Nail Polish effects: ఎప్పుడూ గోళ్లకు నెయిల్ పోలిష్ వేసుకుంటున్నారా? అయితే ఇది తప్పక చదవండి..
Nail polish side effects: గోళ్లకు రంగు మంచిదే కానీ, తరచూ నెయిల్ పాలిష్ పెట్టుకుంటే మాత్రం అనర్థమే. దానివల్ల కలిగే దుష్ఫలితాలేంటో తెలుసుకోండి.

నెయిల్ పాలిష్ ప్రభావం (pexels)
చాలా మంది అమ్మాయిలకు నెయిల్ పోలిష్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. అందుకనే ఎప్పడూ గోళ్లను ఖాళీగా ఉంచరు. రకరకాల రంగుల పోలిష్లను తెచ్చుకుని పెట్టుకుంటారు. డ్రస్‌కి తగినట్లుగా, వేడుకకి తగినట్లుగా రోజుకో రంగు చొప్పున మార్చేస్తుంటారు. మొత్తం 365 రోజులూ వీరి గోళ్లు నెయిల్ పోలిష్‌తో మేకప్ అయ్యే ఉంటాయి. మరి ఇలా ఎప్పుడూ గోళ్ల రంగు వేసుకుని ఉండటం మంచిదేనా? దీని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తెలుసుకోండి..
- గోళ్లకు ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా గోళ్ల రంగు వేసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడూ ఖాళీ లేకుండా అదే పనిగా గోళ్ల రంగును పూయకూడదు. అందువల్ల గోళ్లకు గాలి తగలదు. అవి సన్నగా, పెళుసుగా మారతాయి. విరిగిపోతాయి. బలహీనంగా ఉన్న గోర్లకు తేలికగా ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు సోకే అవకాశం ఉంటుంది.
- ఎక్కువ రోజుల పాటు ముదురు రంగుల్లో ఉండే గోళ్ల రంగులను వాడటం, వాటిని తీసేయకుండా అలానే ఉంచేయడం వల్ల గోళ్లు వాటి సహజ రంగును కోల్పోతాయి. గోళ్ల రంగులో ఉండే పిగ్మెంట్‌ని అవి పీల్చుకుని కాసింత పసుపు వర్ణంలోకి మారిపోతాయి. అంటే అవి అనారోగ్యకరంగా మారుతున్నాయని అర్థం. అంటే వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలుగదు. కానీ అవి మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే ఆరు నెలలు పైనే పడుతుంది.
- గోళ్ల రంగుల్లో ఎక్కువగా ఫార్మాల్డిహైడ్ రేజిన్, డైబ్యూటిల్ థాలేట్, టోలున్ లాంటి ప్రమాదరకమైన విష రసాయనాలు ఉంటాయి. మనం భోజనం చేసేప్పుడు ఇవి గనుక లోపలికి వెళితే అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తాయి.
- దీర్ఘ కాలం పాటు ఈ విష రసాయనాలతో మన గోళ్లను ఉంచడం వల్ల నెయిల్ ప్లేట్ అడుగు భాగం బలహీనంగా తయారవుతుంది. ఫలితంగా అక్కడ ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు పెరిగిపోయి దీర్ఘ కాలిక గోరు సమస్యలకు కారణం అవుతాయి.
- గోళ్ల రంగును తీసివేయడానికి వాడే రిమూవర్ల వల్లా అవి పెళుసుగా మారే అవకాశాలు ఉంటాయి.
- ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో గోళ్లకు రంగులు పూయకుండా ఉండటమే మంచిది. అవి అలా బ్రీథబుల్‌గా ఉన్నప్పుడే వాటికి గాలి ఆడుతుంది. సహజంగా మెరుస్తూ ఉండేందుకు అవకాశం ఉంటుంది.
- అలాగే నెయిల్ పాలిష్‌లు, రిమూవర్లను నాణ్యమైనవి వాడేందుకు ప్రయత్నించాలి. వీటి వల్ల పరిస్థితి కాస్త మెరుగవుతుంది.
టాపిక్