Chicken Vs Mutton: చలికాలంలో చికెన్ లేదా మటన్ ఏది తింటే గుండెకు ఎక్కువ హాని కలుగుతుంది?
Chicken Vs Mutton: చలికాలంలో తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో గుండె సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి గుండెకు మేలు చేసే ఆహారాన్ని తినాలి. చికెన్ లేదా మటన్ ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యమో తెలుసుకోండి.
చలికాలంలో మనం తినే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వాతావరణం చల్లబడుతున్న కొద్ది గుండె సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి గుండెకు మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. చలికాలంలో ఎక్కువ మంది చికెన్, మటన్ వంటివి స్పైసీగా చేసుకుని తినేందుకు ఇష్టపడతారు. చికెన్ లేదా మటన్ లో ఏది తింటే ఆరోగ్యము తెలుసుకోండి.
చలికాలంలో చికెన్
చికెన్‌లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. తక్కువ కొవ్వుతో కూడిన ప్రోటీన్ ఇది. అలాగే విటమిన్ b6, సెలీనియం, నియాసిన్ వంటి పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. చికెన్ మితంగా తినడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు వంటివి తగ్గించడంలో ఇది ముందుంది. చికెన్ సూప్ తినడం లేదా తాగడం వల్ల దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో మటన్
మటన్ ప్రియులు కూడా మన చుట్టూ ఎక్కువ మందే ఉంటారు. మటన్‌లో ఇనుము, జింక్, విటమిన్ బి12గా ఉంటాయి. అయితే మటన్‌లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. చలికాలంలో మటన్ తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇది సులభంగా జీర్ణం కూడా అవుతుంది.
చికెన్ లేదా మటన్.. ఏది బెటర్?
చలికాలంలో చికెన్ లేదా మటన్ ఈ రెండిట్లో ఏది తినడం మంచిదో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చికెన్ లో తక్కువ కొవ్వు ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి చలికాలంలో దీన్ని సూపులు, కూరలుగా వండుకొని తింటే మంచిది. అయితే మటన్ లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువకాలం పాటూ శక్తిని అందిస్తూనే ఉంటుంది. అయితే బలమైన జీర్ణశక్తి ఉన్నవారు మాత్రమే చలికాలంలో మటన్ తినాలి. చికెన్చ మటన్ ఈ రెండింటిలో ఉత్తమమైనది అయితే చికెన్ అనే చెప్పాలి. చలికాలంలో చికెన్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది.కాబట్టి గుండె కోసం చలికాలంలో చికెన్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
చికెన్ వండేటప్పుడు అందులో పసుపు, అల్లం, మిరియాలు వంటివి కలిపి వండడం మర్చిపోవద్దు. ఇది మరింత పోషకాలను చికెన్ కు జత అయ్యేలా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది జలుబును కూడా నివారిస్తుంది. చలికాలంలో తినేందుకు చికెన్ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇది పొట్టకు అనుకూలమైన ఆహారం అని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చికెన్ తినడం వల్ల త్వరగా ఆరోగ్యాన్ని పొందుతారు. అదే మటన్ అయితే శరీరానికి అదనపు శక్తిని ఇస్తుంది. అజీర్ణానికి ఇది కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచేస్తుంది. ఇవన్నీ కూడా చలికాలంలో మనకు కీడు చేసేవే. కాబట్టి వీలైనంత వరకు చికెన్ ను తినడానికే ఆసక్తి చూపించండి. ఇక ధరలో చూసుకుంటే మటన్ కంటే చికెన్ చవకగా ఉంటుంది. కాబట్టి రోజువారి భోజనంలో దీన్ని భాగం చేసుకోవచ్చు.