Hing Benefits : ఇంగువ తింటే అనేక లాభాలు.. ఈరోజు నుంచే మెుదలుపెట్టండి
Benefits Of Hing : ఇంగువను చాలా మంది వంటలలో ఉపయోగిస్తారు. అయితే దీని ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇంగువ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని సాధారణంగా కొన్ని రకాల పంటల కోసం రైతులు ఉపయోగిస్తారు. పంటకు నీరు పెట్టేముందు వెళ్లే నీటిలో కరిగిపోయేలా చేస్తారు. పంట దిగుబడి పెరిగేందుకు దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అయితే దీనిని చాలా రకాల వంటకాల్లోనూ వాడుతారు. ఇంట్లో పప్పు, కూరగాయల కూరలు, ఇతర శాఖాహార వంటకాల్లో ఇంగువను ఉపయోగిస్తాం. ఇది ఆహారం రుచిని మెరుగుపరచడంతోపాటు సువాసనను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
మీరు ప్రతిరోజూ ఆహారంలో ఇంగువ తింటే, మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. పీచు, కాల్షియం, ఐరన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఇందులో ఉన్నాయి. ఇది మీ శరీరానికి మంచిది. ఇంగువ ప్రయోజనాల గురించి చూద్దాం..
జీర్ణ సమస్యలకు ఇంగువ
ఇంగువ చాలా మంది ఇళ్లలో వంటలో ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరూ తమ వంటగదిలో ఉంచుకునే మసాలాగా వాడుతారు. పచ్చి రూపంలో ఉండే ఇంగువ వాసన చాలా బలంగా ఉంటుంది. కానీ వండినప్పుడు రుచి మరింత చక్కగా మారుతుంది. ఇంగువ తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది తింటే జీర్ణ సమస్యల నుండి బయటపడొచ్చు.
ఖాళీ కడుపుతో తీసుకోండి
ఇంగువలో పీచుతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తింటే బరువు అదుపులో ఉంటుంది. ఇంగువను నానబెట్టి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీళ్లు తాగితే బరువు తగ్గుతారు.
జలుబు, దగ్గుకు మెడిసిన్
జలుబు, దగ్గుతో బాధపడితే ఇంగువ మీకు ఉపయోగపడుతుంది. దగ్గు పోవాలంటే, శ్వాసకోశ సమస్యలు దూరం కావాలంటే ఇంగువతో వంట చేసుకోవాలి. ఎందుకంటే హింగ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. మీకు పొడి దగ్గు ఉంటే లేదా బ్రోన్కైటిస్‌తో బాధపడుతుంటే.. ఆస్తమాతో బాధపడుతుంటే ఇంగువ తీసుకోవడం చాలా మంచిది.
కడుపు, చేతులు, పాదాల వాపులను తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీతో కూడిన ఇంగువ తినడం చాలా మంచిది.
మీరు రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకుంటే, మీ అధిక రక్తపోటు త్వరగా తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సీజన్ మారుతున్న సమయంలో చాలా మందికి ఊపిరితిత్తుల దగ్గు వస్తుంది. ముక్కు మూసుకుపోతుంది. శరీరం చెడుగా అనిపిస్తుంది. క్రమంగా శరీరం బలహీనంగా అనిపిస్తుంది. ఆ సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాటి నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఇంగువను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంగువతో ఇలా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే లాభాలు పొందవచ్చు.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇంగువను తినవచ్చు. బీపీని నియంత్రించేందుకు కూడా ఇంగువ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు బీపీని నియంత్రిస్తాయి. శరీరంలో రక్తం గడ్డలు ఏర్పడకుండా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది పంటి నొప్పితో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇంగువను అతిగా తినకూడదు. కొద్ది మెుత్తంలో తింటే మీ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.