Leftover Food : మిగిలిపోయిన ఆహారం తినొచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?-what ayurveda says about leftover food eating you have to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  What Ayurveda Says About Leftover Food Eating You Have To Know

Leftover Food : మిగిలిపోయిన ఆహారం తినొచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?

మిగిలిపోయిన యాహారం
మిగిలిపోయిన యాహారం

Leftover Food : కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వంట చేస్తాం. చాలా మిగిలిపోతుంది. దీంతో రేపు తినొచ్చులేనని అనుకుంటాం. కానీ ఇలా తింటే మంచిదేనా? మిగిలిపోయిన ఆహారం ఎన్ని గంటల వరకూ తినొచ్చు?

ఇంట్లో వాళ్ల సంఖ్యకు తగ్గట్టుగా ఆహారం వండుకుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా ఎక్కువగా వంట చేస్తారు. దీంతో మిగిలిపోతుంది. వృథా చేయకుండా మరుసటి రోజు తింటాం. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి(health) మంచిదేనా? మిగిలిపోయిన వాటిని తినాలా లేదా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. మీకూ ఆ గందరగోళం ఉండవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఆహారాన్ని(Food) సరిగ్గా వేడి చేయడం వల్ల తాజాదనాన్ని, రుచిని సంరక్షించవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. మరోవైపు, మిగిలిన ఆహారం అనారోగ్యానికి దారితీస్తుందని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. మిగిలిపోయిన వాటిని తిన్నప్పుడు శరీరానికి అసలు ఏమి జరుగుతుంది?

సైన్స్ ప్రకారం, ఆహారాన్ని 165 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు 15 సెకన్ల పాటు వేడి చేయడం వల్ల మిగిలిన వ్యాధికారక, బ్యాక్టీరియాను చంపేస్తుంది. సైన్స్ ప్రకారం ఆహారాన్ని తిరిగి వేడి చేయడం బ్యాక్టీరియా(Bacteria)ను చంపడానికి మాత్రమే కాకుండా, అదే సమయంలో తాజాదనాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం వండిన మూడు గంటల తర్వాత ఆహారం పోషక విలువను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.

మిగిలిపోయిన వాటిని తినడం వల్ల పోషకాలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం తాజాగా వండిన ఆహారాన్ని.. 3 గంటలలోపు తినాలి. అయితే మిగిలిపోయిన(Leftover Food) వాటిని తినడం సాధారణ విషయమే. 24 గంటల కంటే ఎక్కువ నిల్వ ఉన్న ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. వాస్తవానికి, అటువంటి సందర్భాలలో బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ఆహారాన్ని నిల్వ చేయడానికి, మళ్లీ వేడి చేయడానికి సరైన మార్గాలను ఎంచుకోవడం కూడా మంచిది. ఈరోజు వండిన ఆహారాన్ని రేపు తినడం మీ శరీరానికి, ఆరోగ్యానికి(health) మంచిది కాదని తెలుసుకోండి.

మిగిలిపోయిన వాటిని తినడం మీ పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, మంటను ప్రేరేపిస్తుంది. శరీరంలో విషాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం మిగిలిపోయిన వాటిని తినడం వల్ల పేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆహారాన్ని ఫ్రిడ్జిలో పెట్టడం, మళ్లీ వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషక విలువలు తగ్గుతాయని నమ్ముతారు. అందువల్ల, తాజాగా తయారుచేసి.. 3 గంటలలోపు తీసుకోవడం ఉత్తమం. తాజాగా వండిన ఆహారం మిమ్మల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు.

తాజాగా వండిన ఆహారాన్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి మళ్లీ వేడి చేసి తినడానికి సరిపోయేలా చేయవచ్చు. అయితే వీలైనంత వరకు మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలను(Food Items) వండిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే వాటిని వేడిచేసినప్పుడు పోషకాలు తగ్గిపోయి ఫుడ్ పాయిజనింగ్(food poisoning) అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత కథనం