WhatsApp Call Links | మీరు వాట్సాప్‌లో చాట్ చేస్తారా? ఇకపై మీటింగ్ కూడా చేసుకోవచ్చు, ఇదిగో కొత్త ఫీచర్!-whatsapp introduces call link feature for audio and video calls here is how to use it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Whatsapp Introduces Call Link Feature For Audio And Video Calls, Here Is How To Use It

WhatsApp Call Links | మీరు వాట్సాప్‌లో చాట్ చేస్తారా? ఇకపై మీటింగ్ కూడా చేసుకోవచ్చు, ఇదిగో కొత్త ఫీచర్!

Manda Vikas HT Telugu
Sep 27, 2022 03:09 PM IST

WhatsApp Call Link Feature: మీరు వాట్సాప్ వీడియో కాల్ చేస్తారా? అయితే మీకోసం ఇప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీ వాట్సాప్ కాల్ లింక్ కూడా ఇకపై షేర్ చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

WhatsApp Call Link Feature
WhatsApp Call Link Feature

నేటి కాలంలో వాట్సాప్ యాప్ గురించి తెలియని వారంటూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు తమ మొబైల్‌లో వాట్సాప్ యాప్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది కేవలం చాటింగ్ కోసం మాత్రమే కాకుండా, గ్రూప్ మెసేజుల కోసం, ఆడియో-వీడియో కాల్స్ కోసం, వాట్సాప్ స్టేటస్‌ల కోసం, పేమేంట్స్ చేయడం కోసం, సమాచారం షేర్ చేసుకోవటానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్, ఇప్పుడు మరో స‌రికొత్త ఫీచర్‌తో ముందుకు రాబోతుంది. అదేంటంటే, ఇప్పటివరకు మీరు మీ ప్రియమైన వారితో వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేసే ఉంటారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే వాట్సాప్‌లో ఆడియో కాల్ చేసే అవకాశం ఉంది. ఇకపై ఈ సామర్థ్యం మరింత పెరగనుంది. ఎక్కువ మందితో వీడియో కాల్ మీటింగ్ చేసుకునేందుకు వాట్సాప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Call Links- వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేక లింక్‌లు

తాజా నివేదికల ప్రకారం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్, ఇప్పుడు ఎక్కువ మందితో వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలుగా కాల్ లింక్ ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు వీడియో కాన్ఫరెన్స్ లేదా గ్రూప్ వీడియో కాల్ కోసం ప్రత్యేకమైన లింక్ సృష్టించి ఆ లింక్‌ను వారికి కావలసినవారితో షేర్ చేయవచ్చు. ఆ లింక్ పొందిన వారు ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా గ్రూప్ వీడియో కాల్‌లో చేరవచ్చు. ఈ కాల్ లింక్ ఫీచర్ తమ ప్రియమైన వారందరితో కాంటాక్ట్‌లో ఉండడాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా ఆఫీస్ వ్యవహారాల కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఉద్యోగులకు జూమ్ యాప్, మైక్రోసాఫ్ట్ యాప్‌లలో వీడియో కాన్ఫరెన్స్‌ల గురించి పరిచయం ఉంటుంది. వీటిల్లో ఒకేసారి 300 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇదే తరహాలో వాట్సాప్ కాల్ లింక్ కూడా ఉపయోగపడుతుంది.

WhatsApp Call Links ఎలా క్రియేట్ చేయవచ్చు?

మీరు WhatsApp కాల్ చేసేందుకు ఉపయోగించే కాల్స్ ట్యాబ్ ఓపెన్ చేసి ఎగువన ఉన్న బ్యానర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. కాల్ లింక్ ఫీచర్‌ని ప్రయత్నించాలనుకునే వినియోగదారులు తమ WhatsAppను అప్ డేట్ చేసుకోవాలి. తాజా వెర్షన్ అవసరం అవుతుంది. ఈ కొత్త ఫీచర్ ఈ వారంలోనే తీసుకురావొచ్చని చెబుతున్నారు. తొలుత 32 మందితో వీడియో కాల్ చేసేందుకు అనుమతి ఉంటుంది. మున్ముందు మరింత విస్తరించే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్