క్యాన్సర్ స్టేజ్ గురించి చికిత్సకి ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వైద్యులు క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారణ చేసుకున్న తర్వాత అది ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
క్యాన్సర్ స్టేజింగ్ అంటే ఏమిటి? శరీరంలో క్యాన్సర్ ఏ మేరకు వ్యాప్తి చెందింది? కణితి పరిమాణం ఎలా ఉంది? అనేది తెలుసుకోవడమే. దాన్నిబట్టే వారు చికిత్స చేయడం ప్రారంభిస్తారు. చికిత్సను ప్రారంభించాలంటే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవాలి.
క్యాన్సర్ స్టేజింగ్ అంటే ఒక వ్యక్తి శరీరంలో ఎంత మేరకు క్యాన్సర్ ఉంది అని కనిపెట్టే ఒక ప్రక్రియ. ఇది రోగ నిర్ధారణకు చికిత్సకు ఉపయోగపడుతుంది. ఈ క్యాన్సర్ స్టేజిలో భాగంగా కణితి పరిమాణం ఎంత ఉంది? క్యాన్సర్ సమీపంలో ఉన్న శోషరస కణుపులకు ఇది వ్యాపించిందా? లేదా? శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా? వంటివి కనుగొంటారు
క్యాన్సర్ స్టేజీ జీరో అంటే క్యాన్సర్ కణాలు అసాధారణంగా ఉన్నాయని అర్థం. కానీ అవి ఇంకా శరీరానికి వ్యాపించలేదు.
ఇది ప్రారంభ దశ క్యాన్సర్. ఒకే ప్రాంతంలో మాత్రమే పరిమితమై శోషరస కణుపులకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది.
ఈ స్టేజ్ లో క్యాన్సర్ కలిపి పెద్దదిగా ఉంటుంది. సమీపంలోని కణజాలాలకు వ్యాపించి ఉండే అవకాశం ఉంది. అయితే శోషరస కణుపులకు లేదా ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశం ఉండదు.
క్యాన్సర్ సమీపంలోని కణజాలాల్లోకి వ్యాప్తి చెందుతుంది. అలాగే అక్కడున్న కూడా వ్యాపించే అవకాశం ఉంది కానీ ఇతర అవయవాలకు ఇంకా వ్యాపించలేదని అర్థం
ఇది తీవ్రమైన స్టేజీ. ఈ స్టేజీకి చేరుకున్న పేషెంట్లు బతకడం కష్టం. శరీరంలో ఒక భాగానికి వచ్చిన క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. దీన్నే మెటాస్టాటిక్ స్టేజ్ అని కూడా అంటారు.
స్టేజీలు తెలుసుకున్న తర్వాత వైద్యులు వారికి రేడియేషన్, కీమోథెరపీ, శస్త్ర చికిత్స ఇలా ఏది ఇవ్వాలో అది అందించేందుకు నిర్ణయిస్తారు. అలాగే క్యాన్సర్ దశ తెలుసుకోవడం అనేది వారికి ఏ మేరకు చికిత్సను అందించాలో కూడా నిర్ణయిస్తుంది.
క్యాన్సర్ స్టేజింగ్ అనేది వైద్యులు రోగి క్యాన్సర్‌కు ప్రభావవంతమైన చికిత్సను అందించేందుకు సహాయపడుతుంది. కాబట్టి ముందుగా క్యాన్సర్ సోకిన రోగికి ఆ క్యాన్సర్ ఏ స్టేజీలో ఉందో తెలుసుకొని ఆ తర్వాతే వైద్యాన్ని ప్రారంభిస్తారు.
క్యాన్సర్ స్టేజీని బట్టే ఆ రోగికి ఎంత ఆయుర్దాయం ఉంటుంది? నయమయ్యే అవకాశాలు ఎంత ఉంటాయి? అనేది కూడా అంచనా వేస్తారు.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)