Crystal Clear Beach: మనసును దోచేలా క్రిస్టల్ క్లియర్ నీటితో బీచ్‍లు.. ఇండియాలోనే.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే?
Crystal Clear Beach: ఇండియాలోనూ కొన్ని క్రిస్టల్ క్లియర్ నీటితో బీచ్‍లు ఉన్నాయి. ఇవి మనసులను దోచేస్తాయి. తెగ నచ్చేస్తాయి. అలా స్వచ్ఛమైన నీటితో ప్రశాంతంగా ఉండే బీచ్‍ల గురించి ఇక్కడ చూడండి.
భారత్‍లో వివిధ ప్రాంతాల్లో చాలా బీచ్‍లు ఉన్నాయి. ఎన్నో పాపులర్ బీచ్‍లకు నిత్యం భారీ స్థాయిలో జనాలు వెళుతుంటారు. ఎంజాయ్ చేస్తుంటారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో బీచ్‍లకు వస్తుంటారు. కానీ, క్రిస్టల్ క్లియర్ నీటితో ఉండే బీచ్‍లు కావాలంటే మాత్రం మాల్దీవులకో, బాలీకో లేదా వేరే దేశాలకు వెళ్లాలని కొందరు అనుకుంటారు. అయితే, ఇండియాలోనూ క్రిస్టల్ క్లియర్ వాటర్ బీచ్‍లు కొన్ని ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని రెండు బీచ్‍ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
రాధానగర్ బీచ్
స్వచ్ఛమైన నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, తెల్లటి ఇసుకతో అత్యంత అందంగా మనసులను దోచేస్తుంది ‘రాధానగర్ బీచ్’. అండమాన్ నికోబార్ దీవుల్లోని హావెలాక్ ఐల్యాండ్ (స్వరాజ్ దీప్)లో ఈ బీచ్ ఉంది. నీలం రంగులో క్రిస్టల్ క్లియర్‌గా ఇక్కడ సముద్రపు నీరు ఉంటుంది. ఆసియాలోనే ఒకానొక బెస్ట్ బీచ్‍గా ‘రాధానగర్ బీచ్’ పేరు గాంచింది.
అత్యంత సుందరంగా ఉండే రాధానగర్ బీచ్‍కు కొంతకాలంగా పర్యాటకులు పెరుగుతున్నారు. ఈ బీచ్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తే మనసులో నిలిచిపోతుంది. సముద్రంలో స్విమ్మింగ్, సన్ బాతింగ్ చేస్తే అదిరిపోతుంది. ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఈ బీచ్ కలిగిస్తుంది. ఈ బీచ్ పరిసరాల్లో ఉండేందుకు అకామిడేషన్ కోసం వివిధ రకాల ఆప్షన్లు ఉంటాయి. బీచ్ అందాన్ని కాపాడేందుకు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లాంటివి అందుబాటులో ఉంచలేదు. స్విమ్మింగ్ చేయడం ఇక్కడ అత్యంత బెస్ట్. ఈ రాధానగర్ బీచ్‍కు వచ్చేందుకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య మరింత పర్‌ఫెక్ట్ సమయంగా ఉంటుంది. అత్యంత స్వచ్ఛమైన నీరు, ఇసుకతో ఉండే అందమైన బీచ్ చూడాలంటే ఇండియాలో రాధానగర్ బీచ్ బెస్ట్ ఆప్షన్.
నీల్ ఐల్యాండ్‍లోని బీచ్‍లు
అండమాన్ నికోబార్ దీవుల్లోని నీల్ ఐల్యాండ్‍లో ఉండే బీచ్‍లు కూడా బ్యూటిఫుల్‍గా ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్‌తో మనసులను హత్తుకుంటాయి. ఈ ఐల్యాండ్‍లోని సీతాపూర్, లక్ష్మణ్ పూర్, భరత్‍పూర్ బీచ్‍లు సహా మరికొన్ని అద్భుతంగా ఉంటాయి. ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయి. మంచి అనుభూతిని కలిగిస్తాయి.
ఎలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో వెళ్లాలంటే.. ముందుగా పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. పోర్ట్ బ్లెయర్ నుంచి షిప్‍ల్లో హావెలాక్, నీల్ సహా ఇతర ఐల్యాండ్‍లకు వెళ్లవచ్చు. ఐల్యాండ్ దూరాన్ని బట్టి గంట నుంచి మూడు గంటల వరకు ప్రయాణం ఉంటుంది.
హైదరాబాద్ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో అండమాన్ నికోబార్ దీవులకు చేరాలంటే.. ముందుగా విశాఖపట్నం లేదా చెన్నైకు వెళ్లాలి. అక్కడి నుంచి క్రూజ్ షిప్‍లు ఉంటాయి. ఆన్‍లైన్‍లోనూ ఈ క్రూజ్‍లను బుక్ చేసుకోవచ్చు. సముద్రంలో ఎక్కువసేపు ప్రయాణించాలనుకునే వారికి ఇది సూటవుతుంది. సుమారు ఈ ప్రయాణం మూడు రోజుల వరకు సాగుతుంది. కోల్‍కతా నుంచి కూడా క్రూజ్ సర్వీస్‍లు అందుబాటులో ఉంటాయి. కోల్‍కతా నుంచి కూడా షిప్‍లో అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాలంటే మూడు నుంచి నాలుగు రోజులు సముద్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. షిప్‍లోని విలాసాలను బట్టి క్రూజ్ ప్యాకేజీల ధరలు ఉంటాయి.