ఆడపిల్లల పేరెంట్స్ ప్రస్తుతం తప్పక ఆలోచించాల్సిన విషయమిది. మహిళల జీవితంలో పీరియడ్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇది వయస్సుకు తగ్గట్టుగా జరిగితే ఎటువంటి సమస్యా ఉండదు. కానీ ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఆడపిల్లలకు చిన్నతనంలోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఇది చాలా సీరియస్‌గా పరిగణించాల్సిన విషయం.
స్త్రీ జీవితంలో నెలసరి రావడం మొదలైందంటే ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి కడుపు నొప్పి నుంచి తలనొప్పి వరకూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా పిల్లలకు 13 నుంచి 14 సంవత్సరాల వయస్సు మధ్యలో పీరియడ్స్ మొదలవుతాయి. కానీ ఈ మధ్య 8 నుంచి 10 ఏళ్ల మధ్యలోనే ఈ సమస్య మొదలవుతుంది. ఇది మరీ దారణం. ఎందుకంటే.. ఈ వయసులో పిల్లలకు పీరియడ్స్ సమస్యలను తట్టుకునే శక్తి ఉండదు. బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు శరీరంలో కలుగుతున్న పరిణామాలను తట్టుకోవడం అంత సులభం కాదు.
స్వచ్ఛమైన గాలి పీల్చుకోకపోవడం వల్ల, పెస్టిసైడ్స్ కలిసి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, చిన్నతనంలోనే ఒబెసిటీకి గురవుతుండటం వల్ల చిన్న వయస్సులోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. కాలంతో పాటుగా ఈ పరిస్థితి సాధారణమే అయిపోతున్నప్పటికీ దీనిని మనం కొంతకాలం వరకూ వాయిదా వేయవచ్చు. తల్లిదండ్రులుగా మీ బిడ్డకు వచ్చే సమస్యను కొన్నాళ్లు ఆలస్యం చేయడం మీ చేతుల్లో ఉంటుంది. ఇందుకు మీరు చిన్ననాటి నుంచి వారి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్‌గా మీరు తీసుకునే నిర్ణయాలు మీ చిన్నారి ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి.
మీ పాప ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా చేయండి. తన డైట్లో ఎక్కువగా పండ్లు, ఆకు కూరగాయలు, కూరగాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. చిన్ననాటి నుంచి వీటిని తినేందుకు ప్రోత్సహించండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు మీ బిడ్డను వీలైనంత దూరంగా ఉంచండి. ఎందుకంటే వీటిలో కృత్రిమ రసాయనాలు ఎక్కువగా కలుస్తాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఫలితంగా చిన్నతనంలోనే పీరియడ్స్ వచ్చేందుకు కారణమవుతాయి.
మీ పాప తినే ప్లేటు నుంచి లంచ్ బాక్సు, నీళ్లు తాగే గ్లాసు వరకూ దేంట్లోనూ ప్లాస్టిక్ ను వాడకుండా చూసుకోండి. గాజు వస్తువులు లేదా స్టీల్ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే.. ప్లాస్టిక్ వస్తువుల్లో ఉండే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లు అయిన థాలేట్లు శరీరంలోని హార్మోన్లకు ఆటంకం కలిగిస్తాయి. పీరియడ్స్ త్వరగా రావడానికి కారణం అవుతాయి.
ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి మీ పాపతో రోజూ ఫిజికల్ యాక్టివిటీలు చేయంచండి. రోజులో కనీసం గంట సేపైనా వారు శారీరక శ్రమలో పాల్గొనేలా చేయండి. చిన్నతనం నుంచే ఇది వారికి అలవాటు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. సరైన సమయానికి పీరియడ్స్ వస్తాయి. వచ్చాక కూడా వాటిని తట్టుకుని నిలబడే శక్తి వారిలో ఉంటుంది.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిని ఆస్వాదించడం, బయటి గాలి పీల్చుకోవడం చాలా అవసరం. కనుక మీ పాపను ఆరుబయట ఎక్కువసేపు ఆడుకోనివ్వండి. ఇంట్లోనే బంధించి కూర్చోబెట్టడం వారిలో వారిలో ఒబెసిటీ స్థాయిలు పెరుగుతాయని గుర్తుంచుకోండి. ఒబెసిటీ చిన్నతనంలో నెలసరి రావడానికి ముఖ్య కారణమవుతుంది.
ఆరుబయట ఆడుకోవడం వల్ల పిల్లలు సన్‌లైట్‌కు ఎక్స్‌పోజ్ అవుతారు. తద్వారా పిల్లల్లో విటమిన్ డీ లోపం తగ్గుతుంది. ఫలితంగా పీరియడ్స్ కాస్త ఆసల్యంగా మొదలవుతాయి.
పీరియడ్స్ సమస్య లేటుగా ప్రారంభం కావాలంటే ఆడపిల్లలు సరిపడా నిద్ర పోవడం చాలా అవసరం. కనుక మీ పాప రోజూ కచ్చితంగా 9 నుంచి 10గంటల సేపు నిద్రపోయేలా చూడండి.
సువాసనను వెదజల్లే పెర్ఫ్యూమ్‌లకు మీ పాపను వీలైనంత దూరంగా ఉండండి. వీలైనంత వరకూ సహజమైన రీతిలో సువాసన వెదజల్లే వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. సాధారణంగా మార్కెట్లో దొరికే ఫర్ఫ్యూమ్ లలో థాలేట్స్ ఉంటాయి. ఇవి హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. ఈ చిట్కాలతో పీరియడ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలించలేకపోయినా, కొద్ది కాలం పాటు నియంత్రించగలం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం