Tulasi For Hair: తులసి ఆకులతో డాండ్రఫ్ లేని దృఢమైన జుట్టు పొందచ్చు, ఎలాగో తెలుసుకోండి?-what to do to get strong dandruff free hair with basil leaves ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tulasi For Hair: తులసి ఆకులతో డాండ్రఫ్ లేని దృఢమైన జుట్టు పొందచ్చు, ఎలాగో తెలుసుకోండి?

Tulasi For Hair: తులసి ఆకులతో డాండ్రఫ్ లేని దృఢమైన జుట్టు పొందచ్చు, ఎలాగో తెలుసుకోండి?

Ramya Sri Marka HT Telugu

Tulasi Leaves: తులసి ఆకులతో సహజమైన రీతిలో జుట్టు సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకుని దృఢమైన జుట్టుతో పాటు డాండ్రఫ్ లేని జుట్టును సొంతం చేసుకోండి. అదెలాగో చూసేద్దామా..

జుట్టు ఆరోగ్యం కోసం తులసి ఆకులు

జుట్టు రాలిపోకుండా ఉండటానికి మార్కెట్లో బ్యూటీ ప్రొడక్టులు చాలానే ఉన్నాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని తెలిసినా, తప్పనిసరి పరిస్థితుల్లో వాడేస్తుంటారు. కానీ, ఆ సమస్యతో బాధపడే వారికి

సహజమైన రీతిలోనే పరిష్కారం దొరికితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. మనం ఎంతో పవిత్రంగా భావించే తులసి ఆకులు చక్కటి ఔషదంగా కూడా పని చేస్తాయట. కుదుళ్లను బలపరిచి జిడ్డు లేకుండా చేయడంతో పాటు డాండ్రఫ్ సమస్య లేకుండా చేస్తాయట. వీటిని ఇతర నూనెలతో కలిపి రాసుకోవడం కూడా మంచి ప్రయోజనకారిగా ఉంటుందట.

మీరు తులసిని మీ జుట్టు ఆరోగ్యం కోసం వినియోగించాలనుకుంటే, ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.

తులసి ఆకులు జుట్టుకు మంచివేనా?

తులసి ఆకులు వినియోగించడం వల్ల జుట్టుకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండి జుట్టును సంరక్షించడంతో పాటు డాండ్రఫ్ సమస్యను తగ్గిస్తాయి. దాంతోపాటుగా రక్తప్రసరణను పెంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఇది నేచురల్ యాంటీ ఫంగల్ మెడిసిన్‌గా కూడా పని చేస్తుంది.

తులసి ఆకుల వల్ల కలిగే 6 ప్రయోజనాలు:

  • జుట్టు పెరిగేలా చేయడం
  • డాండ్రఫ్ నుంచి ఉపశమనం
  • వెంట్రుకల కుదుళ్లు బలపరచడం
  • తలలో ఇన్ఫెక్షన్లు తగ్గించడం
  • ఒత్తిడి వల్ల రాలిపోయే వెంట్రుకలను అరికట్టడం
  • తలలో జిడ్డు సమస్యను నివారించడం

తులసి ఆకులతో జుట్టును సంరక్షించుకోవడం ఎలా?

తులసి - కొబ్బరినూనెతో హెయిర్ మాస్క్

  1. 10 నుంచి 15 తాజా తులసి ఆకులను పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి.
  2. ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల వేడి కొబ్బరినూనెను కలపాలి.
  3. దీనిని మీ తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోండి.
  4. 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకుని షాంపూతో తలను శుభ్రం చేసుకోండి.

తులసి ఆకులతో కలబంద హెయిర్ మాస్క్

  1. 10 నుంచి 15 తులసి ఆకులను మెత్తగా నూరి రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును దానికి కలుపుకోండి.
  2. ఈ పేస్ట్ తలలోని కుదుళ్ల వరకూ అంటేలా మెత్తగా కలుపుకోవాలి.
  3. ఒక 30 నిమిషాల తర్వాత వేడి నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవడమే.
  4. ఇది తలలో డాండ్రఫ్ సమస్యను తగ్గించేస్తుంది.

తులసి ఆకులతో పెరుగు హెయిర్ మాస్క్

  1. దీని కోసం 10 నుంచి 12 తులసి ఆకులను పేస్ట్ లా చేసుకోండి.
  2. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ తేనె కలుపుకోండి.
  3. ఈ పేస్ట్ ను కుదుళ్ల వరకూ అంటేలా జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని ఒక 30 నిమిషాల పాటు ఉంచుకోండి.
  4. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
  5. ఈ మిశ్రమం జుట్టును సాఫ్ట్ చేయడంతో పాటు షైనింగ్ గా ఉంచుతుంది.

తులసి ఆకులతో వేప హెయిర్ మాస్క్

  1. దీని కోసం 10 తులసి ఆకులు, 10 వేపాకులు కలిపి పేస్ట్ చేసుకోండి.
  2. అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి.
  3. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని 15 నిమిషాలు అలాగే వదిలేయండి.
  4. ఆ తర్వాత వేడి నీళ్లతో తలను శుభ్రం చేసుకోండి.
  5. ఈ విధంగా చేయడం ద్వారా తలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి ఇన్ఫెక్షన్లు కలగకుండా చేస్తుంది. ఆ విధంగా డాండ్రఫ్ పూర్తిగా తగ్గిపోతుంది.

తులసి ఆకులతో బియ్యపు పిండి స్క్రైబ్

  1. తులసి పొడి ఒక టేబుల్ స్పూన్, బియ్యపు పిండి ఒక టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి చిక్కటి పేస్ట్ తయారుచేసుకోండి.
  2. ఈ పేస్ట్ ను తలకు రాసుకుని ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని, మరో 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి.
  3. తలను వేడినీళ్లతో కడిగేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా తరచుగా చేస్తుండటంతో తలలో జిడ్డు తగ్గడం మొదలవుతుంది.

తులసి ఆకులతో ఉల్లిరసం హెయిర్ మాస్క్

  1. దీని కోసం 10 తులసి ఆకులను తీసుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల తాజా ఉల్లిరసాన్ని కలుపుకోండి.
  2. దీనిని మీ కుదుళ్లకు అప్లై చేసుకోండి.
  3. ఒక 30 నిమిషాల తర్వాత తల బాగా శుభ్రం చేసుకుని, మైల్డ్ షాంపూతో కడిగేసుకోండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం