Headache in Children: పిల్లల్లో తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి చికిత్స అందించాలి-what are the causes and symptoms of headache in children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Headache In Children: పిల్లల్లో తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి చికిత్స అందించాలి

Headache in Children: పిల్లల్లో తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి చికిత్స అందించాలి

Gunti Soundarya HT Telugu
Dec 09, 2023 05:51 PM IST

Headache in children: పిల్లలు తరచూ తలనొప్పి అని బాధపడుతున్నారా? అసలు పిల్లలకు తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి? వైద్యులని ఎప్పుడు సంప్రదించాలి.

పిల్లల్లో తలనొప్పికి కారణాలు
పిల్లల్లో తలనొప్పికి కారణాలు (pexels )

Headache in children: ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల పెద్దల్లో తలనొప్పి వస్తుంది. కానీ పిల్లలు ఎప్పుడైనా తలనొప్పి అని చెప్తే కొట్టి పడేస్తారు. కానీ పట్టించుకోకుండా ఉంటే పిల్లలలో తలనొప్పి ఒక్కోసారి సాధారణంగా కాకుండా తీవ్రమైనదిగా వస్తుంది. ఐదు నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఎక్కువ మంది తలనొప్పి వల్ల బాధపడుతున్నారు.

పిల్లలో తలనొప్పి రావడానికి కారణాలు

పిల్లలకు వివిధ కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ మూలల నుంచి వస్తుంది. అనారోగ్యం కారణంగా తలనొప్పి రావచ్చు. జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా ఫ్లూ కారణంగా పిల్లలు తలనొప్పిని అనుభవిస్తారు. తల్లిదండ్రులకు మైగ్రేన్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. భోజనం చేయకపోయిన తలనొప్పిగా అనిపిస్తుంది. చాక్లెట్, చీజ్, కెఫిన్ వంటి ఆహారాలు లేదా పానీయాలు తీసుకుంటే దీని బారిన పడతారు. నిద్ర సరిగా లేకపోయినా పొగ, కాలుష్యం, ఘాటైన వాసన కలిగినవి పీల్చినప్పుడు తలనొప్పి వస్తుంది.

పాఠశాలలో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. తలకి గాయమైన లేదంటే మెదడులో ఏదైనా కణితి ఉన్నా కూడా తలనొప్పి వస్తుంది. అటువంటి అరుదైన పరిస్థితిలో తీవ్రమైన తలనొప్పి రావచ్చు. అటువంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులని సంప్రదించడం చాలా ముఖ్యం.

తలనొప్పి రకాలు

ఆందోళన వల్ల వచ్చే తలనొప్పి కొన్ని గంటల పాటు ఉంటుంది. ఇక మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల వికారం, వంతులు, నొప్పి, మైకం, కడుపు నొప్పి కూడా అనుభవిస్తారు. దీర్ఘకాలిక తలనొప్పి వారాలు లేదా నెలల పాటు ఉంటుంది.

తీవ్రమైన తలనొప్పి లక్షణాలు

జ్వరం, నిరంతరం వాంతులు లేదా వికారం, దృష్టిలో మార్పు, మెడ నొప్పిగా ఉంటుంది. నొప్పి తీవ్రంగా ఉంటే నిద్రపోవడంలోనూ ఇబ్బంది పడతారు. పిల్లలకు వారానికి రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువగా నొప్పి వస్తే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. తలపై దెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని కలిసి చెక్ చేయించాలి.

పిల్లల తలనొప్పిని ఎలా తగ్గించాలి

సాధారణంగా వచ్చే తలనొప్పుని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ తగ్గించుకోవచ్చు. కొన్ని తలనొప్పులు విశ్రాంతి, నిద్రతో పరిష్కారం అవుతాయి. మందులు వినియోగించకుండా చికిత్స తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా భోజనం చేయడం, అనారోగ్యకరమైన ఆహరాలు నివారించడం చేయాలి. ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. తగినంత నీటిని తాగాలి. ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. స్మార్ట్ ఫోన్, టీవీలు, వీడియో గేమ్స్ ఇవ్వకుండా అవుట్ డోర్ ఆటలు ఆడేందుకు ప్రోత్సహించాలి.

చెమట పట్టే విధంగా ఆరుబయట ఆడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. పిల్లలు హెల్తీగా ఉంటారు. తలనొప్పి ఎక్కువగా అనిపిస్తే అడ్విల్, మోట్రిన్, టైలెనాల్ వంటి ఓవర్ ది కౌంటర్ మందులు కొంత వరకు నొప్పిని తగ్గించడంలో ఉపశమనం కలిగిస్తాయి. ఇవి ఉపయోగించినప్పుడు ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్యులని సంప్రదించాలి.

Whats_app_banner