మీకు ఇష్టమైన జంతువు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసా? సరదాగా ఓ లుక్కేసి తెలుసుకోండి!-what your favorite animal says about your personality find out ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీకు ఇష్టమైన జంతువు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసా? సరదాగా ఓ లుక్కేసి తెలుసుకోండి!

మీకు ఇష్టమైన జంతువు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసా? సరదాగా ఓ లుక్కేసి తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

మనలో చాలామందికి ఒక అభిమాన జంతువు ఉంటుంది. ఆ జంతువు లక్షణాలు మన స్వభావానికి దగ్గరగా ఉంటాయని లేదా మనం అలాంటి లక్షణాలను కలిగి ఉండాలని కోరుకుంటామని మీకు తెలుసా? అవును మీకు ఇష్టమైన జంతువు మీ గురించి చాలా విషయాలు చెబుతుందట. అవేంటో చూసేద్దాం రండి.

కుక్కను పెంచుకుంటున్న యువతి

చాలా మందికి ఒక అభిమాన జంతువు ఉంటుంది. అది కేవలం చూడటానికి బాగుందని మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఆ జంతువుల లక్షణాలను బట్టి కూడా అది మన ఫేవరెట్ జంతువుగా మారుతుంది. అంతేకాదు చాలా సార్లు ఆ జంతువుకున్న లక్షణాలు కూడా మన స్వభావానికి దగ్గరగా ఉంటాయని అందుకే అది మన అభిమాన జంతువుగా మనం ఫీలవుతామని మీకు తెలుసా? దీని ఆధారంగా మీకు ఇష్టమైన జంతువును బట్టి మీ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయచ్చట.

ఉదాహరణకు కొన్ని జంతువులు చాలా స్నేహంగా ఉంటాయి, మరికొన్ని స్వతంత్రంగా ఉండటాన్ని ఇష్టపడతాయి. మీకిష్టమైన జంతువు కుక్క, పిల్లి, కోతి, లేదా కుందేలు వంటివి అయితే అవి మీలోని ఏ లక్షణాలను చూపిస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి కేవలం సరదా అంచనాలే అయినా, మీ గురించి మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇదొక మంచి మార్గం. లేటు ఎందుకు మరి మీకు ఇష్టమైన జంతువు మీ గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి.

కుక్క:

కుక్కలంలే చాలా మందికి ఇష్టం. మీరు కూడా కుక్కను ఇష్టపడే వారు అయితే మీరు చాలా నమ్మకస్తులు, స్నేహశీలులు, ఆప్యాయులు అని అర్థం. మీరు బృందంగా కలిసి ఉండటాన్ని, అందరితో కలిసిపోవడాన్ని ఇష్టపడతారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల పట్ల చాలా విధేయత చూపిస్తారు. మీరు ఇతరుల పట్ల ప్రేమను, ఆనందాన్ని పంచుకునే స్వభావం కలవారు.

పిల్లి
పిల్లి

పిల్లి:

పిల్లిని ఇష్టపడేవారు సాధారణంగా స్వతంత్రులు, తెలివైనవారు, కాస్త రహస్యంగా ఉంటారు. తమ పని తాము చేసుకోవడానికి ఇష్టపడతారు. తరచుగా ఒంటరిగా ఉండటానికి లేదా తమకు నచ్చిన విధంగానే సమయం గడపడానికి ఇష్టపడతారు. వీరికి సున్నితమైన స్వభావం, పరిశీలనా శక్తి ఉంటాయి.

కోతి:

కోతి మీకు నచ్చితే మీరు చాలా చురుకైనవారు, ఉత్సాహవంతులు, సరదాగా ఉంటారని అర్థం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, అన్వేషించడానికి మీరు ఆసక్తి చూపిస్తారు. సామాజికంగా ఉంటారు, నవ్వుతూ, నవ్విస్తూ అందరినీ ఆకర్షిస్తారు. కొన్నిసార్లు కొంచెం అల్లరి కూడా చేస్తారు.

కుందేలు:

కుందేలును ఇష్టపడేవారు సాధారణంగా సున్నితమైనవారు, ప్రశాంతమైనవారు, భయస్తులు, కానీ అదే సమయంలో చాలా స్నేహశీలురు, ప్రేమను పంచేవారు. వీరు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. తరచుగా అంతర్ముఖులు (Introverts) అయ్యే అవకాశం ఉంటుంది.

సింహం
సింహం

సింహం:

మీరు సింహాన్ని ఇష్టపడితే మీరు ఒక నాయకుడిలా ఉంటారు. ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కష్టాలెదురైనా వెనుకాడరు. అందరినీ తన వెనుక నడిపించే సత్తా మీలో ఉంటుంది.

గుర్రం:

గుర్రాన్ని ఇష్టపడేవారు బలమైనవారు, స్వేచ్ఛను కోరుకునేవారు, సాహసోపేతమైనవారు. వీరికి పట్టుదల, క్రమశిక్షణ ఉంటాయి. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడతారు.

ఏనుగు:

ఏనుగును ఇష్టపడేవారు తెలివైనవారు, దయగలవారు, ఓపిక ఎక్కువ. కుటుంబానికి, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల పట్ల సానుభూతి చూపిస్తారు. మీరు చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు.

నక్క:

నక్కను ఇష్టపడితే, మీరు తెలివైనవారు, వేగంగా ఆలోచించేవారు, సమస్యా పరిష్కారకులు. పరిస్థితులకు తగ్గట్టుగా మారగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. కొంచెం రహస్యంగా ఉండటానికి ఇష్టపడతారు.

పాము
పాము

పాము:

పామును ఇష్టపడేవారు తెలివైనవారు, లోతైన ఆలోచనలు కలవారు, తమ పట్ల తాము నిజాయితీగా ఉంటారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మార్పులను తేలికగా అంగీకరిస్తారు.

డాల్ఫిన్:

డాల్ఫిన్‌ను ఇష్టపడేవారు చురుకైనవారు, తెలివైనవారు, సామాజికంగా ఉంటారు. వీరు ఇతరులతో సులువుగా కలిసిపోతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఆటపాటలు, సంతోషంగా గడపడాన్ని ఇష్టపడతారు.

గమనిక: ఇదంతా ఒక సరదా విశ్లేషణ మాత్రమే. మీ వ్యక్తిత్వం అనేది చాలా పెద్ద విషయం, దాన్ని కేవలం ఒక ఇష్టమైన జంతువుతోనే పూర్తిగా అంచనా వేయలేము. కాకపోతే ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి లేదా స్నేహితులతో సరదాగా చెప్పుకోవడానికి మంచి అంశం!

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.