Alcohol dosage: ఆల్కహాల్ ఎంత తాగితే ప్రమాదం లేదు? వైద్యుల సలహా తెల్సుకోండి-what doctor spoke on alcohol limit and health effects on liver ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol Dosage: ఆల్కహాల్ ఎంత తాగితే ప్రమాదం లేదు? వైద్యుల సలహా తెల్సుకోండి

Alcohol dosage: ఆల్కహాల్ ఎంత తాగితే ప్రమాదం లేదు? వైద్యుల సలహా తెల్సుకోండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 10, 2024 02:30 PM IST

Alcohol dosage: తక్కువ మొత్తంలో ఆల్కహాల్ కాలేయ ఆరోగ్యానికి ఏ సమస్యా లేదా? ఎక్కువ తాగితేనే చెడు ప్రభావాలుంటాయా అని అనేక సందేహాలుంటాయి. దీనిగురించి డాక్టర్ శివ్ కుమార్ సరిన్ సమాధానం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని గురించి ఏం చెబుతుందో కూడా తెల్సుకోండి.

ఆల్కహాల్ మోతాదు
ఆల్కహాల్ మోతాదు (HT FIle/ Representational image)

“ఆల్కహాల్ కాలేయానికి హాని కలిగిస్తుంది, తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది” ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇన్స్టా-పాపులర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ సరిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆల్కహాల్ సామాజికంగా అందరూ అంగీకరించిన విషం అని ఆయన అన్నారు. ఎంత చిన్న మొత్తంలో తాగినా ఆల్కహాల్ కాలేయానికి సురక్షితం కాదు. ఆల్కహాల్ తాగితే నేరుగా కాలేయానికి హాని కలుగుతుందని, వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

తక్కువ ఆల్కహాల్ సురక్షితం అంటారెందుకు?

చాలా మంది వైద్యులు తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితే కాలేయానికి హాని ఉండదని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించగా డాక్టర్ సరిన్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆల్కహాల్ మంచిదని చెప్పే వైద్యులను మనం చూస్తూ ఉంటాం. కానీ అది నిజం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థను( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఆల్కహాల్ ఎంత మొత్తంలోనూ తాగడం ఆరోగ్యకరం కాదని ఆయనన్నారు.

ఆల్కహాల్ ప్రభావం:

ఇతర ఆహార పదార్థాలు కడుపు ద్వారా శోషించబడతాయి. కానీ ఆల్కహాల్‌ను నేరుగా పేగులు గ్రహిస్తాయని డాక్టర్ శివ్ కుమార్ అన్నారు. ఇది ఆల్కహాల్ ను కాలేయం తొందరగా గ్రహించేలా చేస్తుంది. అందువల్ల, ఆల్కహాల్ కాలేయ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఆల్కహాల్‌తో కొవ్వు పదార్ధాలను తీసుకుంటే?

డాక్టర్ శివకుమార్ సరిన్ ఒక సాధారణ సందేహానికి పరిష్కారం వివరించారు. ఆల్కహాల్ తాగేటప్పుడు కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి జరిగే హానిని సమతుల్యం చేస్తుంది అంటారు. కానీ కొవ్వు ఆహారాలు కూడా కాలేయంలో కొవ్వును పెంచుతాయి. దీంతో ఆల్కహాల్ తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్‌తో కొవ్వు పదార్థాలు తీసుకోవడం మరింత హానికరం.

కాలేయాన్ని ప్రభావితం చేస్తాయా?

ఒక గ్రాము చక్కెరలో నాలుగు కేలరీలు ఉంటాయి. అదే ఆల్కహాల్‌లో ఒక గ్రాముకు ఏడు కేలరీలుంటాయి. అంటే చక్కెర కంటే దాదాపు రెట్టింపు. అందువల్ల వీటిని కలిపి తీసుకోవడం శరీరానికి, మరీ ముఖ్యంగా కాలేయ ఆరోగ్యానికి ప్రాణాంతకం.

ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలుంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.

 

టాపిక్