ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగం వివాహం. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి చాణక్యనీతి ఎంతో సహాయపడుతుంది. చాణక్యుడు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరంగా చెప్పాడు. వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక సలహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుండాలంటే ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? వంటి అంశాలను కూడా ఇచ్చాడు. ఈరోజు మనం చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యాభర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండవచ్చు? ఎక్కువ వయసు తేడా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం?
భార్యాభర్తల అనుబంధం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే వారి జీవితం అందంగా ఉంటుంది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదు. అది ఆ ఇద్దరు జీవితంలో పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని సరిచేయాలనుకున్నా కూడా మీరు ఎప్పటికీ చేసుకోలేరు. చాణక్య నీతి ప్రకారం ఒక వృద్ధుడు ఎప్పుడూ కూడా యువతిని వివాహం చేసుకోకూడదు. ఆ రకమైన సంబంధం ఎక్కువ కాలం నిలబడదు.
చాణక్యనీతి ప్రకారం స్త్రీ పురుషుల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాదు భర్త వయసు ఎప్పుడైతే అధికంగా ఉంటుందో భార్య జీవితం దుర్భరంగా మారుతుంది. ఆ వైవాహిక జీవితం ఎక్కువకాలం నిలబడదు. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మాత్రమే ఉండాలి.
భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంతో పవిత్రమైనది. ఇందులో ఒకరి అవసరాలు ఒకరు చూసుకోవాలి. ఒకరికోసం ఒకరు జీవించాలి. ఒకరిని ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే జీవితం నుండి ఆనందం ఆవిరి అయిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం వంటిది కొనసాగాలంటే వారి మధ్య వయసు తేడా కూడా ఎక్కువగా ఉండకూడదు.
అలా అని ఒకే వయసు గల వ్యక్తులు కూడా పెళ్లి చేసుకోకూడదు. ఒకే వయసు గల వ్యక్తులు ఒకేలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి సందర్భంలో భార్యాభర్తల మధ్య బంధం విషయంలో అనిశ్చితి ఏర్పడుతుంది. వారిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కాబట్టి నిర్ణయాలు దూకుడుగా తీసుకొనే అవకాశం ఉంది. కాబట్టి వయసు అంతరం అనేది చాలా ముఖ్యం. ఆ వయసు అంతరం భర్త భార్య కన్నా మూడేళ్లు పెద్ద లేదా ఐదేళ్ల వరకు పెద్దగా ఉండవచ్చు. అంతకుమించి ఎక్కువ వయసు తేడా కూడా ఉండకూడదు. ఈ వయసు అంతరం వారి ఆలోచనలలో తేడాలను సృష్టిస్తుంది. ఇది జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
సంబంధిత కథనం