Garlic benefits: వెల్లుల్లి రెబ్బలను రాత్రిపూట దిండు కింద పెట్టుకుని నిద్రపోతే ఏం జరుగుతుంది? తెలిస్తే ఆశ్చర్యపోతారు-what happens if you sleep with garlic cloves under your pillow at night you will be surprised to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Garlic Benefits: వెల్లుల్లి రెబ్బలను రాత్రిపూట దిండు కింద పెట్టుకుని నిద్రపోతే ఏం జరుగుతుంది? తెలిస్తే ఆశ్చర్యపోతారు

Garlic benefits: వెల్లుల్లి రెబ్బలను రాత్రిపూట దిండు కింద పెట్టుకుని నిద్రపోతే ఏం జరుగుతుంది? తెలిస్తే ఆశ్చర్యపోతారు

Haritha Chappa HT Telugu
Jan 01, 2025 02:00 PM IST

Garlic benefits: వెల్లుల్లి ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాదు, ఇందులో అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లిని తినడంతో పాటు, దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

వెల్లుల్లి రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు (Shutterstock)

కూరల్లో, బిర్యానీల్లో వెల్లుల్లి వేస్తేనే అధిక రుచి. ఇక నాన్ వెజ్ వంటకాలకు కచ్చితంగా వెల్లుల్లి ఉండాల్సిందే. దాని సువాసన, రుచి ఆహారానికి ప్రత్యేకమైన టేస్టును అందిస్తుంది. అంతే కాదు వెల్లుల్లిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో కూడా దీనికి ఎక్కువ విలువ ఇస్తారు. అయితే రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద రెండు వెల్లుల్లి రెబ్బుల పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

yearly horoscope entry point

నిద్ర పట్టేలా చేస్తుంది

ఆధునిక కాలంలో నిద్రలేమి సమస్యతోె బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. నిద్రపట్టక గంటలు గంటలు ఇటూ అటూ కదులుతూనే ఉంటారు. రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ఆ సమయంలో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఇబ్బంది పడితే మీ దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని పడుకోవడానికి ప్రయత్నించండి. వాస్తవానికి, వెల్లుల్లి ఘాటైన వాసన మెదడుకు ఉపశమనాన్ని అందిస్తుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. దీని వాసన నిద్రపోవడానికి చాలా సహాయపడుతుంది.

వెల్లుల్లిలో నేచురల్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే దాని వాసన శరీరానికి చాలా ప్రయోజనాన్ని అందిస్తుంది. మీరు మీ దిండు వెల్లుల్లి రెబ్బలతో నిద్రపతే అది మీ చుట్టూ ఒక రకమైన కవచాన్ని సృష్టిస్తుంది. సమీపంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు మీ దగ్గరికి వచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడవు. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో పోరాడటానికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రాత్రి పడుకునేటప్పుడు దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీరు వెల్లుల్లి రెబ్బలను మీ దిండు కింద పెట్టుకోవాలి. ప్రాచీన కాలంలోని ప్రజలు ఇదే పని చేసేవారు. వెల్లుల్లి నుంచి వచ్చే బలమైన, ఘాటైన వాసన దోమలు, కీటకాలను దూరంగా ఉంచుతుంది. అలాగే దోమ కాటు నుంచి కూడా బయటపడవచ్చు. మీరు విశ్రాంతిగా నిద్ర పొందుతారు.

పీడకలలు రాకుండా…

రాత్రి పడుకునేటప్పుడు కూడా మీకు పీడకలలు ఉంటే, మీరు ఈ వెల్లుల్లి చిట్కాను ప్రయత్నించవచ్చు. వెల్లుల్లికి నెగిటివిటీని గ్రహించే గుణం ఉందని నమ్ముతారు. మీరు దిండు కింద వెల్లుల్లి ఉంచి నిద్రపోవడం వల్ల అది మీ చుట్టూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ఇది రాత్రిపూట చెడు ఆలోచనలు, భయానక కలలు రాకుండా అడ్డుకుంటుంది. మంచి విశ్రాంతి నిద్ర కోసం మీరు ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner