Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఈ డ్రైఫ్రూట్లకు దూరంగా ఉండాలి.. షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి!
Diabetes - Dry Fruits: డ్రైఫ్రూట్లలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, కొన్ని రకాల డ్రైఫ్రూట్లను డయాబెటిస్ ఉన్న వారు దూరంగా ఉంచాలి. ఇవి ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ డ్రైఫ్రూట్స్ ఏవంటే..
దాదాపు అన్ని రకాల డ్రైఫ్రూట్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, డయాబెటిస్ ఉన్న వారు మాత్రం కొన్ని డ్రైఫ్రూట్లను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల డ్రైఫ్రూట్లను తినవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వారు అలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా తీనకూడని డ్రైఫ్రూట్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
అంజీర
ఎండు అంజీర పండు (ఫిగ్స్)ను డయాబెటిస్ ఉన్న వారు తినకపోవడమే మేలు. ఈ డ్రైఫ్రూట్‍లో 50 నుంచి 60 శాతం షుగర్ ఉంటుంది. దీంతో ఇది తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఇందులో ఫ్రక్టోస్, గ్లోకోజ్, డెక్స్‌ట్రోస్ లాంటి షుగర్స్ ఉంటాయి. వీటిని మధుమేహం ఉన్న వారు దూరంగా ఉంచాలి.
ఎండిన చెర్రీలు
ఎండిన చెర్రీలు కూడా డయాబెటిస్‍తో బాధపడే వారికి సూటవవు. వీటిలో 40 శాతం వరకు షుగర్ ఉంటుంది. కొన్ని ఎండిన చెర్రీ రకాల్లో మరింత ఎక్కువ ఉండొచ్చు. అందుకే ఎండిన చెర్రీలను తింటే రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుంది. అయితే, తాజా చెర్రీలను డయాబెటిస్ ఉన్న వారు పరిమితి మేర కాస్త తినొచ్చు.
ఖర్జూరాలు
ఖర్జూరాల్లో పోషకాలు దండిగా ఉన్నా.. షుగర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఖర్జూరాల్లో సుమారు 70 శాతం వరకు షుగర్ ఉంటుంది. గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. అందుకే ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయి అధికం అవుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఖర్జూరాలు కరెక్ట్ కాదు. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు.
డ్రై చేసిన అరటి, మామిడి
అరటి పండులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, అరటిని ఫ్రై చేయడం, షుగర్ కోటింగ్ చేసి ప్రాసెస్ చేస్తే ఇందులో క్యాలరీల సాంద్రత అధికం అవుతుంది. బనాన చిప్స్, ప్రాసెస్ చేసిన ఎండు అరటి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అలాగే, అరటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎండబెట్టి ప్రాసెస్ చేసిన మామిడిని కూడా ఎక్కువగా తీసుకోకూడదు.
ఇవి తినొచ్చు
షుగర్ కంటెంట్, గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న నట్స్, డ్రైఫ్రూట్లను డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చు. బాదం, ఆక్రోటు, పిస్తాలు, జీడిపప్పు, వేరుశగనలు లాంటివి తీసుకోవచ్చు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్, మిగిలిన పోషకాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సహకరిస్తాయి. పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి.
సంబంధిత కథనం