Wednesday Motivation : మొక్కై వంగనిది.. మానై వంగునా? అందుకే మీ పిల్లలకు ఈ మాటలు చెప్పండి
Wednesday Motivation : పిల్లలు చిన్న మెుక్కల వంటివారు.. మనం వాటిని పెంచితే ఫలాలు ఇస్తాయి. అలాగే చిన్నపిల్లలకు కూడా.. తల్లిదండ్రులు ఎల్లప్పుడు సానుకూల, ఉత్తేజకరమైన పదాలతో ప్రోత్సహించాలి.
మొక్కై వంగనిది.. మానై వంగునా అనే ఓ గొప్ప సామెత ఉంది. అంటే చిన్నప్పుడే.. మంచిని నేర్పించాలి. చెడుగు దూరంగా ఉంచాలి. పెద్ద అయ్యాక.. ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని దాని అర్థం. నిజానికి చిన్న పిల్లలకు మంచి మాటలు చెబుతూ పెంచాలి. ఓడిపోయినప్పుడు తిరిగి లేవడానికి, విఫలమైనప్పుడు నిరుత్సాహపడకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించడానికి, గెలిచినప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండటానికి, కొత్త విషయాలను ప్రయత్నించడానికి వారిని ప్రేరేపించాలి.
దీని కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు. బిడ్డను పరిశీలిస్తూ ఉండటం, అవసరమైనప్పుడు ప్రేరణాత్మక పదాలను వారికి చెప్పడం మాత్రమే చేయాలి. మీ పిల్లలు రేపటి రోజు విజయం సాధించడానికి ఈరోజే మీరు చెప్పే మంచి మాటలు ఉపయోగపడతాయి కావొచ్చు. పిల్లలలో సానుకూలతను నింపే, జీవితంలో వారికి స్ఫూర్తినిచ్చే కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి.
పిల్లలూ ప్రపంచం మారుతూ ఉంటే చూడటం కాదు.. ఆ మార్పులో నీ పాత్ర ఏంటనేది ముఖ్యం.
మీకు మంచి ఆలోచనలు ఉంటే అవి మీ ముఖం నుండి సూర్యకిరణాల వలె ప్రకాశిస్తాయి. మీరు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు.
అందరికంటే.. భిన్నంగా ఉండటం చెడ్డ విషయం కాదు.. ఎందుకంటే.. మీరు ధైర్యంగా ఉన్నారని అర్థం.
నేను నమ్మిన దానికంటే మీరు ధైర్యవంతులు, కనిపించే దానికంటే బలంగా ఉన్నారు.. మీరు అనుకున్నదానికంటే తెలివిగా ఉంటారు. ముందు నిన్ను నువ్వు నమ్ముకో..
కావాలనుకున్న విషయం కోసం ప్రయత్నించి.. చాలాసార్లు విఫలం కావచ్చు.. కానీ మీరు ప్రయత్నించడం మానేస్తే జీవితంలోనే విఫలమవుతారు.
మీరు పెద్ద పనులు చేయకపోవచ్చు.. కానీ చేసే చిన్న పనుల గురించి పెద్దగా ఆలోచించు.
ఒక పుస్తకం, ఒక పెన్, ఒక పిల్లవాడు, ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని మార్చగలడు.
వృద్ధులు పోరాడగలరు, కానీ పిల్లలు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు.
పిల్లలు పెద్దల మాట వినకపోవచ్చు, కానీ ఎప్పుడూ పెద్దలు చేసే పనులనే అనుకరిస్తారు.
సాయం చేయడం గొప్ప కాదు.. చేసిన సాయం గురించి చెప్పి మెప్పుపొందకుండా ఉండటం గొప్ప.
కొన్నిసార్లు విజయానికి మార్గం అంత సులభం కాదు. ప్రయత్నాలు మాత్రం మళ్లీ మళ్లీ ఉండాలి.
అదృష్టం అనేది ఎక్కడో లేదు.. అది మనలోనే ఉంది.. దాన్ని కనుగొనడానికి నువ్ ధైర్యంగా ఉండాలి.