Wednesday Motivation : మనసులో అనుకుందే చేయి.. ఆగిపోతే ముందుకు సాగలేవు-wednesday motivation do what you want for your happiness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation Do What You Want For Your Happiness

Wednesday Motivation : మనసులో అనుకుందే చేయి.. ఆగిపోతే ముందుకు సాగలేవు

HT Telugu Desk HT Telugu
Sep 13, 2023 05:00 AM IST

Wednesday Motivation : కొంతమంది మనసులో అనుకున్నది బయటకు చెప్పలేరు. దీంతో వారికి ఎలాంటి లాభం ఉండదు. పరిస్థితి చేయి దాటిపోయాక.. మాత్రమే అలా చేస్తే బాగుండు కదా అనుకుంటారు. అందుకే అనుకున్నది చేయాలి.. బయటకు చెప్పేసేయాలి.

మోటివేషన్
మోటివేషన్

ఓ గురువు తన శిష్యుల కోసం సైకిల్ తీసుకొచ్చాడు. అయితే అందులో ఒకరికి మాత్రమే ఇస్తానని కండీషన్ పెట్టాడు. రోజూ మీరు బజారుకెళ్లి నడిచి వస్తున్నారని.. అయితే మీలో ఎవరు నాకు సరైన సమాధానం చెబుతారో వారికే సైకిల్ ఇస్తానని చెబుతాడు. మీకు సైకిల్ ఎందుకు? సైకిల్ ఎందుకు తొక్కాలని అనుకుంటున్నారు? అని గురవు ప్రశ్నించాడు. వీటికి సరైన సమాధానం చెప్పిన వారికే ఇస్తానని తెలిపాడు. ఆ ఐదుగురు గురవుకు భిన్మమైన సమాధానాలు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

మొదటి శిష్యుడు గురువుతో ఇలా అన్నాడు. 'బయటకు వెళ్లినప్పుడు కూరగాయలు తీసుకురావడం ఇబ్బంది అవుతుంది. సైకిల్ ఉంటే త్వరగా వెళ్లి త్వరగా వచ్చేస్తాను. నా వీపుపై మోయడం కంటే సైకిల్ మీద తీసుకురావడం సులభం.' అని మెుదటి శిష్యుడు చెప్పాడు. నువ్వు చాలా చురుకైనవాడివి, పెద్దయ్యాక నా అంత వాడివి అవుతావులేనని చెప్పాడు గురువు.

రెండో శిష్యుడు గురువుతో ఇలా చెప్పాడు..'నేను ప్రకృతిని ఆస్వాదించడానికి సైకిల్ తొక్కుతాను.' అని అనగా.. నీ కళ్ళు తెరిచి ఉన్నాయి, మీరు ప్రపంచాన్ని చూస్తారు అని గురువు అంటాడు. మూడో శిష్యుడు.. నేను సైకిల్ తొక్కుతూ మంత్రం పఠిస్తూనే ఉంటాను అన్నాడు. దానికి గురువు.. కొత్త చక్రాల వంటి ఆలోచనలు మీ మనస్సులో తేలికగా ప్రవహిస్తాయి.. అని ప్రశంసించారు.

నాల్గో శిష్యుడు నేను అందరికంటే ముందుగా వెళ్లాలలని సైకిల్ తొక్కుతాను అని చెబుతాడు. ఓ నువ్ జీవితంలో మంచి ప్రయాణం చేస్తావులేనని గురువు చెప్పాడు. ఇక ఐదో శిష్యుడు మాత్రం.. నాకు సైకిల్ తొక్కాలని అనిపిస్తుంది కాబట్టి.. సైకిల్ కావాలని అంటాడు. దీంతో గురువు శిష్యునికి నమస్కరించి 'నేను నీకు శిష్యుడను' అని అన్నాడు.

ఎందుకంటే మెుదట నలుగురు శిష్యులు గురువు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని భావించి తమ మనసులో నిజాన్ని దాచుకుని భిన్నమైన సమాధానాలు చెప్పారు. అయితే ఆఖరికి చెప్పిన శిష్యుడు తన మనసులోని నిజాన్ని చెప్పాడు. దీంతో గురువుకు సమాధానం నచ్చి సైకిల్ ఇచ్చేస్తాడు. జీవితంలో ఏదైనా విషయం ఉంటే.. భయం లేకుండా చెప్పాలి. లేకుంటే ఎప్పటికీ చెప్పలేరు. ముందుగు సాగలేరు.

WhatsApp channel