Wednesday Motivation : ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. అమ్మే అతడి సైన్యం-wednesday motivation the life story of praggnanandhaa and his mother inspiration many ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation The Life Story Of Praggnanandhaa And His Mother Inspiration Many

Wednesday Motivation : ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. అమ్మే అతడి సైన్యం

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 05:00 AM IST

Wednes Day Motivation : నా జీవితంలో ఇది.. లేదు. పనికిరాని విషయాలే ఎక్కువ జరుగుతున్నాయి.. ఇలాంటి ఫిర్యాదులే నూటికి తొంబై తొమ్మిది మంది ఇస్తారు. కానీ ఒక్కరే జీవితంలో ముందుకు వెళ్తారు. అలాంటి వాళ్లు బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. పెద్దగా ఏం ఉండదు. చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద జీవితం కూడా అలాంటిందే.

ప్రజ్ఞానందతో తల్లి నాగలక్ష్మి
ప్రజ్ఞానందతో తల్లి నాగలక్ష్మి (twitter)

జీవితం మీద కంప్లైంట్స్ ఎవ్వరైనా ఇస్తారు.. కానీ కంప్లైంట్స్ లేని జీవితాన్ని నిర్మించుకోవడంలోనే అసలు కిక్కు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చామన్నది.. కాదు ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ఈ లోకం చూస్తుంది. ఎవరూ సాధించలేని గెలుపును నువ్ ముద్దాడితే.. నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. కొన్ని రోజులుగా.. ఓ తల్లి కొడుకు.. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లేవరో కాదు.. చెస్ గ్రాండ్ మాస్టర్, అతడి తల్లి. ఆ కొడుకు కోసం తల్లి ఎంత యుద్ధానికైనా సిద్ధమేనన్నట్టుగా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. టీవీ ఎక్కువ చూడొద్దనే ఉద్దేశంతో పిల్లలు ఆడుకునేందుకు చెస్ కొనిచ్చింది. అప్పుడు ఆ తల్లి చేసిన పనే.. ఇప్పుడు తన కొడుకును ప్రపంచం చూసేలా చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్‍లో గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఫైనల్‍లో గెలవలేదు అనేది అందరికీ తెలుసు. కానీ అతడు ప్రపంచం దృష్టిలో ఎప్పుడో విన్నర్.

ప్రజ్ఞానందది చిన్నకుటుంబం. పెద్దగా ఆస్తులు కూడా ఏం లేవు. అందరి పిల్లలాగే ప్రజ్ఞానంద కూడా చిన్నప్పుడు టీవీలో కార్టూన్లు ఎక్కువగా చూసేవాడు. అక్క వైశాలి కూడా కార్టూన్లకు అలవాటు పడింది. దీంతో తండ్రి రమేష్ బాబు, తల్లి నాగలక్ష్మి ఆందోళన చెందారు. ఎలాగైనా టీవీ చూడటం మాన్పించాలనుకున్నారు. అందుకే చెస్ బోర్డు తీసుకొచ్చారు. వైశాలి టీవీ నుండి చదరంగం వైపు మళ్లడంతో, 3 ఏళ్ల ప్రజ్ఞానంద కూడా తన అక్కతో కలిసి ఆట చూడటం ప్రారంభించాడు.

వైశాలి కొత్త అభిరుచి ప్రజ్ఞానానంద ఆసక్తిగా మారింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కార్టూన్‌కి దూరంగా చదరంగం ఆడటం మొదలుపెట్టారు. చిన్నతనంలోనే చదరంగం ఆటపై కూడా పట్టు సాధించాడు ప్రజ్ఞానంద. విశేషమేమిటంటే.. ఇంతటి మార్పు తండ్రి కూడా ఊహించలేదు. 2016లో, 10 ఏళ్ల ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్‌లో లిటిల్ మాస్టర్‌గా నిలిచాడు. అక్కడి నుంచి కోచ్ కూడా ఈ చిన్నారికి చెస్‌లో భవిష్యత్తు ఉందని భావించాడు. ఆ అంచనాలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. ప్రపంచ ఛాంపియన్‌ ముందు ప్రజ్ఞానంద విజయం సాధించాడు. అతను చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడాడు. అంతే కాకుండా భారతదేశానికి భవిష్యత్ చెస్ మాస్టర్ అయ్యాడు.

ప్రజ్ఞానంద.. ఆటకు తల్లి నాగలక్ష్మి వెన్నుముక. నాగలక్ష్మి టోర్నీలకు తీసుకెళుతుంది. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లాలంటే కొంతమంది భయపడుతుంటారు. కానీ తన కొడుకుని భాష తెలియని సుదూర పట్టణాలకు తీసుకెళ్లింది నాగలక్ష్మి. ప్రతీ పురుషుడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందనే విషయాన్ని నిజం చేసింది. ఎక్కడ పోటీలు జరిగినా.. ఓ మూలన కూర్చొని.. దేవుడిని ప్రార్థిస్తుంది నాగలక్ష్మి. నిజంగా.. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. కొడుకు కోసం ఓ సైన్యంలా తయారై ముందుకు వెళ్తుంది ఆ తల్లి.

WhatsApp channel