Hair fall: మీ జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఇది కారణం అయి ఉండొచ్చు!-which vitamin deficiencies cause hair fall ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall: మీ జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఇది కారణం అయి ఉండొచ్చు!

Hair fall: మీ జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఇది కారణం అయి ఉండొచ్చు!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 06, 2024 12:40 PM IST

Hair Loss: జుట్టు రాలడం చాలా మందికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఎందుకిలా అని ఆలోచిస్తుంటారు. కొన్ని రకాల విటమిన్ల లోపం కారణంగా కూడా కొందరికి జుట్టు రాలుతుంటుంది. ఆ విటమిన్లు ఏవంటే..

Hair fall: మీ జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఇది కారణం అయి ఉండొచ్చు! (Photo: Freepik)
Hair fall: మీ జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఇది కారణం అయి ఉండొచ్చు! (Photo: Freepik)

జుట్టు ఎక్కువగా రాలుతుండడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఎందుకు ఎంతగా వెంట్రుకలు ఊడిపోతున్నాయనే కంగారు ఉంటుంది. ఈ సమస్య కొందరికి తీవ్రంగా మారుతుంటుంది. రాలడం తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు రాలేందుకు చాలా కారణాలు ఉంటాయి. మందుగా వాటిని అర్థం చేసుకోవాలి. జుట్టు రాలేందుకు కొందరిలో విటమిన్ల లోపం ప్రధాన కారణంగా ఉంటుంది. కొన్ని రకాల విటమిన్లు శరీరంలో లోపించినప్పుడు జుట్టు రాలడం ఎక్కువ అవుతుంటుంది.

yearly horoscope entry point

జుట్టు ఆరోగ్యం మనం తినే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటే వెంట్రుకలు మెరుగ్గా ఉండేందుకు సహకరిస్తాయి. కొన్ని విటమిన్లు లోపిస్తే జుట్టు రాలేందుకు కారణం అవుతుంది. ఆ విటమిన్లు ఏవంటే..

విటమిన్ డీ

జుట్టు పెరుగుదలకు విటమిన్ డీ కీలకంగా ఉంటుంది. జుట్టు కుదుళ్ల రంధ్రాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తుంది. శరీరంలో విటమిన్ డీ లోపిస్తే జుట్టు కుదుళ్లు బలహీనం అవుతాయి. వెంట్రుకలు రాలడం ఎక్కువవుతుంది. అందుకే విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గుడ్లు, పాలు, ఫ్యాటీ ఫిష్‍ లాంటి వాటిలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. సూర్యరశ్మి నుంచి కూడా ఈ విటమిన్ శరీరానికి అందుతుంది.

విటమిన్ బీ1, బీ6, బీ7, బీ12

కొన్ని రకాల విటమిన్ బీ లోపం ఉంటే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్ బీ1, బీ2, బీ5, బీ6, బీ7, బీ12 తక్కువగా ఉంటే వెంట్రుకలకు చేటు జరుగుతుంది. జుట్టుకు పోషకాలు మెరుగ్గా అందడంలో, కుదుళ్ల కణాలను ప్రేరిపించడంలో, జీవక్రియ మెరుగ్గా ఉండడంలో ఈ విటమిన్లు కీలకంగా ఉంటాయి. అందుకే జుట్టు రాలే సమస్య తగ్గేందుకు విటమిన్ బీలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీడ్పడతాయి.

విటమిన్ ఏ

విటమిన్ ఏ లోపం ఉంటే సేబల్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీంతో తేమ లోపించి.. కుదుళ్లు ఎక్కువ పొడిగా మారి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే విటమిన్ ఏ ఉండే ఆహారాలు రెగ్యులర్‌గా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అయితే, విటమిన్ ఏ మరీ ఎక్కువైతే కూడా జుట్టుకు రిస్కే. అందుకే సమతుల్యత పాటించాలి.

విటమిన్ ఈ

విటమిన్ ఈ.. ఓ ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. జుట్టు కుదుళ్లపై ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడంలో కీలకంగా ఉంటుంది. అందుకే విటమిన్ ఈ లోపిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఎక్కువగా రాలుతుంది. కుదుళ్లకు రస్తప్రసరణ మెరుగ్గా ఉండాలంటే కూడా విటమిన్ ఈ ముఖ్యం. అందుకే జుట్టు ఆరోగ్యం కోసం విటమిన్ ఈ పుష్కలంగా ఉండే పాలకూర, కూరగాయలు, నట్స్, గింజలు తినడం ముఖ్యం.

మినరల్స్ కూడా..

జుట్టు దృఢత్వానికి, ఆరోగ్యానికి మినరల్స్ కూడా చాలా ముఖ్యం. జింక్, సెలేనియం, మెగ్నిషియం, ఐరన్ సహా మరిన్ని మినరల్స్ శరీరంలో పుష్కలంగా ఉండే జుట్టు బలంగా ఉంటుంది. వీటిలో ఏదైనా లోపం ఉండే కూడా జుట్టుకు చేటు జరుగుతుంది. అందుకే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా ముఖ్యం.

Whats_app_banner