Wednesday Motivation : ఎదుటివారిని బాధపెడితే.. నీ బాధ తగ్గదు బ్రో..
Wednesday Motivation : మనం బాధలో ఉన్నా.. కోపంలో ఉన్నా.. ఎదుటివారిని ఏదిపడితే అది అనకండి. ఏదైనా అనేముందు ఆలోచించండి. ఎందుకంటే.. మీరు కోపంలో, బాధలో అనేమాట ఎదుటివారిని ఎంత బాధపెడుతుందో మీరు ఊహించలేరు. పైగా ఆమాటను మనం ఏమి చేసినా వెనక్కి తీసుకోలేము.
Wednesday Motivation : ఏదైనా గొడవజరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చాలా కోపంగా ఉంటాము. లేదా ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. ఆ సమయంలో ముందు వెనుకా ఆలోచించకుండా ఎదుటివారిని ఓ మాటా అనేస్తాము. నిజానికి మాటా అనాలనే ఉద్దేశం లేకపోయినా.. పరిస్థితులు మిమ్మల్ని అలా అనేలా చేస్తాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కంట్రోల్లో ఉండడం చాలా ముఖ్యం. అలా మాటా అనాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండడమే చాలా మంచిది. వారు ఏదో అన్నారని.. మీరు కూడా అని.. అదే తప్పు చేయడం సరికాదు కదా.
ట్రెండింగ్ వార్తలు
ఆ సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే.. వారిని బాధ పెడితే నా బాధ తగ్గుతుందా అని ప్రశ్నించుకోవాలి. ఎదుటివారు మనల్ని వారి మాటలతోనో.. చేతలతోనో బాధపెడుతూ ఉండొచ్చు. కానీ వారికి మనం కూడా అదే బాధ ఇవ్వడం వల్ల మీ బాధ కొంచెమైనా తగ్గుతుందా? అంటే నో అనే చెప్పాలి. అలా బాధపెట్టడం వల్ల తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కానీ.. ఆ ఒక్కమాట అనకుండా.. ఆ పని చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని జీవితాంతం మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది.
అవును నిజమే.. ఆ సమయంలో మీరు మీ భావాలను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. వారికి బదులు చెప్పి.. లేదా వారిని ఒక మాట అంటే.. మన బాధ కాస్తైనా తగ్గుతుంది అనిపిస్తుంది. కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు. కానీ మీరు ప్రశాంతంగా.. సైలంట్‌గా ఉంటే.. పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశముంటుంది.
మిమ్మల్ని ఎవరైనా బాధపడితే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఎంత బాధ కలుగుతుంది. చూస్తూ చూస్తూ మీరు ఎదుటివారికి అంత బాధను ఇవ్వగలరా? ఎంత అనుకున్నా మనం వారికి బాధను ఇవ్వలేము. ఇవ్వకూడదు కూడా. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదుటివారిని బాధపెడితే మీ బాధ తగ్గదు. పైగా వారిని ఏమి అనకుండా మీరు సైలంట్‌గా ఉంటే.. వాళ్లే ఫీల్ అవుతారు. అరె మనం ఎన్ని మాటలు అన్నా.. తిరిగి ఒక్కమాట కూడా అనలేదని.. వారు చేసిన తప్పుగురించి బాధపడతారు.
అయినా బాధ తీరుతుందని మీరు ఒక్కమాట అన్నా.. దానిని తిరిగి వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మాట అనేముందు ఆలోచించండి. ప్రతి పరిస్థితిని తెలివిగా ఎదుర్కోనండి. మీరు బాధపడినా.. ఇతరులను బాధపెట్టకుండా.. బాధించకుండా.. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సంబంధిత కథనం