Diabetes Winter Foods: డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో రెగ్యులర్‌గా తినాల్సిన ఆహారాలు.. షుగర్ కంట్రోల్‍లో ఉండేలా..
Diabetes Winter Foods: చలికాలంలో డయాబెటిస్‍ను కంట్రోల్‍లో ఉంచుకోవాలంటే మరిన్ని ఎక్కువగ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో కొన్ని రకాల ఫుడ్స రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇవి బ్లడ్ షుగల్ లెవెళ్ల నియంత్రణలో తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
డయాబెటిస్‍తో బాధపడుతున్న వారికి చలికాలం మరింత సవాలుగా ఉంటుంది. చల్లటి వాతావరణం డయాబెటిస్‍పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి శీతల వాతావరణంలో శరీరానికి మరింత ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇన్సులిన్ అసమతుల్యతతో ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే చలికాలంలో డయాబెటిస్ ఉన్న వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో మరింత దృష్టి పెంచాలి.
చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయి (బ్లడ్ షుగర్ లెవెల్స్) పెరిగే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే చలికాలంలో రెగ్యులర్‌గా కొన్ని ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా సహకరిస్తాయి. అవేవో ఇక్కడ చూడండి.
చిలగడదుంపలు
డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో డైట్‍లో చిలగడదుంపలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది యాంటీ డయాబెటిస్ ఫుడ్‍గా పాపులర్ అయిన చిలగడదుంపలో పైతోకెమికల్ బీటా కరోటిన్ మెండుగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండడంలో ఇది సహకరిస్తుంది. బరువు పెరగకుండా కూడా చేయడంలో తోడ్పడుతుంది.
నారింజ
డయాబెటిస్‍తో బాధపడుతున్న వారికి నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లు చాలా మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో నారింజను మధుమేహం ఉన్న వారు తినొచ్చు. అయితే డైట్‍ను బట్టి పరిమితి మేర తీసుకోవాలి.
పాలకూర
డయాబెటిస్ ఉన్న వారికి పాలకూర సూపర్ ఫుడ్‍లా పని చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా డైట్‍లో ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు.. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు సహకరిస్తాయి. గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటంతో చెక్కర స్థాయి అమాంతం పెరగదు. పాలకూరను కాస్త ఎక్కుగానే తినొచ్చు.
క్యారెట్
క్యారెట్లలోనూ గ్లెసెమిక్ ఇండెక్స్ అత్యల్పం. అందుకే మధుమేహం ఉన్న వారికి ఇది మంచి ఫుడ్ ఆప్షన్‍గా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలం. అందుకే జీర్ణమయ్యేందుకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరగకుండా కంట్రోల్ చేయగలదు.
చేపలు
చేపలు కూడా కూడా రక్తంలో చెక్కర స్థాయిని అదుపులో ఉంచగలవు. చలికాలంలో సాల్మోన్, సార్డినెస్, మాకెరెల్ లాంటి ఫ్యాటీ చేపలను డయాబెటిస్ ఉన్న వారు తీసుకోవచ్చు. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సహా మరిన్ని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా ఉంటాయి. గుండె వ్యాధుల రిస్క్ కూడా చేపలు తగ్గిస్తాయి.
నట్స్
బాదం, ఆక్రోటు లాంటి నట్స్ కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ సహా పోషకాలు మెండుగా ఉంటాయి. కార్బ్స్ చాలా తక్కువ. గుండె ఆరోగ్యాన్ని కూడా నట్స్ మెరుగుపరుస్తాయి. అయితే, పరిమిత మేర వీటిని తీసుకోవాలి.
బెర్రీలు
చలికాలంలో స్ట్రాబర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీలను డయాబెటిస్ ఉన్న వారు తీసుకోవచ్చు. వీటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా.. యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేదుకు తోడ్పడతాయి. తీపి పదార్థాలను తినాలనే కోరికను కూడా బెర్రీస్ తగ్గించగలవు.
గమనిక: డయాబెటిస్ ఉన్న వారు వైద్యులు చూసించిన మందులను వాడుతూనే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యగా అనిపిస్తే వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి.
సంబంధిత కథనం