రివర్స్ హెయిర్ వాషింగ్ అంటే ఏంటి? దీని వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటి?-what is reverse hair washing what are the benefits for hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రివర్స్ హెయిర్ వాషింగ్ అంటే ఏంటి? దీని వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటి?

రివర్స్ హెయిర్ వాషింగ్ అంటే ఏంటి? దీని వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటి?

Ramya Sri Marka HT Telugu

రివర్స్ హెయిర్ వాషింగ్ అనేది కొత్త టెక్నిక్కే అయినా ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ పద్ధతిని వాడుతున్నారు. షాంపూ వాడిన తర్వాత కండీషనర్ పెట్టుకోవడం కాదు, కండీషనర్ పెట్టుకున్న కాసేపటికి షాంపూ పెట్టుకోవడమే రివర్స్ హెయిర్ వాషింగ్. జుట్టును సంరక్షించుకోవడానికి ఈ టెక్నిక్ ఎలా వినియోగించాలో తెలుసుకోండి.

రివర్స్ వాషింగ్ టెక్నిక్ ఎలా ఉపయోగపడుతుంది

సొగసైన సిల్కీ జుట్టు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీని కోసం మన బడ్జెట్ కు అందుబాటులో ఉన్న ప్రతి టెక్నిక్ వాడేస్తాం. ఎవరికైనా మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిస్తే చాలా మనం కూడా అదే ప్రోసెస్ ఫాలో అయిపోతాం. వివిధ రకాల హెయిర్ మాస్క్‌లు, నూనెలు, కండిషనర్లను ఉపయోగిస్తుంటాం. ఇదే కోవలో జుట్టు అందాన్ని పెంచడానికి ఇటీవల కాలంలో ఒక కొత్త టెక్నిక్ ట్రెండింగ్ గా మారింది. అదేంటంటే, రివర్స్ హెయిర్ వాషింగ్.

మీ జుట్టు ఎక్కువగా ఎండిపోయి, గుచ్చుకుంటూ లేదా త్వరగా జిడ్డుకు మారిపోతుంటే రివర్స్ హెయిర్ వాషింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రీ-కండిషనింగ్ అని కూడా అంటారు.

జుట్టును వాష్ చేసుకోవడానికి కొత్త పద్ధతి

రెగ్యూలర్ గా జుట్టును ఎలా కడుగుతున్నామో, రివర్స్ హెయిర్ వాషింగ్ దానికి పూర్తిగా వ్యతిరేకం. సాధారణంగా తల వెంట్రుకలు వాష్ చేసుకునేందుకు ముందుగా షాంపూ వాడుతాము. మురికి తొలగిపోయి బాగా కడిగామనుకుని కన్ఫమ్ చేసుకున్న తర్వాతే జుట్టుకు కండిషనర్ పెడుతుంటాం. రెండు, మూడు నిమిషాలకు కడిగేస్తే వెంట్రుకలకు కండీషనర్ పట్టడంతో పాటు శుభ్రంగా ఉంటుందని భావించేవాళ్లం. కానీ, మీరు రివర్స్ హెయిర్ వాష్ ట్రెండ్‌ ఇంకా మంచి ఫలితాలను అందిస్తుందట. అదెలా అంటే, ముందుగా పొడి లేదా తేలికపాటి జుట్టుకు కండిషనర్ పట్టించి, 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని కోసం కండిషనర్ ను వెంట్రుకల కుదుళ్ల వరకూ పట్టించకండి. పైపైనే కండీషనర్ పట్టించి ఆ తర్వాత షాంపూతో జుట్టును కడిగేయండి. ఈ కొత్త టెక్నిక్‌తో జుట్టును కడగడం వల్ల తలలో ఉన్న నూనె, మురికి సులభంగా తొలగిపోతాయి.

షాంపూ జుట్టు నుండి సహజ నూనెను తీసుకోకుండా కండిషనర్ ప్రైమర్ లా పనిచేసి జుట్టును రక్షిస్తుంది. ఈ విధంగా జుట్టును కడగడం వల్ల ఇంకేం ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం:

  • రివర్స్ హెయిర్ వాష్ వల్ల జుట్టు మెత్తగా, మృదువుగా ఉంటుంది. జుట్టు తేమను నిలుపుకుంటుంది.
  • మీరు మందమైన, నిర్జీవమైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే ఈ టెక్నిక్‌ను ఉపయోగించండి. ఇది ముఖ్యంగా జుట్టును పలచగా మార్చి, తలలో జిడ్డు సమస్యతో బాధపడేవారికి మంచి ఫలితాలను ఇస్తుంది.
  • ఈ టెక్నిక్ వెంట్రుకలు గుచ్చుకోకుండా, మృదువుగా ఉండేలా చేస్తుంది. జుట్టు బౌన్సీగా కనిపిస్తుంది కూడా.
  • తల జిడ్డుగా అనిపించే మహిళలు వారానికి రెండుసార్లు రివర్స్ హెయిర్ వాష్ చేయవచ్చు, సాధారణ తల ఉన్నవారు వారానికి ఒకసారి ఈ విధంగా జుట్టును కడగాలి.
  • జుట్టును రసాయనాల నుండి కాపాడటానికి కండిషనర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ రివర్స్ హెయిర్ వాష్‌లో సాధారణంగా కండిషనర్ ముందు, షాంపూ తర్వాత ఉపయోగిస్తారు.
  • జుట్టు రంగు వేసిన వారికి కూడా రివర్స్ హెయిర్ వాషింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. షాంపూ చేసే ముందు కండిషనర్ వేయడం వల్ల రక్షణ పొర ఏర్పడుతుంది, దీనివల్ల షాంపూ జుట్టు రంగు లేదా హైలైట్స్‌పై ప్రభావం తగ్గుతుంది. ఈ టెక్నిక్ మీ జుట్టు రంగు ప్రకాశాన్ని, దీర్ఘకాలం ఉండేలా చేస్తుంది, దీనివల్ల సెలూన్‌కు వెళ్ళే సమయం పెరుగుతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం