Valentines day: వాలెంటైన్స్ డేకు ఎరుపురంగుకు ఉన్న సంబంధం ఏమిటి? వాలెంటైన్స్ డే రోజు ఎరుపుకు ఎందుకంత ప్రత్యేకత?-what does the color red have to do with valentines day why is red so special on valentines day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day: వాలెంటైన్స్ డేకు ఎరుపురంగుకు ఉన్న సంబంధం ఏమిటి? వాలెంటైన్స్ డే రోజు ఎరుపుకు ఎందుకంత ప్రత్యేకత?

Valentines day: వాలెంటైన్స్ డేకు ఎరుపురంగుకు ఉన్న సంబంధం ఏమిటి? వాలెంటైన్స్ డే రోజు ఎరుపుకు ఎందుకంత ప్రత్యేకత?

Haritha Chappa HT Telugu
Published Feb 14, 2025 09:30 AM IST

Valentines day: వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు ఎరుపు రంగు దుస్తులు ధరించడం చూస్తూ ఉంటాము. అలాగే ఎరుపు రంగు గులాబీ, ఎరుపు రంగు లవ్ సింబల్, ఎరుపు రంగు టెడ్డీబేర్ ఎక్కువగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.

వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే (Pixabay)

ఫిబ్రవరి 14 వచ్చిందంటే ప్రేమికుల ప్రపంచం ఎరుపు రంగుతో నిండిపోతుంది. ఎరుపు రంగు గులాబీలు ఎరుపు రంగు టెడ్డీబేర్, ఎర్రని లవ్ సింబల్స్, ఎరుపు రంగు దుస్తులతో అంతా ఎరుపు వర్ణమయంగా మారిపోతుంది. ప్రేమకు ఎరుపు రంగుకు సంబంధం ఏమిటి? వాలెంటైన్స్ డే రోజు ఎరుపు రంగుకు ఎందుకంత ప్రత్యేకత?

వాలెంటైన్స్ డే మూలాలు పురాతన రోమ్ రాజ్యంలో గుర్తించారు. అక్కడ లూపెర్కాలియా అనే వేడుక జరిగేది. ఫిబ్రవరి మధ్యలో జరిగే పండుగ ఇది. సంతానోత్పత్తి పండగగా కూడా చెప్పుకునేవారు. అలాగే వసంతకాలం రాకను కూడా ఈ పండుగ సూచిస్తుందని అనేవారు. ఈ పండుగను నిర్వహించుకుంటే మహిళలకు సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. ప్రేమ కోసం ఎరుపు రంగు మంచిదని అప్పట్లో భావించేవారు. ఎరుపు రంగు బోల్డ్ గా కనిపిస్తుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. శక్తివంతంగా ఉంటుంది. ఇది జీవితాన్ని సూచిస్తుందని రోమ్ ప్రజలు నమ్మేవారు. అందుకే ఆ రోజున ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ పండుగే తర్వాతి కాలంలో వాలెంటైన్స్ డే గా మారిందని అంటారు.

ఎరుపు రంగు ఆప్యాయత, కోరికతో నిండి ఉంటుందని చెప్పుకుంటారు. అందుకే ఎరుపును ప్రేమకు గుర్తుగా మార్చేశారు. ఒకరి శృంగార భావాలను వ్యక్తీకరించడానికి కూడా ఎరుపు రంగే ఉత్తమమైందని అంటారు. ఎరుపు రంగు మానసికంగా చూపించే ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఎరుపు రంగును చూస్తే చాలు

ఎరుపు రంగును చూస్తున్న కొద్ది భావోద్వేగాలు ఎక్కువవుతాయి. బలమైన ప్రతిచర్య రేకెత్తించేలా ఉంటుంది. ఇది ప్రేమను, కోరికను పెంచుతుంది. అలాగే హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది. అడ్రినలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఎప్పుడైతే అడ్రినలిన్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో ఉత్సాహం పెరుగుతుంది. ఎదుటివారు ఆకర్షణగా కనిపిస్తారు. ఈ శారీరక ప్రతిస్పందన ప్రేమ అని కూడా పిలుచుకుంటారు. ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న వారు వంద మందిలో ఉన్న ప్రత్యేకంగా నిలుస్తారని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎరుపు రంగును ప్రేమ, అనుబంధానికి అంకితమైన రంగుగా చెప్పుకుంటారు. అన్ని సంస్కృతుల్లో ఎరుపు రంగుకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతుల్లో ఎరుపు రంగు ప్రేమకు అభివృద్ధికి కారణంగా చెప్పుకుంటారు. అదే చైనాలో అయితే ఎరుపు రంగును అదృష్టానికి, ఆనందానికి సూచికగా పరిగణిస్తారు.

ప్రేమికుల రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం అనేది వందల ఏళ్లుగా కొనసాగుతోంది. గ్రీటింగ్ కార్డులు,పూలు కూడా ఎరుపు రంగులోనే అధికంగా ఉంటాయి. ప్రేమికుల రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం అనేది ప్రేమను వ్యక్తీకరించడమే. అది ఇతను భాగస్వామికి అర్థమయ్యేలా చేయడమే. ఎరుపు రంగు భావోద్వేగ ప్రభావాలను అధికంగా కలిగి ఉంటుంది. కాబట్టే లవ్ సింబల్స్ కూడా ఎరుపు రంగుని అందించారు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం