Wednesday Motivation : మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే చాలు.. ఇంకేమి అవసరం లేదు..-wednesday motivation on if you don t love yourself you ll always be chasing after people who don t love you either ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation On If You Don't Love Yourself, You'll Always Be Chasing After People Who Don't Love You Either.

Wednesday Motivation : మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే చాలు.. ఇంకేమి అవసరం లేదు..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 22, 2022 09:42 AM IST

మీ జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. ఇతరులనుంచి ప్రేమను పొందాలని.. మీ జీవితంలోని ఆనందాలను కోల్పోకండి. మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించి.. మీ లోపాలను యాక్సెప్ట్ చేసి.. ముందుకు సాగుతున్నప్పుడు.. ఇతరులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. పైగా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

కోట్ ఆఫ్ ది డే
కోట్ ఆఫ్ ది డే

Wednesday Thought : ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా ఎక్కువగా ప్రేమించే ముందు.. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోండి. ఎందుకంటే మీ జీవితంలో ఆనందం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇతరులను ప్రేమించాలని.. వారిని దక్కించుకోవాలనే ఆతృతలో మీరు మీ ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే.. ఎదుటివారిని కూడా మీరు మనస్పూర్తిగా ప్రేమించలేరు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయినా.. మీరు మీపై నమ్మకం లేకుండా ఉంటే.. వారు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. 

మీరు మీ జీవితంలో తగినంత సంతోషంగా లేకుంటే.. జీవించడంలో అర్థం లేదు. అలాంటి సమయంలో మన జీవితంలో సంతోషంగా ఉండేందుకు ఏమేమి చేయాలో అన్ని పనులు చేయాలి. కానీ కొన్నిసార్లు మనం కోరుకున్న ఆనందాన్ని సాధించడంలో విఫలమవుతాము. ఆ సమయంలో మీరు సంతోషంగా ఉండాలంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సెల్ఫ్​ లవ్​ అనేది ప్రతి వ్యక్తికి ఉండాల్సని ఓ మంచి అలవాటు. అవును దీనిని అలవాటుగా మార్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇతరుల వల్ల మీరు హ్యాపీగా ఉండరని గుర్తించినప్పుడు.. మీ ఆనందాన్ని మీరు ఒక్కరే వెతుక్కునేలా ఉండాలి. ఆ ఆనందాన్ని మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. మీరు ఆనందంగా ఉండకుండా ఎవరూ ఆపలేరు. ఇది మీ జీవితాన్ని ఇంకా మెరుగ్గా చేస్తుంది.

అంతేకాకుండా సెల్ఫ్ లవ్​ మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఇది మీకు సమాజంలో గౌరవాన్ని కూడా ఇస్తుంది. సంతోషంగా ఉండటానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి. కానీ కొన్నిసార్లు మనల్ని మనం ప్రేమించుకోవడంలో విఫలమవుతాం. ఆ కారణంగా నిరాశ, ఆందోళనకు గురవుతాము. అంతేకాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించకపోవడం వల్ల మిమ్మల్ని ప్రేమించని వ్యక్తులను వెంబడించేలా చేస్తుంది. ఆ సమయంలో మీరు ఎలా ఉంటారంటే.. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను మీరు కూడా గుర్తించలేరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు మీరు మంచి మనిషిగా అభివృద్ధి చెందుతారు. ఇతరులకు సేవ చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడం ఎప్పటికీ తప్పు కాదు. ఇది మీ విశ్వాసాన్ని పెంపొందించి.. మీరు జీవితంలో ముందుకు సాగేలా చేస్తుంది. 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్