Beauty Tips: పాత్రలు కడిగే మీ చేతులు పాడవకుండా ఉండాలంటే, ఈ టిప్స్ పాటించండి-while washing dishes if you forget these things aging will come sooner than your age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: పాత్రలు కడిగే మీ చేతులు పాడవకుండా ఉండాలంటే, ఈ టిప్స్ పాటించండి

Beauty Tips: పాత్రలు కడిగే మీ చేతులు పాడవకుండా ఉండాలంటే, ఈ టిప్స్ పాటించండి

Ramya Sri Marka HT Telugu

Beauty Tips: అందం అంటే ముఖం ఒక్కటే కాదు కదా. పాత్రలు కడుగుతున్న మీ చేతులకు కూడా అందం, ఆరోగ్యం అవసరమై కదా. అవును అనే వాళ్లు పాత్రలు కడుతున్న సమయంలో, కడిగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే మీ చేతులు పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి. వృధ్యాప్య ఛాయలు కనిపిస్తాయి.

పాత్రలు కడిగే మీ చేతులు పాడవకుండా ఉండాలంటే.. (Shutterstock)

అందం అంటే కేవలం మొహం మాత్రమే చూడచక్కనిదిగా ఉంటే చాలదు. మొహంతో పాటు బయటకు కనిపించే చేతులు, మెడ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మహిళలు తరచుగా వారి ముఖంపై చర్మానికి మాత్రమే ఎక్కువ కేర్ తీసుకుంటారు. కానీ, చేతుల విషయం పట్టించుకోరు. అలా చేయడం వల్ల అకాల వృద్ధాప్యానికి కారణమవుతుందట. అంటే వయస్సు కంటే ముందుగానే మీ చర్మం ముసలి వాళ్ల చర్మంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, మహిళలు రోజులో పాత్రలు కడిగే ప్రతిసారీ తమ చేతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలం ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కాబట్టి చేతులను మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.

పాత్రలు ఎక్కువసార్లు కడగడం మానుకోండి

చేతులు పొడిబారడానికి, నిర్జీవంగా మారిపోవడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో నిండిన డిష్‌వాష్ జెల్‌లు, సబ్బులు కారణం. కాబట్టి ఎల్లప్పుడూ SLS లేని, సువాసన లేని డిష్ క్లీనర్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. అలాగే, రోజులో ఎక్కువసార్లు పాత్రలు కడగడం మానుకోండి. రోజుకు రెండుసార్లు మాత్రమే పాత్రలు కడగడానికి ప్రయత్నించండి. మీరు ఎన్నిసార్లు పాత్రలు కడుగుతారో, మీ చేతుల పరిస్థితి అంత దిగజారిపోతుందని గుర్తుంచుకోండి. పాత్రలు కడిగిన తర్వాత, మీ చేతులను మృదువైన హ్యాండ్‌వాష్‌తో బాగా కడగండి, ఆరిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకండి.

వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి

ముఖ్యంగా శీతాకాలంలో మహిళలు పాత్రలు కడగడానికి వేడి నీటిని ఉపయోగిస్తారు. ఇది మీ చేతులకు అస్సలు మంచిది కాదు ఎందుకంటే వేడి నీరు, మీ చర్మాన్ని మరింత పొడిగా, గట్టిగా మారుస్తుంది. చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. అయితే, ఆ తర్వాత మీ చేతులను ఆరబెట్టుకుని బాడీ లోషన్ లేదా మరేదైనా హ్యాండ్ క్రీమ్ రాసుకోవడం మర్చిపోకండి. మీరు రోజులో ఎన్నిసార్లు నీటితో పని చేసినా, వెంటనే మీ చేతులకు హ్యాండ్ క్రీమ్ రాసుకోవాలని గుర్తుంచుకోండి.

రాత్రి పడుకునే ముందు చేతులకు మాయిశ్చరైజ్ రాసుకోవడం

రాత్రి పడుకునే సమయంలో చర్మం సెల్ఫ్ రికవరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీ చర్మాన్ని సంరక్షించుకునే పనిలో భాగంగా చేతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. పొడిబారిన, నిర్జీవమైన చేతులను మృదువుగా, మెరిసేలా చేసేందుకు ఇది సరైన సమయం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్, గులాబీనీటి మిశ్రమాన్ని కలిపి చేతులకు రాసుకోండి. మీరు కావాలనుకుంటే ఆవనూనెను వేడి చేసి దానితో మసాజ్ చేసుకోవచ్చు. అలాగే, తేనె, కలబంద గుజ్జు ఉపయోగించి మీ చేతులను మృదువుగా, అందంగా ఉండేలా కాపాడుకోవచ్చు.

ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

చేతులను మృదువుగా ఉంచుకోవడానికి కొన్ని చిన్న విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ముందుగా, చేతులను నీటితో తడపడాన్ని వీలైనంతగా తగ్గించండి. మీరు నీటితో ఏదైనా పని చేసినప్పుడు, మీ చేతులను వెంటనే టవల్‌తో తుడుచుకోండి. అలాగే, వ్యాయామం చేసిన తర్వాత వారానికి ఒకసారి మీ చేతులను బాగా స్క్రబ్ చేయండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే, మానిక్యూర్ కూడా చేయించుకోవచ్చు. ఎల్లప్పుడూ కలబంద జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా హ్యాండ్ క్రీమ్‌ను ఎంచుకోవడం బెటర్. మీ చేతులపై ఏదైనా దురద, అలర్జీ లేదా అధికంగా పొడిబారినట్లు కనిపిస్తే, వెంటనే మీరు వాడుతున్న ప్రొడక్టులను మార్చండి. పరిస్థితి తీవ్రంగా ఉంటే డెర్మటాలజిస్టును సంప్రదించండి.

సంబంధిత కథనం