Dreams and Meanings : మీ కలలో పిల్లలు ఏడవడం లేదా నవ్వడం చూశారా? అర్థం ఇదే
Meaning Of Dreams : స్వప్న శాస్త్రంలో ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుంది. మీ కలలో పిల్లలు ఏడుపు లేదా నవ్వడం చూశారా? పిల్లలు కలలోకి రావడం అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం..
కలల గురించి చెప్పే దాన్ని స్వప్న శాస్త్రం అంటారు. ఇందులో కలలో కనిపించే వివిధ విషయాలు లేదా సంఘటనలు వేరే అర్థాన్ని కలిగి ఉంటాయి. అవి మన భవిష్యత్తు గురించి చెబుతాయి. కలకు భవిష్యత్‍కు ముడిపడి ఉంటుందని అంటారు. చాలా సార్లు మనం కలలో కనిపించే వాటిని అర్థం చేసుకోలేం. అయితే ఈ విషయాలను స్వప్న శాస్త్రం చెబుతోంది. మీరు మీ కలలో ఏడుపు లేదా నవ్వుతున్న పిల్లలను చూస్తే కొన్ని రకాల అర్థాలు ఉంటాయి. పిల్లలు కలలోకి రావడం అంటే ఏంటో తెలుసుకుందాం..
మీరు మీ కలలో చిన్న పిల్లలను చూస్తే, త్వరలో మీ జీవితంలో కొన్ని శుభవార్తలు వస్తాయి. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది. అదే సమయంలో మీరు మీ కలలో కొంచెం పెద్ద పిల్లలను చూసినట్లయితే, ఇది మీకు శుభమైన కల కావచ్చు. మీ జీవితంలో సానుకూల మార్పు రాబోతోందని అర్థం. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది.
మీ కలలో చిన్న పిల్లవాడు ఏడుస్తున్నట్లు కనిపిస్తే, మీ కోరికలలో ఒకటి త్వరలో నెరవేరుతుందని అర్థం చేసుకోవాలి.
మీరు మీ కలలో నవ్వుతున్న పిల్లవాడిని చూస్తే మధ్యలో ఆగిపోయిన పనిని త్వరలో తిరిగి ప్రారంభిస్తారని అర్థం. మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
మీ కలలో కవలలను చూడటం అంటే మీకు త్వరలో మీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. అలాగే బిడ్డను కనాలనుకునే వారికి కూడా ఈ కల సంకేతంగా ఉంటుంది.
మీ కలలో నవజాత శిశువు మీ ఒడిలో నిద్రిస్తున్నట్లు మీరు చూసినట్లయితే, మీకు దగ్గరగా ఉన్న వారి ఇంట్లో ఒక బిడ్డ పుట్టవచ్చని అర్థం.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా కథన ఇచ్చాం. ఇది విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులో ఉన్న అంశాలను ఆమోదించదు. మీ విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి.