Wednesday Quote | గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకు!-wednesday quote try and try again no matter what a day will come ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Wednesday Quote, Try And Try Again No Matter What, A Day Will Come

Wednesday Quote | గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకు!

Thursday Quote:
Thursday Quote: (Pixabay)

Wednesday Quote: మీరు ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కడం లేదా? మిమ్మల్ని మీరు ఒక లూజర్ అనుకుంటున్నారా? ఏమాత్రం కాదు. ప్రయత్నించిన వాడు ఓడిపోయినా కూడా విజేతనే. ఈ స్టోరీ చదవండి. రేపటి గెలుపుకు మీరే ఒక ఉదాహరణ అవ్వండి.

అందరి జీవితం ఒకేలా ఉండదు, జీవితం ఎవరికీ అంత సులభమైన కాదు అని ఆనాడే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే నీకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, వేరొకరికి లేవు అనుకుంటే పొరపాటే. ఎవరి జీవితం వారిదే, ఎవరి కష్టాలు వారివే. ప్రతి ఒక్కరి జీవితంలో అటుపోట్లు అనేవి కచ్చితంగా ఉంటాయి. ఎదురొడ్డి నిలబడిన వాడు విజేత అవుతాడు. ఈరోజు నీది కాకపోవచ్చు, నిన్న నీది కాకపోవచ్చు, మొన్న కూడా నీది కాకపోవచ్చు, రోజూ కూడా నీది కాకపోవచ్చు. కానీ ఒక రోజు అనేది వస్తుంది, ఆ వచ్చిన రోజు నువ్వు వెనుదిరిగి చూడవు. అది జరగాలంటే ప్రయత్నం అనేది ఉండాలి. ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు.

ట్రెండింగ్ వార్తలు

ఓటమి అనేది ముగింపు కాదు, ఓటమి అనేది మరలా ప్రయత్నించటానికి ఒక అవకాశం. వ్యక్తులు, పరిస్థితులు, కాలం నీ శత్రువులు కాదు. నీ ఓటమినే నీ శత్రువు అనుకో, నీ ఓటమి ఎంత గొప్పగా ఉంటే అంతకు మించిన ప్రయత్నం చేయి. ఓటమితో పోరాడుతూనే ఉండూ ఆ తర్వాత నీకు దక్కే విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది జరగని పని, ఇది అసాధ్యం అనుకునే వారికి నువ్వే ఒక ఉదాహరణగా ఉంటావు. నీ గెలుపే ఒక సమాధానంగా ఉంటుంది.

మన ప్రయత్నంలో లోపం లేనపుడు, మనం ఓటమి చెందినా కొన్నిసార్లు పరిస్థితులే మనకు మళ్లీ అవకాశాలు కల్పిస్తుంది. ఎలా అంటే ఉదాహరణకు ప్రపంచంలో జరిగినా తాజా ఘటనలే వివరించుకుందాం. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామాతో అక్కడ ఎన్నికలు వచ్చాయి, భారత సంతతికి చెందిన రిషి సునక్ కూడా పోటీలో నిలబడ్డారు. అయితే రిషి మనవాడు కాదు, అతడికి తప్ప వేరే ఎవరినైనా గెలిపించండి అని జోరుగా ప్రచారం చేస్తే లిజ్ ట్రస్ గెలిచింది, రిషి ఓడిపోయారు. సరిగ్గా చెప్పాలంటే పోరాడి ఓడారు. కానీ 45 రోజులకే పరిస్థితులు మారాయి. ప్రధానిగా లిజ్ ట్రస్ తప్పుకోవడంతో, మాకు ఏ దిక్కు లేదు ఇక మీరే దిక్కు అని రిషి సునక్ వైపు అందరి కళ్లు చూశాయి. ఆయన ప్రధాని అయ్యారు, మనది కానీ గడ్డపై కూడా జెండా పాతారు, చరిత్ర లిఖించారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిందేమిటంటే ప్రయత్నంతో పాటు, ఓపిక ఉండాలి. ఆశావాదా దృక్పథం ఉండాలి. ప్రధాని కోసం ప్రయత్నం చేశారు కాబట్టే అది దక్కింది. ఆ ప్రయత్నం అనేదే లేకపోతే?

మరొక ఉదాహరణ, ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్. మనం గెలవలేం అనుకున్న మ్యాచ్ లో గెలిచేందుకు ప్రయత్నిద్దాం అనే తీరుగా ఆటసాగింది. చివరకు గెలిచాం కదా. నిలకడ లేకుండా రెండేళ్లుగా సరైన ఆట కనబరచని విరాట్, ప్రయత్నం చేస్తూ చేస్తూ చివరకు హీరోగా నిలిచాడు.

కాబట్టి మన చుట్టూ ఘటనలే మనకు స్ఫూర్తి, మన ఓటమే మనకు అవకాశం. ప్రయత్నించండి, పోరాడి ఓడతాం లేదా గెలుస్తాం.

WhatsApp channel

సంబంధిత కథనం