Weight Loss Tips : నైట్ షిఫ్ట్ చేసే వారికి బరువు తగ్గించే చిట్కాలు-weight loss tips to night shift employees check inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Weight Loss Tips To Night Shift Employees Check Inside

Weight Loss Tips : నైట్ షిఫ్ట్ చేసే వారికి బరువు తగ్గించే చిట్కాలు

Anand Sai HT Telugu
Feb 26, 2024 02:30 PM IST

Weight Loss Tips : కొందరు నైట్ షిఫ్ట్ ఎక్కువగా చేస్తుంటారు. బరువు తగ్గించుకునేందుకు సరైన ప్రణాళిక లేకుండా ఇబ్బంది పడుతారు. అలాంటి వారు కింద చెప్పే చిట్కాలు ఫాలో అవ్వండి.

నైట్ షిఫ్ట్ వారికి బరువు తగ్గించే చిట్కాలు
నైట్ షిఫ్ట్ వారికి బరువు తగ్గించే చిట్కాలు (Unsplash)

కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన చాలా మందికి ఎక్కువగా నైట్ ఫిష్ట్స్ ఉంటాయి. తప్పక చేయాల్సిన పరిస్థితి. డబ్బు సంపాదించే ఆలోచనలో పడి.. మన ఆరోగ్యం గురించి పట్టించుకోం. దీంతో చిన్నవయసులోనే స్థూలకాయం, మధుమేహం, అధిక ఒత్తిడి వంటి వ్యాధుల బారిన పడతాం. వీటి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. నైట్ షిఫ్ట్ వారు బరువు తగ్గేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

మీరు నైట్ షిఫ్ట్ చేసేవారైతే.. ఎక్కువగా నీళ్లు తాగండి. రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం బరువు తగ్గడానికి మొదటి మార్గం. 1 గంటకు మించి కూర్చోకుండా నడవడం వల్ల శరీరంలోని జీవక్రియ స్థిరంగా ఉంటుంది. మీ మెదడు అలసిపోయినట్లు, అలసటగా అనిపించినప్పుడల్లా నీరు తాగండి. ఆ అలసట వెంటనే మాయమవుతుంది.

రాత్రంతా పనిచేసి పొద్దున్నే బయలుదేరితే ఆకలిగా ఉంటుంది. ఆ సమయంలో మీరు మీ ఆకలిని తీర్చడానికి దొరికిన ఆహారాన్ని తింటారు. ఫలితంగా బరువు పెరుగుతారు. మీరు దీన్ని నివారించాలనుకుంటే మీ ఇంట్లో పండ్లు, తాజా రసాలు, సలాడ్‌లను ఎక్కువగా ఉండాలి. ఆకలిగా అనిపించినప్పుడల్లా వీటిని తింటే స్థూలకాయాన్ని నివారించవచ్చు.

మీరు నైట్ షిఫ్ట్ వర్కర్ అయినప్పటికీ 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. తెల్లవారుజామున 3 గంటలకు పని ముగించుకుని ఇంటికి వస్తే తెల్లవారుజామున 3 నుంచి 9 గంటల మధ్య బాగా నిద్రపోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది. ఎప్పుడూ చీకటి గదిలో పడుకోండి. లైట్‌ వేసుకుని పడుకుంటే మంచి నిద్ర రాదు.

ఇప్పటికి మనలో చాలామంది రోజుకు మూడు పూటలా తినే అలవాటు మానేస్తారు. బరువు పెరగడానికి మొదటి కారణం అతిగా తినడం. నైట్ షిఫ్ట్ పూర్తయ్యాక, 6-8 గంటలు పడుకుని లేవండి. తర్వాత తిని కావాలంటే మళ్లీ పడుకోండి. నిద్రపోతున్నారని ఆహారాన్ని స్కిప్ చేయవద్దు. అల్పాహారం మానేయడం వల్ల కూడా శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.

నైట్ షిఫ్ట్ అనగానే మనలో చాలా మందికి తరచుగా గుర్తొచ్చేది కాఫీనే. పరిమితి లేకుండా అతిగా కాఫీ తాగడం వల్ల మీ నిద్ర పాడుచేస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియ మీద ప్రభావం చూపిస్తుంది. బరువు పెరుగుటకు దారితీస్తుంది.

శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. మీరు చాలా వ్యాయామం చేయవలసిన అవసరం లేదు. రోజువారీ నడక లేదా 20 నిమిషాల వరకు జాగింగ్ చేయడం వల్ల గొప్ప ఫలితాలను పొందవచ్చు.

విటమిన్ డి శరీరానికి అత్యంత అవసరమైనది. విటమిన్ డి లోపం వల్ల చాలా వ్యాధులు వస్తాయి. ఏసీ గదిలో కూర్చుని బరువులు ఎత్తడం కంటే సూర్యకాంతిలో కొంత సమయం గడపండి. అది సాధ్యం కాకపోతే మీ ఆహారంలో ఎక్కువ గుడ్లు, పాలు, పప్పులను చేర్చండి. ఇది శరీరం బరువు పెరగకుండా చేస్తుంది.

మనలో చాలా మందికి వేడి నీటి స్నానం అంటే ఇష్టం ఉండదు. అయితే మీరు మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందాలంటే వేడి నీటి స్నానం ఒక అద్భుతమైన పరిష్కారం. గోరువెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరాన్ని ఒకే ఉష్ణోగ్రతలో ఉంచుకోవచ్చు. నైట్ షిప్ట్ చేసి వచ్చాక.. ఓట్స్, రెడ్ రైస్, గోధుమలు వంటి ఆహారాలు తింటే మీ బరువు ఖచ్చితంగా అదుపులో ఉంటుంది.

WhatsApp channel