మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తనతో పాటు మరో ప్రాణాన్ని మోస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ ప్రసవం జరిగేందుకు ప్రయత్నించాలి. అయితే, గర్భధారణ అందరిలోనూ ఒకే రకంగా జరగదు. కొందరికి కష్టాలతో, మరికొందరికీ సాఫీగా జరిగిపోతుంది. కడుపులోని బిడ్డ కదలికల విషయంలో, ఉమ్మ నీరు, శిశువు ఎదుగుదల లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ ఉంచకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా, పసిబిడ్డ రాకతో వచ్చే ఆనందాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి. అందులో యోగా ఒకటి.
గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు ఎదుర్కోవడానికి యోగా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి, రెగ్యూలర్‌గా యోగా చేసే వాళ్లు కాకుండా, ప్రెగ్నెన్సీ సమయంలోనే యోగా చేయాలనుకునేవారు ఎప్పుడు మొదలుపెట్టాలి. ఏ సమయంలో ఎలాంటి ఆసనాలు వేయాలో తెలుసుకుందాం రండి.
సాధారణంగా రెండవ త్రైమాసికంలో అంటే 12 వారాల తర్వాత యోగాను స్టార్ట్ చేయొచ్చు. రెండవ త్రైమాసికంలో శక్తి ఖర్చు చేయడంతో పాటు విశ్రాంతికి సమయం కేటాయించడం చాలా కీలకం. అయితే, మీరు ముందుగానే యోగా చేస్తున్నట్లయితే, నిపుణుల సలహా మేరకు కొనసాగించవచ్చు. అలా కాకుండా ప్రెగ్నెన్సీలో మొదలుపెట్టడం వల్ల మీ బలాన్ని, సమతుల్యతను మెరుగుపరచుకోవచ్చు. పిల్లలు పుట్టడంతో పాటు వారు ఆరోగ్యంగా ప్రసవించడానికి కూడా సహాయపడుతుంది.
కాకపోతే, యోగాసనాలు వేసే సమయంలో పొట్ట మీద లేదా వెనుకభాగంలో ఎక్కువసేపు పడుకుని చేసే ఆసనాలను నివారించండి. ఇలా చేయడం వల్ల పొట్టపై ఒత్తిడి కలిగి, కడుపులో పెరుగుతున్న శిశువుకు సమస్యగా అనిపించవచ్చు.
మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలను ఎంచుకుని వాటిని రెగ్యూలర్ గా చేయడమే ఉత్తమం.
1) గర్భధారణ సమయంలో ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు మీ ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోండి.
2) మీ శరీరాన్ని అర్థం చేసుకోండి. మీ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకండి.
3) తగినంత నీరు త్రాగి, డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి.
4) మొదటి మూడు నెలల్లో నిలబడి లేదా కూర్చుని చేసే ఆసనాలు చేయాలి.
5) మీ శరీర సామర్థ్యానికి తగ్గ ఆసనాలనే ఎంచుకోవాలి.
గర్భధారణలో యోగాసనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తల్లికి మాత్రమే కాదు, కడుపులో పెరుగుతున్న శిశువుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. యోగాసనాలు మనసులో ప్రశాంతత, సంయమనాన్ని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో మంచి ఆకారంలో ఉండటానికి, పిల్లలతో కమ్యూనికేట్ చేయడానికి యోగా ఒక సౌకర్యవంతమైన వ్యాయామం. ఇది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ మంచిదే.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్