాల్లో టీ చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య దుష్ప్రభావాలు చాలా మందికి తెలియదు.

yearly horoscope entry point

మీరు మీ టీని ఎక్కువ సేపు మరిగిస్తే.. మీ కోసం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురు చూస్తున్నాయన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలతో టీ తాగినప్పుడు అందించే శక్తి అది ఎక్కువగా మరిగించి తాగినప్పుడు పోతుంది. టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని ప్రయోజనాలను కోల్పోతుంది.

ఎందుకు అతిగా మరిగించొద్దు?

టీని ఎక్కువగా మరిగించకూడదని ఎందుకు చెప్తారో చూద్దాం. టీలో చాలా టానిన్లు ఉంటాయి. ఇది శరీరంలోకి ప్రవేశించే అనేక అణువులను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. టీని ఎక్కువసేపు అంటే నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. టానిన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. దీంతో శరీరంలోకి చేరిన ఐరన్‌ను శరీరం గ్రహించలేకపోతుంది. ఇది కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.

జీర్ణ సమస్యలు

ఎక్కువగా మరిగించిన టీ మీలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, ఇతర కడుపు సమస్యలు వస్తాయి. ఇది కాకుండా క్యాన్సర్‌కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు టీని ఎక్కువగా మరిగిస్తే ఏర్పడతాయి. పాలలోని ప్రొటీన్లు పోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. వాటిని జీర్ణం చేయడానికి శరీరం చాలా కష్టపడాలి.

పోషకాల నష్టం

టీని అతిగా మరిగిస్తే.. అన్ని పోషకాలు పోతాయి. సరిగ్గా తయారుచేసిన టీ రోగనిరోధక శక్తిని, పోషకాలను పెంచుతుంది. కానీ నిరంతరం మరిగిస్తే పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి పోతాయి. అలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా నిర్వహించాలి. తక్కువగా మరిగించాలి.

అక్రిలామైడ్ వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలు టీలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా జరగాల్సిన అవసరం లేదు. అయితే వస్తుందనే అవకాశం కూడా తోసిపుచ్చలేం. కానీ ఎక్కువగా మరిగిస్తే మాత్రం ప్రమాదకరమైన మొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

ఎంత సమయం మరిగించాలి?

చాలా మందికి పాల టీని కాయడానికి సరైన సమయం తెలియదు. మరికొందరు టీని ఎక్కువ సేపు మరిగించి తీసుకుంటే.. రుచిగా ఉంటుందనే నమ్మకంతో దానిని మరిగించడం కొనసాగిస్తారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ టీ 3-5 నిమిషాల కంటే ఎక్కువ మరిగించొద్దు. మూడు నిమిషాలే చాలా ఎక్కువ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎక్కువ మరిగిస్తే.. టీ ప్రయోజనాలను పూర్తిగా నాశనం చేస్తుంది. టీని చేదుగా కూడా చేస్తుంది. అందువల్ల టీ తయారుచేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

Whats_app_banner