Deepika's Beauty Secret: ఏంటి.. దీపికా పదుకొణె మెరిసే చర్మ రహస్యం ఈ ఒక్క జ్యూస్ ఏనా! దీంట్లో అంతగా ఏముంది?-whats the secret to deepika padukone glowing skin check her simple juice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Deepika's Beauty Secret: ఏంటి.. దీపికా పదుకొణె మెరిసే చర్మ రహస్యం ఈ ఒక్క జ్యూస్ ఏనా! దీంట్లో అంతగా ఏముంది?

Deepika's Beauty Secret: ఏంటి.. దీపికా పదుకొణె మెరిసే చర్మ రహస్యం ఈ ఒక్క జ్యూస్ ఏనా! దీంట్లో అంతగా ఏముంది?

Ramya Sri Marka HT Telugu

Deepika Beauty Secret: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెరిసే చర్మానికి కారణం కేవలం ఒక గ్లాస్ జ్యూస్ అంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఆ జ్యూస్‌లో ఏమేం ఉంటాయి? దాన్ని ఎలా తయారు చేస్తారు? తెలుసుకుందాం రండి..

దీపికా పదుకొణె మెరిసే చర్మం వెనకున్న రహస్యం

39 ఏళ్ల దీపికా పదుకొణె ఇప్పటికీ యవ్వనంగా, మెరుస్తూ కనిపించడానికి రహస్యం కేవలం ఒక జ్యూస్ అని మీకు తెలుసా? అవును ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ బీట్‌రూట్‌తో తయారుచేసిన డీఐవై జ్యూస్‌‌తో ఆమె చర్మాన్ని ఎల్లప్పుడూ అందంగా, ఆరోగ్యంగా కాపాడుతుందట. ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా తాజాగా ఓ వీడియోలో దీపికా చర్మ రహస్యాన్ని తెలిపారు. ఈమె దీపికా నుండి కత్రీనా కైఫ్ వరకూ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు న్యూట్రిషనిస్ట్‌గా పనిచేశారు. 2018లో నటుడు రణవీర్ సింగ్‌తో దీపికా వివాహానికి ముందు శ్వేతా ఈ బ్యూటీకి న్యూట్రిషనిస్ట్‌గా వ్యవహరించింది. అప్పటి ఆమె స్కిన్‌కేర్ రొటీన్ గురించి శ్వేతా చెప్పకొచ్చారు.

దీపికా పదుకొణె బీట్‌రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలి?

దీపికా చర్మ రహస్యం గురంచి శ్వేతా ఏం చెప్పిందంటే.. “నేను దీపికా పదుకొణెతో ఆమె వివాహానికి ముందు పనిచేశాను. ఆమెకు ఒకే ఒక్క లక్ష్యం ఉండేది. అదేంటంటే.. ఆమెకు మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కావాలి. కాబట్టి ఆమె ఈ జ్యూస్‌ను ఆమె రోజూ తాగేది. ఇందులో చర్మానికి మేలు చేసేవి, జుట్టు ఎదుగుదలకు, ఆరోగ్యానికి సహాయపడే చాలా రకాల ఆకులు ఉంటాయి. అలాంటి వాటితో తయారు చేసిన జ్యూస్ ను ఆమె మూడు నెలలు క్రమం తప్పకుండా దీన్ని తాగింది కానీ దానికి ఫలితం వేరే లెవెల్లో కనిపించింది.”

శ్వేతా షా ప్రకారం.. దీపికా జ్యూస్ లో ఏమేం ఉంటాయంటే..

  1. బీట్ రూట్
  2. పుదీనా ఆకులు,
  3. వేప ఆకులు
  4. కొత్తిమీర ఆకులు
  5. కరివేపాకు

వీటన్నింటినీ కలిపి తయారు చేసిన జ్యూస్‌ను దీపికా ప్రతి రోజూ తాగేదట.

ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

  • బీట్‌రూట్ జ్యూస్ త్రాగడం వల్ల మీ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. 2024 రిపోర్ట్ ప్రకారం, బీట్ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి ప్రయోజనకరమైన పోషకాలను అందిస్తుంది.
  • ఈ జ్యూస్ విటమిన్లు A, C, Eతో పాటు, ఇనుము, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇవి చర్మానికి ఆరోగ్యకరమైన రంగును, సహజమైన కాంతిని అందించడానికి సహాయపడతాయి.
  • బీట్ జ్యూస్ విషాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఫలితంగా వెంటనే చర్మానికి వెలుగును ఇస్తుంది.
  • ముఖ్యంగా జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారికి ఈ జ్యూస్ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
  • మొటిమలు, మచ్చలతో పోరాడటంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది.
  • అంతేకాదు.. చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగించడానికి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా తయారు చేయడానికి దోహదపడుతుంది.
  • కరివూపాకు, వేపాకు, పుదీనా, బీట్ రూట్ ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా సహాయపడే పదార్థాలు. ఇవి జుట్టుకు పోషకాలు అందించి, జుట్టు పెరిగే ప్రక్రియను ప్రోత్సహిస్తాయి.
  • బలమైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును అందించే వీటి సమ్మేళనం జుట్టు పొడిబారడం, రాలిపోవడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
  • ఈ జ్యూస్ వెంట్రుకల కుద్దుళ్ల నుంచి బలంగా తయారు చేసి ఒత్తైన, పొడవైన జుట్టును మీ సొంతం చేస్తుంది. మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా ఈ బీట్‌రూట్ జ్యూస్ తాగడానికి ప్రయత్నించండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం