Toothpaste Colour Code : టూత్‌పేస్ట్ ట్యూబ్‌లోని కలర్ కోడ్ ఏం చెబుతుంది? మీకు ఏ టూత్‌పేస్ట్ సరైనది?
Toothpaste Colour Code : టూత్‌పేస్ట్ ట్యూబ్ మీద కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటికి గల అర్థమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?
గతంలో టూత్‌పేస్ట్‌కి బదులు బొగ్గుపొడి లేదా బియ్యప్పిండిని ఉప్పుతో కలిపి వాడే వారు. లేదా పల్లెటూర్లలో ఎక్కువగా వేప పుల్లను ఉపయోగిస్తారు. ఇప్పటికీ దానిని ఉపయోగించేవారు ఉన్నారు. నిజానికి పంటి ఆరోగ్యానికి అదే మంచిది. కానీ ఇటీవలి కాలంలో ఎక్కువగా బ్రష్, టూత్‌పేస్ట్ ఉపయోగిస్తున్నారు. అయితే టూత్‌పేస్ట్ మీద కలర్ కోడ్ ఉంటుంది. దీని అర్థం ఏంటో చూద్దాం..
చతురస్రాకారంలో ఆకుపచ్చ రంగు
టూత్‌పేస్ట్ మీద చిన్నగా చతురాస్రాకారంలో ఆకుపచ్చ రంగులో ఉంటే, అది హెర్బల్ ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసినట్లు అర్థం.
బ్లూ మార్క్
ఇది కొన్ని ఔషధ పదార్థాలతో పాటు సహజ ఉత్పత్తులను కలిగి ఉంటుంది.
రెడ్ మార్కింగ్
ఇందులో సహజ ఉత్పత్తులు, రసాయన ఉత్పత్తులు కలిపి తయారు చేశారని అర్థం.
ప్రతి టూత్‌పేస్ట్‌లో ఈ ఫంక్షన్ చేసే రసాయనాలు ఉంటాయి. గ్లిజరిన్, సార్బిటాల్, ఇది టూత్‌పేస్ట్ ఎండిపోకుండా చేస్తుంది. కాల్షియం కార్బోనేట్, సిలికా దంతాలలోని పసుపు లేదా నలుపు రంగును తొలగించి దంతాల ప్రకాశాన్ని పెంచుతుంది. శాచరిన్, జిలిటోల్ దంత క్షయాన్ని నివారిస్తుంది. సోడియం లారిల్ సల్ఫేట్.. బ్రష్ చేసేటప్పుడు టూత్‌పేస్ట్ నురుగు చేస్తుంది.
యాంటీ బాక్టీరియల్ ఏజెంట్.. ఇది దంతాలను రక్షిస్తుంది. ఈ అంశాలన్నీ టూత్‌పేస్ట్‌లో ఉంటాయి. దంతాల పసుపు రంగును నివారిస్తుంది. నోటి దుర్వాసనను కూడా రాకుండా చేస్తుంది. మన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
మార్కెట్లో చాలా టూత్‌పేస్ట్‌లు ఉన్నాయి. మీకు ఏ టూత్‌పేస్ట్ సరైనదో మీరు ఎలా ఎంచుకోవాలి?
ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్
ఈ టూత్‌పేస్ట్‌ను పిల్లలు, పెద్దలు ఉపయోగించవచ్చు. ఇది దంత క్షయాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
తెల్లబడేందుకు టూత్‌పేస్ట్
దంతాలు పసుపు రంగులో ఉంటే, దంతవైద్యులు మీకు సూచించినట్లయితే, దంతాలు తెల్లగా మారడానికి దీనిని ఉపయోగిస్తారు.
యాంటీ బాక్టీరియల్ టూత్‌పేస్ట్
నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటే నోటి లోపల చెడు బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి ఈ టూత్‌పేస్ట్ సూచించబడుతుంది.
సెన్సిటివ్ టూత్‌పేస్ట్
సెన్సిటివ్ దంతాలు ఉన్నవారు ఈ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం మంచిది. సెన్సిటివ్ టూత్ ఉన్నవారు హాట్ ఫుడ్ ఐటమ్స్, ఐస్ క్రీం, నోటిని తాకితే చాలా బాధగా ఉంటుంది.
సహజ టూత్‌పేస్ట్
సహజమైన టూత్‌పేస్ట్ సహజ పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడుతుంది. కృత్రిమ రంగులను కలిగి ఉండదు.
పిల్లల టూత్‌పేస్ట్
ఈ టూత్‌పేస్ట్ ఉప్పగా ఉండదు.. కాబట్టి పిల్లలు ఈ టూత్‌పేస్ట్‌తో పళ్ళు తోమడానికి ఇష్టపడతారు, లేకపోతే పిల్లలకు ఉప్పు వస్తుంది.
స్మోకర్స్ టూత్‌పేస్ట్
దంతాల మీద రుద్దడం ద్వారా మొండి మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
హెర్బల్ టూత్‌పేస్ట్
ఇది టీ ట్రీ ఆయిల్, పిప్పరమెంటు, వేప ఆకులతో తయారు చేస్తారు.
దంత క్షయం సమస్యలను నివారించడంలో టూత్‌పేస్ట్ సహాయపడుతుంది. దంతాలను తెల్లగా మార్చడమే కాదు, నోటి శుభ్రతకు కూడా మంచిది. నోటి దుర్వాసనను నివారించడానికి బ్రష్ సరిగా చేయడం వల్ల నోటి దుర్వాసనను నివారించవచ్చు. దంతాలు తెల్లగా ఉండి నోటి దుర్వాసన రాకుంటే మనలో కూడా ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.