Afternoon Sleeping : మధ్యాహ్నం ఏ సమయానికి పడుకోవాలి? ఎంతసేపు నిద్రపోవాలి?
Afternoon Sleeping Tips : కొందరికి మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటు. కానీ ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అని మాత్రం చాలా మందికి తెలియదు.
నిద్ర అనేది అందరికీ చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా పాడైపోతుంది. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్ర సరిగా లేకుంటే ఎన్నో సమస్యల వస్తాయి. సరైన నిద్రలేకుంటే మీరు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోంటారు. మెుత్తం శ్రేయస్సుకు నిద్ర చాలా కీలకమైనది. అయితే కొందరికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. దీని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి.

సరిగ్గా నిద్రపోకపోతే అది నిద్రలేమి కాదు, నిద్రలేమి అనేది ఒక వ్యాధి. అయితే నిద్ర సరిగా పట్టకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. నిద్రలేమి మన నియంత్రణలో ఉండదు. కానీ నిద్ర సరిగ్గా లేకుంటే అది పరోక్షంగా మన జీవనశైలికి సంబంధించినది.
చాలా మంది మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు పడుకుని నిద్రపోతారు. అంటే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల నుంచి గంట వరకు నిద్రపోయే వారు ఉండొచ్చు. ఇది కొందరికి దినచర్య అయితే, మరికొందరికి అప్పుడప్పుడూ ఇలాగే నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు.
అయితే ఇలా మధ్యాహ్నం పూట పడుకోవడం ఆరోగ్య పరంగా మంచిదే అయినా అది అందరికీ మంచి పద్ధతి కాదు. మధ్యాహ్నం ఎవరు నిద్రపోకూడదు? మీరు ఎంతసేపు నిద్రించాలి? దీని వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్న భోజనం 2 గంటలకు ముందే ముగించాలి. మధ్యాహ్నం నిద్రపోవాలంటే 3 గంటలలోపు నిద్రపోయి 4 గంటల్లో నిద్ర లేవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆలస్యంగా తినడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా మేల్కొనడం రాత్రి నిద్రపై ప్రభావం చూపుతాయి. ఆలస్యంగా పడుకుంటే రాత్రి నిద్ర పట్టకపోవచ్చు. మీరు మధ్యాహ్నం నిద్రపోయి 4 గంటలకు లేవాలి. ఈ నిద్ర 15 నుండి 20 నిమిషాలలోపు మాత్రమే ఉండాలి. ఇంతకంటే ఎక్కువసేపు నిద్రపోకూడదని అంటారు. ఎందుకంటే మీరు ఎక్కువ సేపు నిద్రపోయినప్పుడు, ఆ రోజు మీకు మళ్లీ ఏ పని చేయాలని అనిపించదు, మీరు రాత్రి ఎక్కువగా నిద్రపోలేరు.
మధ్యాహ్నం పడుకున్న వెంటనే నిద్ర లేచినట్లయితే, మళ్లీ నిద్రించడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే శరీరానికి ఎంత విశ్రాంతి అవసరమో, ఎంత నిద్ర అవసరమో శరీరం నిర్ణయిస్తుంది. మళ్లీ పడుకుంటే బద్ధకం వస్తుంది. మీరు బలవంతంగా నిద్రలోకి వెళ్లినప్పుడు, మీరు నిద్రపోకుండా సమయాన్ని వృథా చేయవచ్చు. గాఢ నిద్రలోకి జారుకోవడం ద్వారా ఆలస్యంగా మేల్కొనవచ్చు.
మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే ముందు అలారం పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతిరోజూ నిద్ర సమయాన్ని ఫాలో కావాలి. ప్రతిరోజూ ఆ సమయాన్ని గమనించాలి. అప్పుడు మీరు సమయానికి నిద్రపోవడం ప్రారంభిస్తారు. ప్రతిరోజూ దీన్ని చేయడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నం, రాత్రి నిద్రించడానికి సరైన సమయాన్ని షెడ్యూల్ చేయండి.