Marriage Mistakes: దాంపత్య జీవితంలో జంటలు చేసే సాధారణ తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దాలి ఇక్కడ తెలుసుకోండి!-what are the common mistakes couples make in marriage learn how to fix them here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Marriage Mistakes: దాంపత్య జీవితంలో జంటలు చేసే సాధారణ తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దాలి ఇక్కడ తెలుసుకోండి!

Marriage Mistakes: దాంపత్య జీవితంలో జంటలు చేసే సాధారణ తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దాలి ఇక్కడ తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Feb 02, 2025 03:30 PM IST

Marriage Mistakes: పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రపంచంగా మారి జీవితాంతం సంతోషంగా జీవించాల్సి ఉంటుంది. కానీ వివాహం తర్వాత చేసే కొన్ని తప్పులు దంపతుల మధ్య విభేదాలకు దారితీయవచ్చు. దాంపత్య జీవితంలో జంటలు చేసే సాధారణ తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దాలి ఇక్కడ తెలుసుకోండి!

దాంపత్య జీవితంలో జంటలు చేసే సాధారణ తప్పులు ఏమిటి?
దాంపత్య జీవితంలో జంటలు చేసే సాధారణ తప్పులు ఏమిటి? (Pixabay)

పెళ్లి అనేది జీవితంలోని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన బంధం. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండటం దీని ఉద్దేశం. కానీ వివాహం అనేది కొందరిలో ఉత్సుకత, ఆనందాన్ని కలిగిస్తుంటే, మరికొందరిలో భయం, ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి వివాహానికి కున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దంపతులు ఇద్దరి కృషి చేయాల్సి ఉంటుంది. దానికి కొంత అనురాగం, త్యాగం తప్పకుండా అవసరం.

yearly horoscope entry point

వైవాహిక జీవితంలో కొన్నిసార్లు సమస్యలు రావచ్చు, ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఒకసారి ఏర్పడిన ఈ చీలికను సరిచేయకపోతే అని మళ్లీ మళ్లీ సమస్యను లేవనెత్తుతుంది, పెద్దదిగా మారుతుంది. సుఖమైన దాంపత్యానికి అడ్డంకి అవుతుంది మరియు మానసిక శాంతి ఉండదు. అలా మారిందంటే విడిపోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. సాధారణంగా వైవాహిక జీవితంలో చాలా మంది చేసే పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దాలో ఇక్కడ తెలుసుకోండి.

వివాహం బంధంలో ఎక్కువ మంది చేసే సాధారణ తప్పులు, పరిష్కారాలు

ఇద్దరు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఇలాంటి సందర్భంలో కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోవాలి. పరస్పరం ఇద్దరూ సామరస్యంగా ఉంటే వారి సంబంధం కూడా బాగుంటుంది. సంబంధంలో ప్రేమ, స్నేహాన్ని పెంపొందించుకోవాలి.

పోజెసివ్‌నెస్ (Possessiveness) బదులు నమ్మకాన్ని పెంపొందించుకోండి:

వివాహంలో ఒకరు మరొకరిపై అధికారం చెలాయించడం సరైనది కాదు. బంధం బలంగా ఉండాలంటే ఇలాంటి మనస్తత్వాన్ని వదిలేయండి. పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకోండి. మీ భాగస్వామికి స్వేచ్ఛనివ్వండి, వారి భావాలను కూడా గౌరవించండి. అలాగైతేనే ఇది ఆరోగ్యకరమైన సంబంధం అవుతుంది.

మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి:

మీ భాగస్వామి ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి నిజమే, కానీ దాని కన్నా ముఖ్యమైది మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం. మీ వివాహంతో పాటు, పాత అలవాట్లు, స్నేహితులు, వ్యక్తిగత ఉద్యోగం, అవకాశాలను వదులుకోకండి. ఇది మానసికంగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. దీని తాళూకా ఒత్తిడి మీ బంధాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

మనసారా మాట్లాడుకోండి (Open Communication):

మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే మీ భాగస్వామికీ మీకూ మధ్య ఓపెన్ , నిజాయితీ కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోండి. మనసారా ఇద్దరూ మాట్లాడుకోండి, చర్చకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఫ్రీగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండండి.

కృతజ్ఞత చెప్పడం మర్చిపోకండి:

ప్రతిరోజూ మీకోసం మీ భాగస్వామి చేసిన పనులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. మీ మంచి కోసం వారు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి దాన్ని గౌరవించాలి, దాన్ని గుర్తించి వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇది పరస్పరం ప్రేమను పెంపొందిస్తుంది.

పరస్పరం సమయం కేటాయించుకోండి:

రోజంగా మీకు పని ఒత్తిడి ఉండచ్చు, జీవనశైలి సమస్యల వల్ల పరస్పరం కలిసి ఉండటానికి సమయం లేదు అనిపించచ్చు. కానీ ఇది మీ వైవాహిక జీవితానికి ఎంత మాత్రం మంచిది కాదు. పరస్పరం ప్రత్యేకంగా సమయం కేటాయించుకోకపోతే భావాలను పంచుకోలేరు, మనసారా మాట్లాడుకోలేరు. ఇది బంధానికున్న విలువను తగ్గించేస్తుంది. స్పర్దలు పెరిగి గొడవలు, చికాకులకు దారితీస్తుంది.

ఇబ్బందులను కలిసి ఎదుర్కోండి

జీవితంలో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. అటువంటి సందర్భాల్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం మంచిది కాదు. బదులుగా అటువంటి సందర్భాలను కలిసి ఎదుర్కోండి. పరస్పర సహకారంతో ఇబ్బందుల నుంచి బయటపడండి.

పరిమితులను గౌరవించండి,

వివాహం అయ్యాక భాగస్వామిగా వచ్చిన వెంటనే వారిపై పరిమితులు విధించడం సరైనది కాదు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుంది. వ్యక్తి ఇష్టాలు, అభిప్రాయాలకు అనుగుణంగా పరిమితులను గుర్తించి ముందుకు సాగితే మంచిది.

రొమాన్స్ ఉండనివ్వండి

వివాహం అయిన తర్వాత ఆనందం, ప్రేమ ఎల్లప్పుడూ ఇద్దరిలోనూ ఉండాలంటే భాగస్వామితో కాస్త రొమాంటిక్‌గా ఉండటం మర్చిపోకండి. అలాగే, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం కూడా ఆపకండి. అప్పుడప్పుడూ అయినా వారికి తెలియకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ వంటి వాటిని ప్లాన్ చేయండి. భాగస్వామికి ఆనందంగా ఉంచేందుకు మీ వంతు ప్రయత్నం చేయడం మానుకోకండి.

ప్రాధాన్యతలు ఇవ్వండి

ఎలాంటి భావం కలిగినా కూడా దాన్ని పంచుకునేందుకు మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యతగా ఉండనివ్వండి. సంతోషకరమైన విషయమైనా, దుఃఖకరమైన విషయమైనా, భాగస్వామికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి. అన్నీ వారితో పంచుకోవడం వల్ల మీ వివాహ జీవితం సంతోషకంగా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం