వెజిటేబుల్ పులావ్ ఎక్కువమందికి నచ్చుతుంది. ఇందులో బీన్స్, పనీర్, బఠానీలు, క్యారెట్లు వంటి వివిధ కూరగాయలు ఉన్నాయి. వైట్ పులావ్ రెసిపీ చాలా సులువు. పులావ్… బిర్యానీ కంటే ముందే పుట్టిందని నమ్ముతారు. ఈ వంటకం మధ్యప్రాచ్య దేశంలో పుట్టి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. దీన్ని బియ్యం, కూరగాయలు జోడించి ద్వారా తయారు చేస్తారు.
బాస్మతి రైస్ - ఒక కప్పు
బంగాళాదుంప - రెండు
క్యారెట్లు - రెండు
బీన్స్ - 50 గ్రా
పచ్చి బఠానీలు - అర కప్పు
ఉల్లిపాయలు - అర కప్పు
టొమాటో - ఒకటి
పచ్చిమిర్చి - అయిదు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - మూడు
యాలకులు - మూడు
బిర్యానీ ఆకులు - ఒకటి
నూనె - రుచికి తగినంత
4. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలి.
5. ఉల్లిపాయలు కొద్దిగా ఉడికిన తర్వాత తరిగిన టమోటాలు, పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద రెండు నిమిషాలు వేయించాలి.
6. అందులో తరిగిన బంగాళాదుంపలు, క్యారెట్లు, బీన్స్, పచ్చిబఠానీలు, చిటికెడు ఉప్పు వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాలి.
7. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
8. తరువాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కలపాలి.
9. ఒక కప్పు బాస్మతి బియ్యానికి, రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించి మీడియం మంట మీద ఉడికించాలి. విజిల్ కొట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
10. కుక్కర్ లోపల ఆవిరి పీడనం తగ్గిన తర్వాత మూత తీసేస్తే రుచికరమైన తెల్లని పలావ్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.
11. చివరగా అందులో తరిగిన కొత్తిమీర ఆకులు వేసి రైతాతో ఆస్వాదించాలి.
టాపిక్