క్రైస్తవ సోదరులు ఇష్టంగా జరుపుకునే పండుగల్లో ఈస్టర్ ఒకటి. ఆ రోజు చర్చలు, ప్రార్ధనలతో మారుమోగుతాయి. విందులు, వినోదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఈస్టర్ ఎగ్స్ ఆటలు... ఇలా ఈ పండుగ ఎంతో సందడిగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా harithaఉన్న కోట్ల మంది క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటారు. ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ పండుగగా నిర్వహించుకుంటారు.
ఈ ఏడాది ఈస్టర్ పండుగ ఏప్రిల్ 20న ఆదివారం వచ్చింది. మరణాన్ని జయించి వచ్చిన యేసును చూసి ఆనందంతో ఈస్టర్ పండుగ తొలిసారి నిర్వహించుకున్నారని చెప్పుకుంటారు. రోమన్లు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన మరణిస్తాడు. అలా మరణించిన మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి జీవించి వచ్చాడని చెబుతారు. అలా ఆయన జీవించి వచ్చినందుకు ఆనందంతో చేసే పండుగ ఈస్టర్ అని అంటారు.
ఈస్టర్ అంటే ఏసుక్రీస్తు మరణం పై విజయం సాధించడమే కాదు, అది క్రైస్తవ మతానికే పునర్జన్మగా కూడా చెప్పుకుంటారు. ఏసుక్రీస్తు ప్రజలు చేసిన తప్పులు, పాపాల కోసం తాను మరణించాడని, మూడు రోజుల తర్వాత చెడును ఓడించడానికి తిరిగి ప్రాణం పోసుకున్నాడని ప్రజలు నమ్ముతారు.
ఈస్టర్ కు ముందు వారం రోజుల నుండి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈస్టర్ ప్రతి ఏడాది ఆదివారమే నిర్వహించుకుంటారు. శుక్రవారం నాడు యేసును శిలువ వేస్తే ఆయన శరీరాన్ని శిలువ నుండి దించి ఒక గుహలో సమాధి చేశారని చెప్పుకుంటారు. ఆ సమాధికి రోమన్ సైనికులు కాపలాగా ఉండే వారని అంటారు. అలాగే ఆ గుహ ప్రవేశ ద్వారం దగ్గర ఒక పెద్ద రాయిని అడ్డుగా ఉంచారని కూడా చెప్పుకుంటారు. అయితే మూడు రోజైన ఆదివారంనాడు యేసుని సమాధి చేసిన గుహకు ఆయన శిష్యులు సందర్శించారని అంటారు. అప్పుడు ఈ సమాధిని చూడగా అక్కడ అతని శరీరం కనిపించలేదు. మరుసటి రోజు యేసును శిష్యులు చూశారు. ఆ తర్వాత 40 రోజులు పాటు ఆయనకి ఎంతో మందికి కనిపించారు. మరణించిన మూడోరోజున యేసు తిరిగి ప్రాణం పోసుకోవడం, ఆరోజు ఆదివారం కావడంతో అదే రోజు ఈస్టర్ ను జరుపుకోవడం ప్రారంభించారు.
ఇక యేసును శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా నిర్వహించుకుంటారు. ఈ పండుగను క్రైస్తవ సోదరులంతా బాధతో నిర్వహించుకుంటారు. దాన్ని సంతాప దినంగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే రోజు చర్చలలో క్రైస్తవ సోదరులు యేసు పడిన బాధలను, అతని మరణాన్ని తలుచుకొని ఏడుస్తారు. అలాగే ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు. గుడ్ ఫ్రైడే కథను నాటికల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు.
క్రిస్మస్ ప్రతి ఏడాది డిసెంబర్ 25న వచ్చినట్టు ఈస్టర్ ఒకే తేదీకి రాదు. ప్రతి ఏడాది తేదీ మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది చంద్రమాన క్యాలెండర్ తో ముడిపడి ఉంటుంది. మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారమే ఈస్టర్ పండుగను నిర్వహించుకుంటారు.
సంబంధిత కథనం