Exercise: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ చేయండి.. బరువు తగ్గడంతో పాటు మరో 5 ముఖ్యమైన ప్రయోజనాలు!-weight loss to muscle strength do simple exercise wall sit daily for these benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercise: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ చేయండి.. బరువు తగ్గడంతో పాటు మరో 5 ముఖ్యమైన ప్రయోజనాలు!

Exercise: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ చేయండి.. బరువు తగ్గడంతో పాటు మరో 5 ముఖ్యమైన ప్రయోజనాలు!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 08, 2024 06:30 AM IST

Exercise: కొన్ని వ్యాయామాలు సింపుల్‍గా ఉన్నా రోజూ చేస్తే మంచి ప్రయోజనాలు ఇస్తాయి. బరువు తగ్గడంతో పాటు మరిన్ని లాభాలు అందిస్తాయి. అలా, ముఖ్యమైన ప్రయోజనాలు కల్పించే ఓ సులభమైన వ్యాయామం గురించి ఇక్కడ చూడండి.

Exercise: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ చేయండి.. బరువు తగ్గడంతో పాటు మరో 5 ముఖ్యమైన ప్రయోజనాలు
Exercise: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ చేయండి.. బరువు తగ్గడంతో పాటు మరో 5 ముఖ్యమైన ప్రయోజనాలు

రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శారీరక ఫిట్‍నెస్ మెరుగ్గా ఉండటంతో పాటు సరైన బరువు మెయింటైన్ చేయవచ్చు. ఇంకా చాలా లాభాలు ఉంటాయి. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం సులుభమే అయినా మంచి ప్రయోజనాలు కల్పిస్తాయి. అలాంటి వ్యాయామమే ‘వాల్ సిట్’. తెలుగులో దీన్ని గోడ కుర్చీ అని అంటారు. పిల్లలకు పనిష్మెంట్‍గా ఇది పాపులర్ అయింది. ఈ వాల్ సిట్‍ ఎక్సర్‌సైజ్‍ను ప్రతీ రోజూ కనీసం 5 నిమిషాలు చేస్తే చాలా లాభాలు ఉంటాయి.

yearly horoscope entry point

గోడకు వీపును ఆనించి గోడకు కుర్చీ ఉన్నట్టుగా ఊహించుకొని కూర్చోవడమే వాల్ సిట్ ఎక్సర్‌సైజ్. శరీరంలోని కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది. ప్లాంక్, స్క్వాట్స్‌లాగానే మంచి ఫిట్‍నెస్ ఇవ్వగలదు. అందుకే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‍ను రెగ్యులర్‌గా చేయాలి. వర్కౌట్లలో యాడ్ చేసుకోవాలి. వాల్ సిట్ ఎక్సర్‌సైజ్ వల్ల కలిగే లాభాలు ఇవే.

బరువు తగ్గేలా..

బరువు తగ్గాలనుకునేవారికి వాల్ సిట్ ఎక్సర్‌సైజ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యాయమం వల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. వాల్ సిట్ చేసే సమయంలో కండరాలు బిగించుకొని ఉంటాయి. దీంతో క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి. అలాగే, గోడ కుర్చీ వేసిన సమయంలో గుండె స్పందన కూడా వేగంగా ఉంటుంది. ఇది కూడా క్యాలరీలు బర్న్ అయ్యేందుకు తోడ్పడుతుంది. అందుకే ప్రతీ రోజూ వాల్ సిట్ చేస్తే వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడుతుంది.

కండరాల బలం

వాల్ సిట్ చేయడం వల్ల కండరాల దృఢత్వం కూడా పెరుగుతుంది. ఈ వ్యాయామం వల్ల కాళ్లు, నడుము సహా వివిధ శరీర భాగాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో కండరాల బలం మెరుగయ్యేందుకు సహకరిస్తుంది. శరీర స్థిరత్వం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీర కింది భాగం పటిష్టత పెరిగేందుకు ఈ ఎక్సర్‌సైజ్ చాలా ఉపయోగపడుతుంది. కొవ్వు కరిగేలా చేస్తుంది. 

ఫ్లెక్సిబులిటీ మెరుగు

వాల్ సిట్ రెగ్యులర్‌గా చేస్తే శరీర ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది. ఈ వ్యాయామంలో రెండు కాళ్లపై పూర్తిగా ప్రెజర్ ఉంటుంది. దీనివల్ల బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. శరీర తేలికగా ఫీలయ్యేలా ఈ వ్యాయామం చేయగలదు.

కోర్ బలానికి..

వెన్నెముక, పొత్తి కడుపు సహా కోర్ స్టెబిలిటీని వాల్ సిట్ ఎక్సర్‌సైజ్ పెంచగలదు. గోడకు ఆనుకోని కూర్చోవడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కడుపు చుట్టుపక్కల కండరాలకు మేలు జరుగుతుంది. బిగుతుగా అయ్యేందుకు సహకరిస్తుంది.

ఏకాగ్రత పెరుగుతుంది

వాల్ సిట్ రెగ్యులర్‌గా చేయడం వల్ల ఏకాగ్రత మెరుగవుతుంది. ఎక్కువసేపు ఈ వ్యాయామంలో కూర్చోవాలంటే ఏకాగ్రత, సామర్థ్యం అవసరం అవుతాయి. దీంతో ఇది రోజు చేయడం వల్ల ఫోకస్ మెరుగవుతుంది. ఇతర విషయాల్లోనూ ఏకాగ్రత పెరిగేందుకు ఈ వాల్ సిట్ వ్యాయామం చేయగలదు.

వాల్ సిట్ ఎలా చేయాలి?

  • ముందుగా ఓ గోడకు ఆనుకోవాలి. కాళ్లను దూరంగా భుజాలకు సమాతరంగా జరపాలి.
  • కాళ్లను మందుకు తీసుకొచ్చి మోకాళ్లను వంచుతూ గోడ నుంచి క్రమంగా శరీరాన్ని కిందికి తీసుకురావాలి.
  • మోకాళ్లు 90 డిగ్రీలు వచ్చేలా చేసుకోవాలి. మోకాళ్లు పాదాల కంటే ముందుకు వంగకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • కుర్చీ ఉన్నట్టుగా గోడకు అనుకోని కూర్చున్నట్టు ఈ భంగిమ ఉంటుంది.
  • ఈ పొజిషన్‍లో వీలైనంత సమయం కూర్చోవాలి. ఆ తర్వాత మళ్లీ నిలబడాలి. దీన్ని రిపీట్ చేయాలి.

Whats_app_banner