Weight Loss: తిండి మారితే చాలు, ఇంట్లో కూర్చొనే 10 కిలోల బరువు తగ్గచ్చట, ఫిట్‌నెస్ కోచ్ ఇచ్చిన 4 సింపుల్ టిప్స్ ఇవిగో!
Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? బరువు తగ్గడానికి బయటకు వెళ్లేంత తీరిక లేక సతమతమవుతున్నారా? ఆందోళన చెందకండి. ఫిట్‌నెస్ కోచ్ విమల్ రాజ్‌పుత్ ఇచ్చిన ఈ నాలుగు సింపుల్ టిప్స్‌తో మీ లైఫ్‌స్టైల్ మార్చుకోండి. సునాయాసంగా 10 కిలోల వరకు బరువు తగ్గండి.

ప్రస్తుత జనరేషన్ ఫాలో అవుతున్న లైఫ్‌స్టైల్ బట్టి బరువు పెరగడం చాలా సాధారణమైపోయింది. మన ఆహారపు అలవాట్లు, మొత్తం జీవనశైలి బరువు పెరగడానికి దారితీస్తున్నాయి. ఎంత వేగంగా బరువు పెరుగుతున్నారంటే, మళ్లీ ఎంత కష్టపడినా బరువు తగ్గలేకపోతున్నారు. అంతేకాకుండా, ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. అదే బరువుతో ఉన్నప్పటికీ సమస్యలే. బరువు అమాంతం తగ్గినా కూడా సమస్యలే. మరి ఈ సమస్యకు పరిష్కారంగా క్రమంగా బరువు తగ్గే చిట్కా తన దగ్గర ఉందంటున్నారు న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్ కోచ్ విమల్ రాజ్‌పుత్. ఇన్‌స్టాగ్రామ్ బయోలో బరువు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పంచుకున్నారు.
మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువు తగ్గింపు సాధ్యమవుతుందని చెప్తున్నారు. వీటిని పాటించడం ద్వారా మీరు 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చట. మరి అవేంటో చూసేద్దామా!
రోజుకు 10,000 అడుగులు నడవండి
ఫిట్‌నెస్ కోచ్ విమల్ ప్రకారం, మీరు రోజూ సుమారు ఒక గంట పాటు నడవాలి. ఈ ఒక గంటలో 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించండి. ఒకేసారి ఒక గంట నడవడం అవసరం లేదు. దీన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. ఉదయం లేవగానే కొంతసేపు, సాయంత్రం కొంతసేపు నడవండి, రాత్రి భోజనం తర్వాత కొంతసేపు నడిచేలా ప్లాన్ చేసుకోండి. ఇది బరువు తగ్గడంలో మాత్రమే కాకుండా, మీ మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పుష్కలంగా నీరు త్రాగండి
విమల్ రాజ్‌పుత్ ప్రకారం, బరువు తగ్గడానికి శరీరాన్ని సరిగ్గా హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ముఖ్యంగా ఉదయం లేవగానే వెచ్చని నీరు త్రాగండి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా, రోజంతా ఆహారం మధ్యలో నీరు త్రాగుతూ ఉండండి. ఇది ఆకలిని అదుపులో ఉంచుతుంది, తద్వారా మీరు తక్కువ కేలరీలు తీసుకుంటారు. ఇది మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మం పనితీరు మెరుగు చేయడానికి కూడా సహాయపడుతుంది.
సలాడ్స్‌ను మీ ఆహారంలో చేర్చండి
ఫిట్‌నెస్ కోచ్ ప్రకారం, మీ ఆహారంలో ఒక పెద్ద ప్లేట్ సలాడ్‌ను చేర్చాలి. సలాడ్‌లో రంగురంగుల కూరగాయలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చండి. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బరువు తగ్గించుకోవడానికి మీరు తీసుకునే కేలరీలను తగ్గించినప్పుడు, సలాడ్ సరైన పోషకాహారాన్ని అందించడానికి, కడుపు నిండుగా ఉంచడానికి బెస్ట్ ఆప్షన్ అని మీకే అర్థమవుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా మానేయండి
బరువు పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. ముఖ్యంగా జంక్, ప్రాసెస్ చేసిన ఆహారం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతాం. ఫిట్‌నెస్ కోచ్ విమల్ ప్రకారం, మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మీ ఆహారం నుండి పూర్తిగా తొలగించాలట. దాని స్థానంలో పోషకాలతో నిండిన హోల్ ఫుడ్స్‌ను చేర్చుకుంటే బెటర్. ఇవి మీకు శక్తిని అందించి, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
సంబంధిత కథనం
టాపిక్