Hydration therapy: హైడ్రేషన్ థెరపీ తీసుకుంటున్న ప్రముఖ బాలీవుడ్ హీరో, దీని వల్ల మీరు కూడా అందంగా మారచ్చు
Hydration therapy: హైడ్రేషన్ థెరపీ తీసుకుంటూ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కనిపించారు. అతను ఈ థెరపీని ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రతి అభిమాని ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మలైకా అరోరాతో బ్రేకప్ వార్తల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని రిలేషన్ షిప్ స్టేటస్ గురించి కాకుండా, ఆరోగ్య కారణాలతో వైరల్ అయ్యాడు. ఆయన ఆసుపత్రిలో చేతిలో ఉన్న డ్రిప్ పెట్టుకుని కనిపించాడే. ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆయనకు ఏమైందో, ఎందుకు చేతికి ఐవీ డ్రిప్ పెట్టారో తెలుసుకుని అతని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. ఆ థెరపీ హైడ్రేషన్ థెరపీ అంటారు. దీన్ని అర్జున్ కపూర్ ఎందుకు తీసుకుంటున్నాడో వైద్యులు వివరిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్రావీనస్ హైడ్రేషన్ థెరపీ ఒక విటమిన్ థెరపీ. ఈ థెరపీలో విటమిన్లు, ఖనిజాలు డ్రిప్ సహాయంతో నేరుగా రక్తంలోకి పంపుతారు. తద్వారా పోషఖాలు శరీరంలో అధిక మోతాదులో చేరుతాయి. ఈ చికిత్సలో, విటమిన్లు, ఖనిజాలు సప్లిమెంట్ల కంటే శరీరంలో వేగంగా కరుగుతాయి. ఈ థెరపీ ప్రభావం శరీరంపై వెంటనే మొదలవుతుంది. జీర్ణ, శ్వాసకోశ సమస్యలలో ఈ చికిత్స చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
హైడ్రేషన్ థెరపీ ఎందుకు?
హైడ్రేషన్ థెరపీ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చికిత్స రోగనిరోధక శక్తిని పెంచడానికి, హ్యాంగోవర్లను తగ్గించడానికి, బరువు తగ్గడానికి, వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాదు, చాలా మంది సెలబ్రిటీలు చర్మాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి, ప్రకాశవంతంగా ఉండటానికి ఐవీ హైడ్రేషన్ థెరపీని తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా, శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని త్వరగా తొలగించడానికి వైద్యులు ఈ చికిత్సను కూడా ఇస్తారు. ఒక వ్యక్తికి మందులు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఈ థెరపీని ఇస్తారు
హైడ్రేషన్ థెరపీ ప్రయోజనాలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీర్ణ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి హైడ్రేషన్ థెరపీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హైడ్రేషన్ థెరపీ తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఈ థెరపీ వల్ల శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని అధిగమించవచ్చు.
నివేదికల ప్రకారం, ఈ చికిత్స ఖర్చు 25,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఉంటుంది. విటమిన్ బి, విటమిన్ సి, మినరల్స్ అధిక మోతాదులో ఇస్తారు. హైడ్రేషన్ థెరపీ కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. యవ్వనంగా కనిపించేందుకు దీన్ని తీసుకునే వారు ఉన్నారు. అతి త్వరగా పోషకాహార లోపాన్ని తగ్గించుకోవాలంటే రెండు రోజులు ఈ థెరపీని తీసుకుని చూడండి. మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది.
టాపిక్