Garlic Naan Recipe: రొటీన్‌గా రోటీలు ఏం తింటారు వెల్లుల్లితో ఇలా నాన్ తయారు చేసుకుని తినండి.. రుచి అదిరిపోతుంది!
Garlic Naan Recipe: రోటీ అనగానే మొహం తిప్పేస్తున్నారా! ఎప్పుడూ ఒకటే తింటే బోర్ కొట్టదు మరి. ఈ సారి రోటీకి బదులుగా వెల్లుల్లితో చేసిన ఈ నాన్‌ను ట్రై చేయండి. మీకు నచ్చిన వంటకంతో సర్వ్ చేసుకుని ఇంట్లో వాళ్లతో పాటు గెస్ట్‌లను కూడా ఇంప్రెస్ చేసేయండి. క్షణాల్లో తయారుచేసుకునే ఈ రెసిపీ మీకోసం..

రొటీన్‌కు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారా..? ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? టిఫిన్‌లో భోజననంతో పాటు నాన్ పెట్టాలనుకుంటే ఈ రుచికరమైన వెల్లుల్లి నాన్ రెసిపీని ట్రై చేయండి. ఈ నాన్ రెడీ చేయడానికి వెల్లుల్లి, కొత్తిమీర కూడా యాడ్ చేస్తే మరింత రుచికరంగా మారుతుంది. దాల్ మఖానీ, తడ్కా పప్పుతో కలిపి సర్వ్ చేసుకునే వెల్లుల్లి నాన్‌ను కావాలనుకుంటే, మీకు ఇష్టమైన కూరగాయలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే, పిల్లల నుంచి పెద్దల వరకూ దీని టేస్ట్ కి ఫిదా అయిపోవాల్సిందే. కాబట్టి, ఆలస్యం చేయకుండా ఇంట్లోనే రుచికరమైన వెల్లుల్లి నాన్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
టేస్టీ గార్లిక్ నాన్ తయారీకి కావలసిన పదార్థాలు
- మైదా పిండి - 1/2 కప్పు
- డ్రై ఈస్ట్ - 1/2 టీస్పూన్
- పెరుగు - 1 టేబుల్ స్పూన్
- పాలు - 1/3 కప్పు
- పంచదార - 1/2 టీస్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- గోరువెచ్చని నీరు - 1/2 కప్పు
- సన్నగా తరిగిన వెల్లుల్లి - 2 టేబుల్ స్పూన్లు
- సన్నగా తరిగిన కొత్తిమీర- 3 టేబుల్ స్పూన్లు
- వెన్న
హోటల్ వంటి రుచికరమైన వెల్లుల్లి నాన్ తయారీ ఎలా చేయాలి
- హోటల్ తరహా రుచికరమైన వెల్లుల్లి నాన్ తయారు చేయాలంటే, ముందుగా ఒక పాత్రలో పొడి ఈస్ట్ వేసి అందులో పంచదార కలపాలి.
- దాంట్లోనే 1/2 కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.
- ఇలా చేసేటప్పుడు ఈస్ట్ మిశ్రమంలో నురుగు కనిపిస్తే మిశ్రమం బాగుంటుందని అర్థం అని గుర్తుంచుకోండి. అయితే ఈస్ట్‌లో నురగ లేకపోతే ఆ మిశ్రమంలో వేడినీళ్లు ఎక్కువగా వాడినట్లు అవుతుంది.
- ఒకవేళ ఈ మిశ్రమంలో నురగ లేకపోతే, మిశ్రమాన్ని మళ్లీ సిద్ధం చేయండి. లేదంటే నాన్స్ రుచిగా ఉండవు.
- ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో ఒకటిన్నర కప్పుల మైదా పిండిని జల్లెడపట్టి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు, నూనె, ఉప్పు వేసి కలపండి.
- తరువాత ముందుగా తయారుచేసిన ఈస్ట్ మిశ్రమాన్నికూడా ఇందులో వేసి బాగా కలపండి.
- ఇప్పుడు అన్నింటినీ మిక్స్ చేసి రోటీ పిండిలా మెత్తగా పిసికి పక్కక్కు పెట్టుకోండి. అవసరమైతే కొద్దిగా నీటిని కూడా వాడుకోవచ్చు.
- ఆ తర్వాత పిండిని నూనెలో ముంచి తడి గుడ్డతో కప్పి ఒక గంట నుంచి గంటన్నర పాటు పక్కకు పెట్టండి.
- నిర్ణీత సమయం తర్వాత బట్ట తీసేస్తే పిండి మెత్తగా మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు పిండి మరింత మెత్తబడటానికి మరోమారు చక్కగా కలుపుకుని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి.
- ఆ తర్వాత మళ్లీ గుడ్డతో మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుని పైన పిండిని అప్లై చేసి నాన్ షేపులోకి తయారు చేసుకోవాలి.
- ఇలా చేసేటప్పుడు అందులో కొద్దిగా తరిగిన వెల్లుల్లి, తరిగిన కొత్తిమీర వేసి రోలింగ్ పిన్ లేదా చేతితో నెమ్మదిగా నొక్కాలి.
- నాన్ ను మరోవైపుకు తిప్పి చేతితో లేదా బ్రష్ సహాయంతో కాస్త నీటితో తడపండి.
- ఇప్పుడు వేడి ఇనుప పెనం మీద నాన్ తడి సైడ్ తో పాన్ మీద పెట్టాలి.
- ఇలా రెండు వైపులా తిప్పుడూ నాన్ పూర్తిగా ఉడికే వరకు ప్యాన్ మీద ఉంచండి. నాన్ బంగారు రంగులోకి మారడానికి ఒక నిమిషానికి పైనే సమయం పడుతుంది.
- మీకు కావాలనుకుంటే ఈ నాన్ మీద నెయ్యి లేదా వెన్న రాసుకోవచ్చు.
- అంతే వేడి వేడి వెల్లుల్లి నాన్ రెడీ అయినట్టే. మీకు నచ్చిన కూరలతో కలిపుకుని తినేయడమే.
వెల్లుల్లి వేయడం వల్ల ఈ నాన్ మరింత రుచిగా అనిపిస్తాయి. తప్పకుండా ఇది అందరికీ నచ్చే రెసిపీ. ఈ సారి తప్పకుండా ప్రయత్నించి చూడండి.
సంబంధిత కథనం
టాపిక్